ఉత్తర దినాజ్‌పూర్ జిల్లా
వెస్ట్ బెంగాల్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం లోని 20 జిల్లాలలో ఉత్తర దీనాజ్‌పూర్ (బెంగాలీ:উত্তর দিনাজপুর জেলা) జిల్లా ఒకటి. ఇది 1992 ఏప్రిల్ 1 వ తేదీన ముందు పశ్చిమ దీనాజ్‌పూర్ జిల్లాలో ఉపవిభాగంగా ఉన్న ఉత్తర దీనాజ్‌పూర్‌కు జిల్లా హోదా ఇవ్వబడింది. జిల్లా రాణిగంజ్, ఇస్లాంపూర్ ఉపవిభాగాలుగా విభజించబడింది.
Uttar Dinajpur జిల్లా
উত্তর দিনাজপুর জেলা | |
---|---|
![]() West Bengal పటంలో Uttar Dinajpur జిల్లా స్థానం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | West Bengal |
డివిజను | Jalpaiguri |
ముఖ్య పట్టణం | Raiganj |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | Raiganj |
• శాసనసభ నియోజకవర్గాలు | Chopra, Islampur, Goalpokhar, Chakulia, Karandighi, Hemtabad, Kaliaganj, Raiganj, Itahar |
విస్తీర్ణం | |
• మొత్తం | 3,142 కి.మీ2 (1,213 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 30,00,849 |
• జనసాంద్రత | 960/కి.మీ2 (2,500/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 60.13 per cent |
• లింగ నిష్పత్తి | 936 |
ప్రధాన రహదార్లు | NH 31, NH 34 |
Website | అధికారిక జాలస్థలి |

భౌగోళికం
ఉత్తర దినాజ్‌పూర్ జిల్లా 25°11 నుండి 26°49 ఉత్తర అక్షాంశం, 87°49' తూర్పు రేఖాంశంలో ఉపస్థితమై ఉంది. జిల్లావైశాల్యం 3,142 చ.కి.మీ. ఇది పంచఘర్, తాకూర్గోయాన్, దినాజ్‌పూర్ జిల్లాలకు సమీపంలో ఉంది. తూర్పు సరిహద్దులోబంగ్లాదేశ్, పశ్చిమ సరిహద్దులో కిషన్‌గంజ్, పూణియా, కతిహార్, ఉత్తర సరిహద్దులో డార్జిలింగ్, జల్పైగురి, దక్షిణసరిహద్దులో మల్దా, దక్షిణ దినాజ్‌పూర్లు ఉన్నాయి. ఉత్తర దినాజ్‌పూర్ జిల్లా జాతీయ రహదారి, రాష్ట్రీయ రహదారి, రైల్వే మార్గాలతో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో చక్కగా అనుసంధానించబడి ఉంది. జాతీయరహదారి 31-34 జిల్లా మద్యభాగం నుండి పోతుంది.
భూమి వివరణ
జిల్లా భుభాగం చాలవరకు చదరంగా ఉంటుంది. కులిక్, నాగర్, మహానందా నదులు ప్రవహిస్తున్న దక్షిణ భూభాగం కొంచెం ఏటవాలుగా ఉంటుంది. తూర్పున ఉన్న రాజ్మహల్ కొండల వద్ద భూభాగం కొంత బేసిన్ రూపం సంతతించుకుంది. పాత ఒండ్రుమట్టి హిమయుగానికి చెందినదని భావిస్తున్నారు. జిల్లా భూభాగంలో సారవంతమైన భూమి అధికంగా ఉంది. సారవంతమైన భూమి వరి, జనపనార, ఆవాలు, చెరుకు పంటలకు అనుకూలంగా ఉంది. కులిక్ నదీతీరంలో ఉన్న జిల్లా కేంద్రం రాణిగంజ్‌లో " రాణిగంజ్ విల్డ్‌లైఫ్ శాంక్చ్యురీ ఉంది. ఇక్కడ ఉన్న " బర్డ్ అభయారణ్యం " వైశాల్యంలో ఆసియాలో 2 వ స్థానంలో ఉందని గుర్తింపు పొందిఉంది.
విభాగాలు
ఆర్ధికం
2011 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో[1] ఉత్తరదీనాజ్‌పూర్ జిల్లా ఒకటి అని గుర్తించింది. బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్ర 11 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[1] అయినప్పటికీ ప్రస్తుతం డాల్ఖోలా చక్కని వాణిజ్యకేద్రంగా అభివృద్ధిచెంది డాల్ఖోలా, ఉత్తర దీనాజ్‌పూర్ జిల్లా ఆర్థిక ఎదుగుదలకు సహకరిస్తుంది.
విభాగాలు
ఉప విభాగాలు
ఉత్తర్ దీనాజ్పూర్ జిల్లాలో 2 ఉపవిభాగాలు ఉన్నాయి :
- రైగని ఉపవిభాగం, సలాంపూర్ ఉపవిభాగం.
అసెంబ్లీ నియోజకవర్గాలు
జిల్లా 7 శాసనసభ నియోజకవర్గాలుగా విభజించబడింది:
- చోప్రా (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 28),
- ఇస్లాంపూర్, ఉత్తర దినాజ్పూర్ (విధాన సభ నియోజకవర్గం) ఇస్లాంపూర్ (. శాసనసభ నియోజకవర్గం ఏ 29),
- గోల్పొఖర్ (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 30),
- కరందిగి (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 31),
- రాజ్గంజ్ (విధాన సభ నియోజకవర్గం) (ఎస్సీ) (. శాసనసభ నియోజకవర్గం ఏ 32),
- కలియగంజ్ (విధాన సభ నియోజకవర్గం) (ఎస్సీ) (శాసనసభ నియోజకవర్గం ఏ 33.)
