From Wikipedia, the free encyclopedia
ఆదిత్య రాయ్ కపూర్ (జననం 16 నవంబరు 1985) ప్రముఖ బాలీవుడ్ నటుడు. మొదట చానల్ వి లో వీడియో జాకీగా పనిచేసేవారు. లండన్ డ్రీమ్స్(2009) సినిమాలో ఓ చిన్న పాత్రతో తెరంగేట్రం చేసిన ఆదిత్య యాక్షన్ రీప్లే(2010), గుజారిష్(2010) సినిమాల్లో సహాయ నటునిగా నటించారు. 2013లో ఆషికి 2 సినిమాతో హీరోగా మారారు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత యే జవాహీ హై దివాని సినిమాలో సహాయ నటునిగా కనిపించారు. ఈ సినిమా భారి విజయాన్ని నమోదు చేసుకుంది. అతి ఎక్కువ వసూళ్ళు సాధించిన సినిమాగా కూడా నిలిచింది.
ఆదిత్య రాయ్ కపూర్ | |
---|---|
జననం | ముంబై, మహారాష్ట్ర, భారతదేశం | 1985 నవంబరు 16
విద్య | సెయింట్. జేవియర్స్ కాలేజ్, ముంబై |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2009–ప్రస్తుతం |
16 నవంబరు 1985లో పంజాబీ హిందూ కుటుంబంలో ముంబైలో జన్మించారు ఆదిత్య.[1] ఆయన తండ్రి పంజాబీ, తల్లి భారతీయ యూదు మతస్థురాలు.[2] ముగ్గురు అన్నదమ్ముల్లో ఆదిత్య ఆఖరివారు. ఆదిత్య పెద్ద అన్నయ్య సిద్దార్ధ్ రాయ్ కపూర్ యూటివి మోషన్ పిక్చర్స్ సంస్థకు ముఖ్య కార్యనిర్వహణాధికారి, రెండో అన్నయ్య కునాల్ రాయ్ కపూర్ కూడా నటుడే.[3] ప్రముఖ బాలీవుడ్ నటి విద్యా బాలన్ ఆదిత్య పెద్ద అన్నయ్య సిద్దర్ధ్ రాయ్ కపూర్ ను వివాహం చేసుకున్నారు.
ఆయన తాత రఘుపతి రాయ్ కపూర్ సినీ నిర్మాత.[4][5] ఆదిత్య తాత, అమ్మమ్మ ప్రముఖ నాట్యకళాకారులు. భారతదేశానికి సామా నాట్యాన్ని పరిచయం చేసింది వీరే.[4] ముంబైలోని కుఫే పరేడ్ లో జి.డి.సోమానీ మెమోరియల్ స్కూల్ లోనూ, సెయింట్ గ్జేవియర్స్ కళాశాలలోనూ చదువుకున్నారు ఆదిత్య.[4]
నటనలో ఎటువంటి శిక్షణా తీసుకోని ఆదిత్య, నాట్యంలోనూ, వాచకంలోనూ శిక్షణ తీసుకున్నారు. ఆయనకు నటునిగా అవ్వాలనే బలమైన కోరిక లేకపోయినా లండన్ డ్రీమ్స్ సినిమాకు ఆడిషన్స్ కు వెళ్ళిన తరువాత నటనపై శ్రద్ధ పెరిగింది. చిన్నప్పుడు క్రికెటర్ అవ్వాలనే కోరిక ఉన్నా 6వ తరగతి తరువాత క్రికెట్ శిక్షణా తరగతులకు వెళ్ళడం మానేశారు ఆదిత్య.
మ్యూజిక్ చానెల్ అయిన చానెల్ వి లో వీడియో జాకీగా కెరీర్ ప్రారంభించారు ఆదిత్య. ప్రత్యేకమైన వాక్ శైలి, కామెడీ టైమింగ్ ఆయన షోలను హిట్ అయ్యేలా చేశాయి. 2009లో విపుల్ షా దర్శకత్వంలో లండన్ డ్రీమ్స్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించారాయన. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, అజయ్ దేవగణ్ లతో కలసి నటించారు. ఈ సినిమా పెద్దగా ఆడలేదు.
