వెస్ట్ బెంగాల్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం లోని 20 జిల్లాలలో ఉత్తర 24 పరగణాలు జిల్లా (బెంగాలీ : উত্তর চব্বিশ পরগণা জেলা) ఒకటి. ఈ జిల్లా ఉత్తర అక్షాంశం 22º11'6, 23º15'2, తూర్పు రేఖాంశం 88º20, 89º5 డిగ్రీలలో ఉపస్థితమై ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో నాడియా జిల్లా, ఈశాన్య సరిహద్దులో బంగ్లాదేశ్ (ఖుల్నా విభాగం), దక్షిణ సరిహద్దులో దక్షిణ 24 పరగణాలు, కొలకత్తా, పశ్చిమ సరిహద్దులో హౌరా, హుగ్లీ జిల్లాలు ఉన్నాయి. జిల్లాకు బారాసాత్ పట్టణం కేంద్రంగా ఉంది. ఈ జిల్లా పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా జనసంఖ్య కలిగిన జిల్లాగా గుర్తించబడుతుంది.[2] వైశాల్యపరంగా ఈ జిల్లా రాష్ట్రంలో 10 వ స్థానంలో ఉంది. అలాగే జనసంఖ్యా పరంగా ఈ జిల్లా దేశంలో 2 వ స్థానంలో ఉంది.[2] ఇది కోల్‌కాతా మెట్రోపాలిటన్ ప్రాంతంలో భాగంగా ఉంది.
North 24 Parganas (24 PGS N) జిల్లా
উত্তর চব্বিশ পরগণা জেলা | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | West Bengal |
డివిజను | Presidency |
ముఖ్య పట్టణం | Barasat |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | Bangaon, Barrackpore, Dum Dum, Barasat, Basirhat |
• శాసనసభ నియోజకవర్గాలు | Bagda, Bangaon Uttar, Bangaon Dakshin, Gaighata, Swarupnagar, Baduria, Habra, Ashoknagar, Amdanga, Bijpur, Naihati, Bhatpara, Jagatdal, Noapara, Barrackpore, Khardaha, Dum Dum Uttar, Panihati, Kamarhati, Baranagar, Dum Dum, Rajarhat New Town, Bidhannagar, Rajarhat Gopalpur, Madhyamgram, Barasat, Deganga, Haroa, Minakhan, Sandeshkhali, Basirhat Dakshin, Basirhat Uttar, Hingalganj |
విస్తీర్ణం | |
• మొత్తం | 4,094 కి.మీ2 (1,581 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 1,00,82,852 |
• జనసాంద్రత | 2,500/కి.మీ2 (6,400/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 84.95 percent[1] |
• లింగ నిష్పత్తి | 949 |
ప్రధాన రహదార్లు | NH 34, NH 35 |
సగటు వార్షిక వర్షపాతం | 1579 మి.మీ. |
Website | అధికారిక జాలస్థలి |
ప్టోమ్లి భౌగోళిక పరిశోధనాంశాలను అనుసరించి సా.శ. 2వ శతాబ్దంలో పురాతన గంగారిది ప్రాంతం భాగీరధి, హుగ్లీ (దిగువ ప్రాంతం), పద్మా-మెఘ్న నదుల మద్య విస్తరించి ఉందని వివరిస్తుంది. పూర్వపు పౌరాణిక రాజ్యంలో ప్రస్తుత ఉత్తర 24 పరగణాలు జిల్లా ప్రాంతం దక్షిణ, ఆగ్నేయ ప్రాంతంలో ఉందని తెలుస్తుంది. బెరచంపా, దేగంగా గ్రామాలలో పురాతత్వపరిశోధనలు ఈ ప్రాంతం గుప్తరాజుల చేత నేరుగా పాలించబడలేదని తెలుస్తుంది. గుప్తరాజులు సంస్కృతీ ప్రభావం ఈ ప్రాంతం మీద పడలేదని భావిస్తున్నారు. హూయంత్సాంగ్ (770-810) భరతదేశయాత్ర కాలంలో ఈ ప్రాంతంలోని 30 బౌద్ధవిహారాలను, 100 హిందూ ఆలయాలను సందర్శించాడని వాటిలో కొన్ని గ్రేటర్ 24 పరగణాల ప్రాంతంలో ఉన్నాయని తెలుస్తుంది. జిల్లా శశాంక సమైక్య బెంగాలి సామ్రాజ్యంలో లేదని తెలుస్తుంది. అయినప్పటికీ ఈ ప్రాంతం పురాతన బెంగాలీ ప్రాంతంలోని నైరుతీ భూభాగంలో ఉండేదని భావిస్తున్నారు. అలాగే ధర్మపాల (770-810) పాలనలో ఉండేదని తెలుస్తుంది. ఈ ప్రాంతపు త్రవ్వకాలలో ధర్మపాలా పాలనా సంబంధిత చిహ్నాలేవీ లభించలేదు. అయినా సేనా శిల్పాలు లభించడంతో ఈ ప్రాంతంలో ధర్మపాలనా పాలన శక్తివంతంగా లేదని భావిస్తున్నారు.
