ఆపిల్ చెట్టు యొక్క పండు From Wikipedia, the free encyclopedia
ఆపిల్ (ఆంగ్లం Apple) రోసేసి (Rosaceae) కుటుంబానికి చెందిన పండు. దీనిని తెలుగులో "kasmira phalam (కాశ్మీర ఫలం)" అని కూడా పిలుస్తారు. ఇది పోమ్ (pome) రకానికి చెందినది. ఆపిల్ (Malus domestica) జాతి చెట్ల నుండి లభిస్తుంది. ఇది విస్తృతంగా సేద్యం చేయబడుతున్న పండ్ల చెట్లలో ఒకటి. ఇది మానవులు ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. ఆపిల్ చెట్లు చిన్న ఆకురాల్చే చెట్లు వసంతకాలంలో పూసి చలికాలంలో పండ్లనిస్తాయి. ఇవి పశ్చిమ ఆసియాలో జన్మించాయి. ఆసియా, యూరప్ దేశాలలో కొన్ని వేల సంవత్సరాలుగా పెంచబడుతున్నది. అక్కడ నుండి దక్షిణ అమెరికాకు విస్తరించింది.
ఆపిల్ కాశ్మీర ఫలం | |
---|---|
కాశ్మీర ఫలం | |
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | Rosales |
Family: | |
Subfamily: | |
Genus: | Malus |
Species: | M. domestica |
Binomial name | |
Malus domestica Borkh. | |
ఆపిల్ పండ్లలో 7,500 పైగా రకాలు వివిధ లక్షణాలు కలవిగా గుర్తించారు. కొన్ని తినడానికి రుచి కోసం అయితే మరికొన్ని వంట కోసం ఉపయోగిస్తారు. వీటిని సామాన్యంగా అంటు కట్టి వర్ధనం చేస్తారు. ఇవి చాలా రకాల శిలీంద్రాలు, బాక్టీరియా చీడలను లోనై ఉంటాయి.
ప్రపంచ వ్యాప్తంగా 2005 సంవత్సరంలో సుమారు 55 మిలియన్ టన్నుల ఆపిల్ పండ్లు ఉత్పత్తి అవుతున్నాయి. చైనా మొత్తం ఉత్పత్తిలో సుమారు 35% భాగం ఉంది. అమెరికా సంయుక్త రాష్ట్రాలు రెండవ స్థానంలో ఉండగా ఇరాన్ మూడవ స్థానం ఆక్రమించింది.
ఆపిల్ చెట్లు చిన్నగా ఉండి ఆకులు రాల్చే రకానికి చెందినదిగా సుమారు 3 నుండి 12 మీటర్లు (9.8 నుండి 39.4 అ.) పొడవు పెరిగి, గుబురుగా ఉంటుంది.[2] దీని ఆకులు ఆల్టర్నేట్ గా అమర్చబడి పొడవుగా 5 to 12 cm పొడవు, 3–6 సెంటీమీటర్లు (1.2–2.4 అం.) వెడల్పు ఉండి పత్రపుచ్ఛాన్ని (Petiole) కలిగివుంటాయి. వసంతకాలం (spring) లో ఆకు మొగ్గలతో పాటు పూస్తాయి. ఆపిల్ పుష్పాలు తెల్లగా లేత గులాబీ రంగులో ఉండి ఐదు ఆకర్షక పతాల్ని కలిగి 2.5 నుండి 3.5 సెంటీమీటర్లు (0.98 నుండి 1.38 అం.) వ్యాసాన్ని కలిగివుంటాయి. ఆపిల్ పండు చలికాలంలో పరిణితి చెంది సుమారు 5 నుండి 9 సెంటీమీటర్లు (2.0 నుండి 3.5 అం.) మధ్యన ఉంటుంది. పండు మధ్యలో ఐదు గింజలు నక్షత్ర ఆకారంలో అమర్చబడి, ఒక్కొక్క గింజలో 1-3 విత్తనాలు ఉంటాయి.[2]