అక్షయ్ కుమార్, ఐశ్వర్య రాయ్ నటించిన యాక్షన్ రీప్లే లో ఆదిత్య సహాయ నటునిగా చేశారు. ఈ సినిమా కూడా హిట్ కాలేదు. ఆ తరువాత సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన గుజారిష్(2010) సినిమాలో హృతిక్ రోషన్, ఐశ్వర్య రాయ్ లతో కలసి సహాయ నటునిగా నటించారు. ఈ సినిమా కూడా విజయం సాధించలేదు.
2013లో మోహిత్ సూరి దర్శకత్వంలో విడుదలైన ఆషికి 2 సినిమాతో ఆదిత్య కెరీర్ పెద్ద మలుపు తిరిగింది. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద విజయం కావడమే కాక, విమర్శకుల నుంచీ ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలోని ఆదిత్య నటనకు కూడా పలువురు విమర్శకులు ప్రశంసలు కురిపించారు.[6] 2013లో ఈ సినిమా అతి ఎక్కువ వసూళ్ళు సాధించిన చిత్రంగా నిలిచింది.
ఆ తరువాత రణబీర్ కపూర్, దీపికా పడుకోణె లు ప్రధాన పాత్రధారులుగా నటించిన యే జవానీ హై దివానీ(2013) సినిమాలో సహాయనటునిగా కనిపించారు ఆదిత్య. ఈ సినిమాలోని ఆయన నటనకు ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారానికి నామినేషన్ లభించింది. 2013 సంవత్సరానికిగానూ ఈ సినిమా 4వ అతి ఎక్కువ వసూళ్ళు సాధించిన సినిమాగా నిలిచింది.
2014లో హబిబ్ ఫైసల్ దర్శకత్వంలో పరిణీతి చోప్రా తో కలసి దావత్-ఎ-ఇష్క్ సినిమాలో నటించారు ఆదిత్య
హాలీవుడ్ సినిమా గ్రేట్ ఎక్స్ పెక్టేషన్స్ కు హిందీ రీమేక్ అయిన ఫితూర్ సినిమాలో కత్రినా కైఫ్, టబు లతో కలసి నటించారు ఆదిత్య. ఈ సినిమా జనవరి 2016 కల్లా షూటింగ్ పూర్తిచేసుకుంది.[7] ప్రస్తుతం తమిళ్ సినిమా ఓ కాదల్ కణ్మణి(తెలుగులో ఓకే బంగారం) సినిమాకు హిందీ రీమేక్ ఓకే జానూ లో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆదిత్య తో కలసి శ్రద్ధ కపూర్ నటించనున్నారు.[8]
సంవత్సరం | పురస్కారం | చిత్రం | ఫలితం |
---|---|---|---|
2013 | బిగ్ స్టార్ ఎంటర్టైన్మెంట్ అవార్డులు | ఆషికి 2 | గెలిచారు[9] |
బిగ్ స్టార్ ఎంటర్టైన్మెంట్ అవార్డ్ ఫర్ ది మోస్ట్ రొమాంటిక్ అవార్డ్ ఫర్ 2013 (శ్రద్ధ కపూర్ తో కలసి) | గెలిచారు[9] | ||
2014 | స్క్రీన్ అవార్డ్ ఫర్ జోడి నెం.1 (శ్రద్ధకపూర్ తో కలసి) | గెలిచారు[10] | |
స్టార్ గిల్డ్ అవార్డ్ ఫర్ జోడి ఆఫ్ ది ఇయర్ (శ్రద్ధ కపూర్ తో కలసి) | గెలిచారు[11] | ||
ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారం | యే జవానీ హై దివానీ | నామినేషన్[12] | |
ఐఫా ఉత్తమ సహాయనటుడు అవార్డు | గెలిచారు[13] |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.