16వ శతాబ్దం ఆరంభంలో పోర్చుగీసు నావికులు పలుజలమార్గాలలో దాడి, దోపిడీ ఆరంభించారు. అలాగే దిగువ నదీమైదానాలలో నివాసాలు ఏర్పాటుచేసుకున్నారు. హత్య, అత్యాచారం, పట్టుకుని బానిసలుగా అమ్మబడడం వంటి హింసలకు భయపడి ప్రజలు వారికి దూరంగా ఉంటూ వచ్చారు. ఉత్తర 24 పరగణాలకు చెందిన బసిర్హత్ ఉపవిభాగంలో ప్రజలు ఈ హింసకు గురి అయ్యారు.
మహారాజా ప్రతాపాదిత్య జషోరేశ్వరి కాలి ఆలయాన్ని నిర్మించాడు. ఈశ్వరీపూర్ వద్ద ఉన్న చందా భైరబ్ మందిర్ (పిరమిడ్ ఆకార ఆలయం) సేనా పాలనా కాలంలో నిర్మించబడింది. మొగల్ పాలనా సమయంలో బంషీపూర్ వద్ద నిర్మించబడిన " ఐదు గోపురాల టంగా మసీదు ", 1593లో మహారాజా బంగ్షిపూర్ వద్ద నిర్మించిన 2 పెద్దవి 4 చిన్న గోపురాలతో నిర్మించబడిన హమ్మంఖానా, కాంపూర్ వద్ద ఉన్న జహాజ్ఘటా రేవు జిల్లాలోని ప్రధానమైన నిర్మాణాలుగా గుర్తించబడుతున్నాయి.
జెసోర్ రాజు ప్రతాపాదిత్య అలాగే బెంగాల్ బారా- భూయుయాన్లలో ఒకడు. 17వ శతబ్ధంలో ప్రతాపాధిత్య మొగల్ చక్రవర్తుల సైన్యాలతో పోరాడాడు. ఆయన తండ్రి శ్రీహరి (శ్రీధర్) కాయస్తుడు. దావూద్ ఖాన్ కర్రాని ఆస్థానంలో పలుకుబడి కలిగిన అధికారిగా ఉండేవాడు. దావూద్ పతనం తరువాత ఆయన ప్రభుత్వ ఖజానాతో పారిపోయాడు. 1574లో కుల్నా జిల్లాకు దక్షిణంగా చిత్తడి భూములలో శ్రీహరి స్వయంగా రాజ్యాన్ని స్థాపించి మహారాజా బిరుదును స్వీకరించాడు. 1574లో మహారాజా శ్రీహరి తరువాత ఆయన తనయుడు మహారాజ పదవిని స్వీకరించాడు. బహరుస్థాన్ యాత్రికుడు అబ్దుల్ లతీఫ్, సమకాలీన రచయుతలు అందరూ ప్రతాపాదిత్య శక్తిసామర్ధ్యాలకు, ఆయన రాజకీయ ఔన్నత్యానికి, వస్తు సంపదకు, బలమైన యుద్ధనౌకా సామర్ధ్యానికి సాక్ష్యంగా నిలిచారు. ప్రస్తుత గ్రేటర్ జెస్సోర్, ఖుల్నా, బారిసల్ జిల్లాలు ఒకప్పటి మహారాజా ప్రతాపాదిత్య రాజ్యంలో భాగంగా ఉండేది. ఆయన జమునా, ఇచ్చామతీ నదుల సంగమస్థానంలో వ్యూహాత్మకంగా ధూంఘాట్ను తన రాజధానిగా చేసుకుని పాలన సాగించాడు.