రోజుకి ఒక యాపిల్ తింటే డాక్టర్లకి దూరంగా ఉన్నట్టే అనేది నానుడి. పెక్టిన్ దండిగా ఉండే యాపిల్ పండ్లను తినటం వల్ల పేగులను ఆరోగ్యంగా ఉంచే బ్యాక్టీరియా సంఖ్య బాగా వృద్ధి చెందుతున్నట్టు వెల్లడైంది. వీటిని క్రమం తప్పకుండా, చాలాకాలం తినటం వల్ల వృద్ధి చెందిన బ్యాక్టీరియా కొన్నిరకాల కొవ్వు ఆమ్లాల ఉత్పత్తిలో సాయం చేస్తుంది. ఇది పేగుల్లో సూక్ష్మక్రిముల నియంత్రణకు తోడ్పడుతుంది, పేగుల గోడల్లోని కణాలను ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమైన బ్యూటీరేట్ రసాయనాన్నీ ఉత్పత్తి చేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. (ఈనాడు22.1.2010) పండ్లు, కాయగూరలు, గింజలు, పప్పులు, కందమూలాలు, మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరము . ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలుగా తెలుసును . అన్నంతో అవసరం లేకుండా ప్రకృతిసిద్ధమైన పండ్లు, కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారంగా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.
యాపిల్స్‌లో ఫైబర్ ఎక్కువగానూ, కొవ్వు పదార్థాలు అత్యల్పంగానూ ఉంటాయి. సోడియం తక్కువగానూ, పొటాషియం ఎక్కువగానూ ఉంటాయి. విటమిన్ సి అధిక మొత్తాల్లో ఉంటుంది.
యాపిల్ పండు తొక్కులో ఉండే దాదాపు పన్నెండు రకాల రసాయనపదార్థాలు క్యాన్సర్ కణాలను సమర్థంగా అడ్డుకుంటాయని కార్నెల్ యూనివర్సిటీ పరిశోధకుల రీసెర్చిలో తేలింది. 'ట్రిటర్‌పెనాయిడ్స్'గా వ్యవహరించే ఈ పదార్థాలు కాలేయం, పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్లకు సంబంధించిన కణాల పెరుగుదలను అడ్డుకుంటాయట. అంతేకాదు, ధ్వంసమైన క్యాన్సర్ కణాలను శరీరం నుంచి బయటికి పంపించడంలోనూ వీటిది కీలకపాత్ర. తొక్కులోనే కాదు... పండులోనూ అనేక రకాల క్యాన్సర్ నిరోధక ఫ్లేవనాయిడ్లూ ఫినోలిక్ ఆమ్లాలూ ఉంటాయి కాబట్టి తరచుగా యాపిల్ తినమని సూచిస్తున్నారు వారు.
ప్రతీరోజు ఓ ఆపిల్ తింటే వైద్యునితో అవసరం ఉండదని చెబుతుంటారు. అది ముమ్మాటికి నిజమే. ఎందుకంటే ఆ పండులో ఉండే పోషక విలువలు అలాంటివి మరి. శరీరానికి ఇది ఒక గొప్ప సహజ యాంటీఆక్సిడెంట్ (వ్యాధినిరోధక కారకం) గా పనిచేస్తుంది. 100 గ్రాముల ఆపిల్ తింటే దాదాపు 1,500 మిల్లీగ్రాముల "విటమిన్ సి" ద్వారా పొందే యాంటీఆక్సిడెంట్ ప్రభావంతో సమానం.
ఆపిల్‌లో అధిక మొత్తంలో విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. ఇవి శరీరంలో రక్తాన్ని మరింత పటిష్ఠం చేస్తాయి.
ఆపిల్‌లో మాలిక్ యాసిడ్, టార్టారిక్ యాసిడ్ అనే రసాయనాలు ఉంటాయి. ఇవి లివర్ (కాలేయం), జీర్ణక్రియలలో తలెత్తే సమస్యలను నివారిస్తాయి. పానీయాలలో ఆపిల్ సైడర్ వెనిగర్‌ను ఉపయోగించడం వల్ల కిడ్నీ (మూత్ర పిండాలు) లలో రాళ్లు ఏర్పడటాన్ని నివారిస్తుంది.
