ఆంధ్ర ప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia
ఆకివీడు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మండలం.ప్రధాన కార్యాలయం ఆకివీడు పట్టణంలో ఉంది. ఈ మండలానికి పశ్చిమాన నిడమర్రు మండలం, దక్షిణాన ఏలూరు జిల్లా, ఉత్తరాన తణుకు, ఉండి మండాలు, తూర్పున కాళ్ల మండలం ఉన్నాయి.[3] ఆకివీడు మండలం నరసాపురం లోకసభ నియోజకవర్గంలోని ఉండి అసెంబ్లీ నియోజకవర్గం క్రింద నిర్వహించబడుతుంది. ఇది భీమవరం రెవెన్యూ విభాగంలోని తొమ్మిది మండలాల్లో ఇది ఒకటి.OSM గతిశీల పటం
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 16.582°N 81.373°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పశ్చిమ గోదావరి జిల్లా |
మండల కేంద్రం | ఆకివీడు |
విస్తీర్ణం | |
• మొత్తం | 121 కి.మీ2 (47 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 73,889 |
• జనసాంద్రత | 610/కి.మీ2 (1,600/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1009 |
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ మండలంలో 20,869 ఇళ్లతో, మొత్తం జనాభా 73,889. అందులో పురుషులు 36778, స్త్రీలు 37,111 మంది ఉన్నారు.అక్షరాస్యత కలిగిన వారు 47,757 సగటు అక్షరాస్యత 71.57%, వీరిలో 24,953 మంది పురుషులు, 22,804 మంది స్త్రీలు ఉన్నారు.షెడ్యూల్డ్ కులాల 5,379 మంది, షెడ్యూల్డ్ తెగల 902 మంది ఉన్నారు.[4]
2001 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా మొత్తం 74,766 - పురుషులు 37,601- స్త్రీలు 37,165. అక్షరాస్యత - మొత్తం 78.94% - పురుషులు 83.31% - స్త్రీలు 74.53%
Seamless Wikipedia browsing. On steroids.