బెంగాల్ జమీందార్లలో ఒకరైన ప్రతాపాధిత్య మొదటగా ఇస్లాం ఖాన్ చిస్తి వద్దకు విలువైన కానుకలో దూతను పంపాడు. మొగలు ప్రభుత్వ అనుకూలత కొరకు చేసిన ఈ ప్రయత్నం ఫలితంగా 1609లో ఆయన సుబేదార్ అయ్యాడు. ముసాఖానుకు వ్యతిరేకంగా సాగించే పోరులో సైనికసహాయం, ఇతరసేవలు అందిస్తానని ప్రతాపాధిత్య ఇస్లాం ఖాన్ చిస్తికు మాట ఇచ్చాడు. అయినా ఆ మాట మాత్రం నిలువలేదు. ప్రతాపాధిత్య విశ్వసరాహిత్యానికి దండనగా ఘియాస్ ఖాన్ ఆధిపత్యంలో బృహత్తర దాడిసల్పి ఈ ప్రాంతాన్ని స్వాధీనపరచుకున్నారు. తరువాత జమున, ఇచ్చామతి నదీ సంగమంలో ఉన్న ఈ ప్రాంతానికి 1611 సల్కా అని నామకరణం చేయబడింది. తరువాత ప్రతాపాదిత్య ఫెరింగ్స్, ఆఫ్గనీయులు, పఠానుల సాయంతో బలమైన సైన్యాలను ఏర్పరచుకున్నాడు. ఆయన పెద్దకుమారుడు ఉదయాదిత్య సల్కా వద్ద సహజసిద్ధమైన సరిహద్దులలో నిర్భేద్యమైన కోటను నిర్మించాడు. తరువాత జరిగిన యుద్ధంలో ఉదయాదిత్య సైన్యం ముందుగా విజయపథంలో సాగినప్పటికీ తరువాత సామ్రాజ్యానికి చెందిన సైన్యం ఉదయాదిత్య సైన్యంలో ఐకమత్యాన్నీ, క్రమశిక్షణను చెడగొట్టి ఉదయాఫిత్యపై విజయం సాధించాయి. నిస్సహాయుడైన ఉదయాదిత్య తండ్రితో కోటను విడిచి పారిపోయాడు. తరువాత జమాల్‌ఖాన్ కోటను ఖాళీ చేసి ఉదయాదిత్యను అనుసరించాడు.
కాగర్ఘాట్ కాలువ, జమునా నది సంగమంలో ప్రతాపాదిత్య రెండవసారి పోరాటం చేయడానికి సిద్ధం అయ్యాడు. అక్కడ ఆయన వ్యూహాత్మకంగా పెద్ద కోటను నిర్మించి తనకు అనుకూలంగా పెద్ద సైన్యాన్ని సమకూర్చుకున్నాడు. 1612లో ప్రతాపాదిత్య మీద దాడిచేసి ఆయనను కోటలో నిర్బంధించారు. తరువాత చక్రవర్తి సైన్యం జెస్సోరును పూర్తిగా ఓడించి కోటను స్వాధీనం చేసుకుని ప్రతాపాదిత్యను బంధీకృతుని చేసాయి. గియాస్ఖాన్ ప్రతాపాదిత్యను ఢాకాలో ఉన్న ఇస్లాం ఖాన్ వద్దకు తీసుకువెళ్ళాడు. ఇస్లాం ఖాన్ జెస్సోర్ రాజును బంధించి జెస్సోర్ రాజ్యాన్ని స్వాధీనపరచుకున్నాడు. తరువాత ప్రతాపాదిత్య ఢాకాకారాగారంలో చాలాకాం ఉన్నడు. తరువాత ప్రతాపాదిత్య చివరిదశ తెలియనప్పటికీ ఢిల్లీకి వెళ్ళేదారిలో వారణాశి వద్ద మరణించినట్లు భావిస్తున్నారు [4]