ప్రతి రోజు ఆపిల్ తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. చర్మ సంబధింత వ్యాధులను తగ్గిస్తుంది. ఊబకాయం, తలనొప్పి, కీళ్లనొప్పులు, ఆస్తమా, అనీమియా, క్షయ, నాడీ సమస్యలు, నిద్రలేమి, జలుబు వంటి పలురకాల సమస్యలకు ఆపిల్ చక్కని ఔషధంగా పనిచేస్తుంది.
100 గ్రాముల ఆపిల్‌లో ఉండే పోషక విలువలు:
లండన్: రోజుకో యాపిల్ తింటే వైద్యుడి అవసరం ఉండదన్న నానుడి తప్పంటున్నారు బ్రిటన్ శాస్త్రవేత్తలు. అలా తింటే తప్పనిసరిగా దంతవైద్యుడిని ఆశ్రయించాల్సి వస్తుందని చెబుతున్నారు. తరచూ యాపిల్ తినేవారి పళ్లకు.. కర్బన పానీయాలు (కార్బొనేటడ్ డ్రింక్స్) తాగే వారి దంతాలకంటే నాలుగురెట్లు ముప్పెక్కువని లండన్‌లోని కింగ్స్ కళాశాల దంతవైద్యశాల శాస్త్రవేత్తలు తెలిపారు. ద్రాక్ష సారాయి (వైన్), బీర్లతోనూ దంతక్షయం తప్పదని హెచ్చరించారు. మనం ఏం తిన్నామన్నదానికంటే ఎలా తిన్నామనేదే ముఖ్యం. యాపిల్స్ తినడం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతుంటారు. కానీ, వాటిని తరచూ తినడంతో ఆమ్లాల స్థాయి పెరిగి దంతాలు పాడవుతాయి అని ముఖ్య అధ్యయనకర్త డేవిడ్ బాట్లెట్ తెలిపారు. తీసుకునే ఆహారానికి, దంతాల ఆరోగ్యానికి సంబంధించి 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సుగల వెయ్యిమందిపై పరిశోధనలు నిర్వహించి ఈ ఫలితాలు కనుగొన్నట్లు చెప్పారు. అయితే, కొన్ని రకాల పండ్లు ఆమ్లత్వాన్ని కలిగిఉన్నా.. వాటిని తినే విషయంలో నిరుత్సాహానికి గురిచేయొద్దని మెడికల్ రీసెర్చి కౌన్సిల్‌కు చెందిన డా.గ్లెనిస్ జోన్స్ తెలిపారు. యాపిల్‌తోపాటు పాలు, జున్ను తీసుకోవడం, ఆ తర్వాత బాగా నీళ్లు తాగడం వల్ల ప్రయోజనం ఉంటుందని సూచించారు.
విరేచనాలు, అతిసారం: యాపిల్ గుజ్జులో ఉండే పెక్టిన్ అనే సాల్యుబుల్ ఫైబర్ పదార్థం ద్రవ రూప మలాన్ని గట్టిపడేలా చేస్తుంది. అందుకే దీనిని అతిసారం వంటి సమస్యల్లో వాడవచ్చు. పచ్చి యాపిల్పైన తోలు తొలగించి కండ భాగాన్ని తీసుకుంటే విరేచనాలు తగ్గుతాయి.
జిగట విరేచనాలు: పిల్లల్లో తరచుగా జిగట విరేచనాలవుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో యాపిల్స్ బాగా ఉపయోగపడతాయి. బాగా మిగల పండి, తియ్యని రుచి కలిగిన యాపిల్స్‌ని మెత్తగా చిదిమి వయసునుబట్టి ఒకటినుంచి నాలుగుపెద్ద చెంచాలు తినిపిస్తే జిగట విరేచనాలు తగ్గుతాయి.