- ఇతహార్ (విధాన సభ నియోజకవర్గం) (శాసనసభ నియోజకవర్గం నెం .34.).
షెడ్యూల్డ్ జాతి , షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ నియోజకవర్గాలు
- షెడ్యూల్డ్ జాతి, షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ నియోజకవర్గాలు:- డార్జిలింగ్ జిల్లా లోని 5 శాసనసభ నియోజకవర్గాలతో చేర్చి రాణిగంజ్, కాలిగంజ్ నియోజకవర్గాలు
- డార్జిలింగ్ పార్లమెంటరీ నియోజకవర్గం :- చోప్రా, ఇస్లాంపూర్.
- రాణిగంజ్ పార్లమెంటరీ నియోజకవర్గం :- మల్దా జిల్లా నుండి 3 శాసనసభ నియోజకవర్గాలతో చేర్చి గోల్పొఖర్, కరందిఘి, రాణిగంజ్, ఇతహార్ శాసనసభ నియోజకవర్గాలు.
- పార్లమెంటరీ నియోజకవర్గం :- బాలూర్ఘాట్ 6 శాసనసభ నియోజకవర్గాలతో చేర్చి దక్షిణ దినాజ్‌పూర్, కలియగంజ్ శాసనసభ నియోజక వర్గాలు.
పునర్విభజన తరువాత నియోజకవర్గాలు
"డిలిమిటేషన్ ఆఫ్ కాంస్టిస్టెంసీస్" ఆదేశానుసారం దిలిమిటేషన్ కమిషన్ బెంగాల్ నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తరువాత ఈ జిల్లా 9 శాసనసభనియోజకవర్గాలుగా విభజించబడింది: [2]
- చోప్రా (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 28),
- ఇస్లాంపూర్, ఉత్తర దినాజ్పూర్ (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 29),
- గోల్పొఖర్ Goalpokhar (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 30),
- చకులియా (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 31),
- కరందిఘి (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 32),
- హేమతాబాద్ (విధాన సభ నియోజకవర్గం) (ఎస్సీ) (. శాసనసభ నియోజకవర్గం ఏ 33),
- కలియగంజ్ (విధాన సభ నియోజకవర్గం) (ఎస్సీ) (శాసనసభ నియోజకవర్గం నెం .34.),
- రాయ్గంజ్ (విధాన సభ నియోజకవర్గం) (శాసనసభ నియోజకవర్గం 35.),
- ఇతహార్ (విధాన సభ నియోజకవర్గం) (శాసనసభ నియోజకవర్గం 36.).
షెడ్యూల్డ్ జాతి , షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ నియోజకవర్గాలు
- షెడ్యూల్డ్ జాతి, షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ నియోజకవర్గాలు :- డార్జిలింగ్ జిల్లా నుండి 6 శాసనసభ నియోజకవర్గాలతో చేర్చి హెంతాబాదు, కలియగంజ్ శాసనసభ నియోజక వర్గాలు.
- పార్లమెంటరీ నియోజకవర్గం :- ... జిల్లా నుండి .. శాసనసభ నియోజకవర్గాలతో చేర్చి. శాసనసభ నియోజక వర్గాలు.
- డార్జిలింగ్ పార్లమెంటరీ నియోజకవర్గం :- చోప్రా శాసనసభ నియోజకవర్గం.
- రాణిగంజ్ పార్లమెంటరీ నియోజకవర్గం :- దక్షిణదినాజ్‌పూర్ జిల్లా నుండి 6 శాసనసభ నియోజకవర్గాలతో చేర్చి ఇస్లాంపూర్, గోల్పొఖర్, చకులియా, కరందగి, హెమతాబాదు, కలియగంజ్, రాణిగంజ్ శాసనసభ నియోజక వర్గాలు.
- బాలూర్ఘాట్ పార్లమెంటరీ నియోజకవర్గం :- ఇతహార్ శాసనసభ నియోజకవర్గం.
2001 లో గణాంకాలు
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 3,000,849,[3] |
ఇది దాదాపు. | అల్బేనియా దేశ జనసంఖ్యకు సమానం.[4] |
అమెరికాలోని. | మిసిసిపి నగర జనసంఖ్యకు సమం.[5] |
640 భారతదేశ జిల్లాలలో. | 120వ స్థానంలో ఉంది.[3] |
1చ.కి.మీ జనసాంద్రత. | 956 [3] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 22.9%.[3] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 936:1000 [3] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 60.13%.[3] |
జాతియ సరాసరి (72%) కంటే. |
జిల్లాలో హిందువులు 51.47%, ముస్లిములు 47.36%.[6]
వృక్షజాలం , జంతుజాలం
1985లో ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలో 1.3 చ.కి.మీ వైశాల్యంలో " రాణిగంజ్ విల్డ్‌లైఫ్ శాంక్చ్యురీ " ఏర్పాటుచేయబడింది.[7]
ప్రయాణసౌకర్యాలు
- జిల్లాలో అతిపెద్ద రైల్వే స్టేషను డాల్ఖోలా.
- ఇక్కడి నుండి ప్రారంభం అయ్యే జాతీయరహదారి ఉత్తర దినాజ్‌పూర్ లో ముగుస్తుంది.
మూలాలు
వెలుపలి లింకులు
వెలుపలి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.