మొగల్ పాలనా సమయంలో గ్రేటర్ 24 పరగణాలు సాత్గయోన్ (పురాతన సప్తగ్రాం ప్రస్తుతం ఇది హుగ్లీ జిల్లాలో ఉంది ) ఆధ్వర్యంలో ఉండేది. మొగలాయీ పాలన తరువాత " ముర్షిద్ ఖులీ ఖాన్ " పాలనా కాలంలో ఇది హుగ్లీ చక్లాలో కలుపబడింది. 1717లో ప్లాసే యుద్ధం తరువాత నవాబు మిర్ జఫర్ జమీందార్ 24 పరగణాలు (ఈ అమీర్పూర్, అక్బర్పూర్, బలియావర్ బిరతి అజిమాబాదు, బసంధరి, బరిధతి బగ్జోలా కాళికటా, ఘర్, హతియాగర్, ఇస్లాంపూర్, దక్షిణ సాగర్, ఖరిజురి, ఖాస్పూర్, ఇక్తియార్పూర్, మగురా, మెదన్మల్లా మైదా, మాన్పుర్కు, బరాసత్, మురగచ్చ, పెచకులి, పైకాన్, రాజర్హత్, షాపూర్, షహ్నగర్, సతల్, న్యూ బర్రక్పూర్ ఆహారంపూర్, ఉత్తర పరగణా), జంగలిమహల్స్ (చిన్న పాలనా విభాగాలు)ను బ్రిటిష్ ఈస్టిండియా కంపనీ పరం చేసాడు.
అప్పటి నుండి ఇవి 24 పరగణాలు అని పిలువబడుతున్నాయి.
1751లో ఈస్టిండియా కంపనీ " జాన్ జెఫనియా హోవెల్ " జమీందారుగా నియమించింది.[5] 1759లో ప్లేసేయుద్ధం తరువాత 1756-57 రాబర్ట్ క్లైవ్ (లార్డ్ క్లైవ్) జమీందారు ( జాగీరు) గా నియమించబడ్డాడు. అయన మరణం తరువాత ఈ ప్రాంతం నేరుగా బ్రిటిష్ ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చింది.
1793లో " లార్డ్ కార్న్వాలిస్ " పాలనా సమయంలో సుందర్బన్ ప్రాంతం మొత్తం 24 పరగణాలలో చేరింది. 1802లో హుగ్లీ నది పశ్చిమ తీరం కూడా ఇందులో చేచబడింది. ఈ పరగణాలు ముందుగా నాడియా జిల్లాలో ఉండేవి. 1814లో 24 పరగణాలకు ప్రత్యేక కలెక్టర్ కార్యాలయం ఏర్పాటుచెయ్యబడింది. 1817లో ఫాల్టా, బారానగర్, 1820లో నాడియాలోని బలాండా, అన్వర్పూర్లు కూడా ఈ ప్రాంతంతో చేచబడ్డాయి. బారాసాత్, ఖుల్నా, బకర్గంజ్ (ప్రస్తుతం ఇవి బంగ్లాదేశ్‌లో ఉన్నాయి) కూడా ఈ ప్రాంతంతో కలుపబడ్డాయి. 1824లో జిల్లా కేంద్రం కొలకత్తా నుండి బరుయీపూర్కు మార్చబడింది తరువాత ఇది అలిపూర్‌కు తరలించబడింది. 1834 ఈ జిల్లాను రెండుగా (అలిపూర్-బారాసాత్) విభజించబడింది. అయినప్పటికీ తరువాత ఇది ఒకటిగా చేయబడింది. 1905లో ఈ జిల్లాలోని సుందర్బన్ సమీపప్రాంతంలో కొంతభాగం విడదీసి ఖుల్నా, బరిషల్ ప్రాంతాలతో కలుపబడింది. ఈ భూభాగాలు 1947 భారత్, పాక్ విభనన తరువాత ముందు పాకిస్థాన్ తరువాత బంగ్లాదేశ్‌లో భాగంగా మారాయి.