ఉదర సంబంధ సమస్యలు: అల్పమైన జీర్ణక్రియా సంబంధ సమస్యలు ఇబ్బంది పెడుతున్నప్పుడు యాపిల్ ఆహారౌషధంగా ఉపయోగపడుతుంది. యాపిల్ని ముక్కలుగా తరిగి మెత్తని గుజ్జుగా చేసి, దాల్చిన పొడిని, తేనెను చేర్చి తీసుకోవాలి. గింజలు, తొడిమ తప్ప యాపిల్ని మొత్తంగా ఉపయోగించవచ్చు. తిన బోయేముందు బాగా నమలాలి. ఆహార సమయాలకు మధ్యలో దీనిని తీసుకోవాలి. యాపిల్‌లో ఉండే పెక్టిన్ అనే పదార్థం అమాశయపు లోపలి పొర మీద సంరక్షణగా ఏర్పడి మృదుత్వాన్ని కలిగిస్తుంది. ముక్కలుగా తరిగిన యాపిల్స్‌కు పెద్ద చెంచాడు తేనెను చేర్చి కొద్దిగా నువ్వుల పొడిని చిలకరించి తీసుకుంటే జీర్ణావయవాలకు శక్తినిచ్చే టానిక్‌గా పనిచేస్తుంది.
ఇటీవల అధ్యయనాల ప్రకారం రెడ్ ఆపిల్‌లోని క్వర్సెటిన్ రోగనిరోధక శక్తిని పెంచడములో సహాయపడుతుంది.
ఆపిల్ తినని మహిళలతో పోలిస్తే ప్రతిరోజు ఒక ఆపిల్ తినే మహిళలలో 28 శాతం తక్కువగా టైప్ 2 మధుమేహం వస్తుంది
ఆయుర్వేదము: మూలం: డా. చిరుమామిళ్ల మురళీమనోహర్
1.పందొమ్మిదో శతాబ్దం వచ్చే వరకూ ప్రపంచవ్యాప్తంగా 17 వేల రకాల యాపిల్స్ ఉండేవట! కానీ ఇప్పుడు 7,500 రకాలు మాత్రమే కనిపిస్తున్నాయి. 2.యాపిల్ తోటల పెంపకం గురించి తెలిపే శాస్త్రాన్ని పామాలజీ అంటారు. 3.ఏ పండుకూ లేని విశిష్టత ఒకటి యాపిల్‌కి ఉంది. అదేంటంటే, ఒక జాతికి చెందిన యాపిల్ విత్తనాన్ని నాటితే, అదే జాతికి చెందిన చెట్టు మొలుస్తుందనే గ్యారంటీ లేదట! 4.పూర్వం చాలా ప్రాంతాల్లో యాపిల్ని ‘వింటర్ బనానా’ అని పిలిచేవారట! 5.విదేశాల్లో జరిగే హాలోవీన్ వేడుకల్లో ‘బాబింగ్ ఫర్ యాపిల్స్’ ముఖ్యమైనది. చేతుల్ని ఉపయోగించకుండా కేవలం నోటితో యాపిల్ని తీసే ఈ పోటీలో గెలిచిన వారికి అతి త్వరలో పెళ్లవుతుందని నమ్మకం.
దేశం | ఉత్పత్తి (టన్నులు) | పాదపీఠిక | ||
---|---|---|---|---|
People's Republic of China | 27 507 000 | F | ||
United States | 4 237 730 | |||
ఇరాన్ | 2 660 000 | F | ||
Turkey | 2 266 437 | |||
Russia | 2 211 000 | F | ||
Italy | 2 072 500 | |||
భారతదేశం | 2 001 400 | |||
France | 1 800 000 | F | ||
మూస:CHI | 1 390 000 | F | ||
Argentina | 1 300 000 | F | ||
{{{1}}}World | 64 255 520 | A | ||
No symbol = official figure, F = FAO estimate, A = Aggregate (may include official, semi-official, or estimates) ; Source: FAO Archived 2012-06-19 at the Wayback Machine |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.