1993లో డాక్టర్ అశోక్‌మిత్రా ఆధ్వర్యంలోని కమిటీ ఈ జిల్లాను రెండుగా విభజించాలని సూచించింది. తరువాత ఈ ప్రాంతం దక్షిణ 24 పరగణాలు, ఉత్తర 24 పరగణాలు జిల్లాలుగా విభజించబడింది. ఉత్తర 24 పరగణాలులో ప్రెసిడెన్సీ విభాగం 5 సబ్డివిషన్లుగా ( బరసాత్ (జిల్లాకేంద్రం), బర్రాక్పోర్, బసిర్హత్, బంగయోన్, బిదన్నగర్ ( కొలకత్తా శాటిలైట్ టౌన్‌షిప్‌గా గుర్తించబడుతుంది. దీనిని సాల్ట్ సిటీ అని కూడా అంటారు)) విభజించబడ్డాయి.
ఉత్తర 24 పరగణాలు జిల్లా గంగా - బ్రహ్మపుత్ర నదీ మైదానం మద్య ఉపస్థితమై ఉన్నాయి. జిల్లా పశ్చిమ తీరం మొత్తం గంగానది ప్రవహిస్తుంది. జిల్లాలో ఇచ్చామతి, జమున, బిద్యాధరి నదులు ప్రవహిస్తున్నాయి.
అక్ష్క్షాంశం: 23°15'ఉత్తర - 22°11' ఉత్తర
రేఖాంశం: 89°5'తూర్పు - 88°20'తూర్పు
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఆర్సెనిక్ పాషాణంతో కలుషితమైన భూగర్భజాలున్న 7 జిల్లాలలో (కొలకత్తాతో సహా) ఉత్తర 24 పరగణాలు జిల్లా ఒకటి. జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయానికి చెందిన " స్కూల్ ఆఫ్ ఎంవిరాన్మెంటల్ స్టడీస్ " సర్వే అనుసరించి జిల్లాలోని 22 మండలాలలో 16 మండలాలలో ఆర్సెనిక్ కలుషిత భూగర్భజలాలు ఉన్నాయని తెలుస్తుంది. బదురియా మండలంలో అత్యధికంగా ఆర్సెనిక్ కలుషిత భూగర్భజలాలు ఉన్నాయని భావిస్తున్నారు.
జిల్లాలో మిగిలిన బెంగాల్ పశ్చిమ బెంగాల్ గంగానదీ మైదానంలో ఉష్ణమండల వాతావరణం నెలకొని ఉంది. ఈ ప్రాంతంలో జూన్ మాసం నుండి సెప్టెంబరు మాసం వరకు వర్షపాతం ఉంటుంది. వాతావరణం శీతాకాలంలో పొడిగానూ వేసవికాలంలో తేమగానూ ఉంటుంది.
ముస్లిములు సాధారణంగా తోటలు, మత్స్య పరిశ్రమను జివనోపాధిగా ఎంచుకున్నారు. జిల్లా ప్రజల సరాసరి వ్యవసాయ భూమి 3.2 బిఘాలు. పరిశ్రలలో పనిచేసే వారిలో అత్యధికంగా బంగ్లాదేశ్ నుండి వచ్చిన శరణార్ధులు ఉన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఆర్థికంగా తక్కువగా వెనుకబడిన జిల్లాలలో ఉత్తర 24 పరగణాలు ఒకటి. జిల్లా దక్షిణ భూభాగంలో ఉన్న సుందర్బన్ ప్రాంతంలో దీర్ఘకాలిక పేదరికం ఉందని భావిస్తున్నారు.
ఈ జిల్లా కొలకత్తా సమాచార సాంకేతిక కేద్రంగా ఉంది. జిల్లాలో గుర్తించతగిన ఐటి కంపనీలు, బహుళజాతి సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలలో దాదాపు 1.2 లక్షల మంది పనిచేస్తున్నారు.
కామర్హతి, బరానగర్, దమ్ దం, ఉత్తర డండం, దక్షిణ డండం), రెండు కమ్యూనిటీ అభివృద్ధి బ్లాక్స్: బర్రక్పూర్, బర్రక్పూర్-1,, 2.
పురపాలకాలే కాక ఒక్కొక విభాగంలో గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలుగా విభజించబడిన మండలాలు ఉన్నాయి. జిల్లాలో మొత్తంగా 48 నగరప్రాంతాలు, 27 పురపాలకాలు, 20 పట్టణాలు, 1 కంటోన్మెంటు ఉన్నాయి. [7][8]
ఈ ఉపవిభాగంలో నగరప్రాంతం మాత్రమే ఉంది:[6] బిదన్నగర్ పురపాలకం.
జిల్లా 28 విభజించబడింది శాసనసభ నియోజకవర్గాలు:
పశ్చిమ బెంగాల్ డిలిమినేషన్ ఆఫ్ కంసిస్టెన్సీస్ సిఫారుసుతో డిలిమినేషన్ కమిషన్ " ఆదేశానుసారం ఉత్తర 24 పరగణాలు జిల్లాలోని నియోజకవర్గాల పునర్విభజన తరువాత జిల్లా 34 శాసనసభ నియోజకవర్గాలుగా విభజించబడింది. [10]
సౌత్ ఈస్టర్న్ రైల్వే, ఈస్ట్ రైల్వేకి చెందిన "కొలకత్తా సబర్బన్ రైల్వే " కొలకత్తా పొరుగున ఉన్న జిల్లాలకు (దక్షిణ 24 పరగణాలు]], నాడియా, హౌరా, హుగ్లీ మొదలైనవి) రైల్వే సర్వీసులను అందిస్తుంది. " కొలకత్తా సర్క్యులర్ రైల్వే " కొలకత్తా నగరమంతా రైల్వేసేవలను అందిస్తుంది. విమానాశ్రయాన్ని కలుపుతూ కొత్తరైల్వే లైను నిర్మించబడుతుంది. డండం, ఉత్తర 24 పరగణాల నుండి సీల్దాహ్ రైలుమార్గం ఆరభం అయింది.
కొలకత్తా నగరంలో ఉన్న ఒకేఒక విమానాశ్రయం " ది నేతాజి సుభాష్ బోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ " . ముందు దీనిని డండం విమానాశ్రయం. డొమెస్టిక్, అనర్జాతీయ విమానసేవలను అందిస్తున్న ఈ విమానాశ్రయం ఉత్తర 24 పరగణాలు జిల్లాలోనే ఉంది. ఉత్తర ఈశాన్య ప్రాంతం, బాంకాక్, బంగ్లాదేశ్ కులకు ఇది ముఖద్వారంగా ఉంది.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య. | 10.082.852, |
ఇది దాదాపు. | బొలివియా దేశ జనసంఖ్యకు సమానం |
అమెరికాలోని. | మిచిగాన్ నగర జనసంఖ్యకు సమం. |
640 భారతదేశ జిల్లాలలో. | 2 వ స్థానంలో ఉంది. |
1 చ.కి.మీ జనసాంద్రత. | 2463 |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 12,86% |
స్త్రీ పురుష నిష్పత్తి. | 949: 1000 |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 84,95% |
జాతియ సరాసరి (72%) కంటే. |
2001:
హిందువులు - 75,23%, ముస్లిములు - 24.22%, క్రైస్తవులు, సిక్కులు -0,23% - 0.12%. మొత్తం ప్రజలలో బంగ్లాదేశ్ దేశ హిందూ శరణార్ధులు 42%.
1984లో ఉత్తర 24 పరగణాలు జిల్లాలో 1330 చ.కి.మీ వైశాల్యంలో " సునరబంస్ నేషనల్ పార్క్ " స్థాపించబడింది. [12] జిల్లా ఈ పార్కును దక్షిణ 24 పరగణాలు జిల్లాతో పంచుకుంటుంది. అంతేగాక జిల్లాలో 1985లోం .6చ.కి.మీ వైశాల్యంలో " బిభుతిభూషన్ విల్డ్‌లైఫ్ శాక్చ్యురీ " ఏర్పాటుచేయబడింది.[12]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.