Remove ads
గుజరాత్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
గుజరాత్ రాష్ట్రంలో అతి పెద్ద పట్టణం అయిన అహ్మదాబాద్ నగరాన్ని సుల్తాన్ అహ్మద్ షా, సబర్మతి నది ఒడ్డున నిర్మించారు. 1411 ఫిబ్రవరి 26 తేదీన సూఫీ సన్యాసుల సమక్షంలో ఈ నాడు ఎలిస్ బ్రిడ్జ్ అని పిలవబడే ప్రదేశంలో సబర్మతి నది ఒడ్డున శంకుస్థాపన చేశాడు. ఈ శంకుస్థాపన చేసిన ప్రదేశాన్ని ఇప్పటికీ చూడచ్చు ఈ ప్రదేశాన్ని మానెక్ బుర్జ్ అంటారు. అయితే ఈ శంకుస్థాపన తేది గురించి అనేక వివాదాలున్నాయి. చరిత్రకారులు ఎక్కువగా విశ్వసించే తేది మాత్రం ఇదే. దీనికి ఆధారం రత్నమణి భీమ్రావ్ జోట్ 1928లో వ్రాసిన "గుజరాత్‌ను పట్నాగర్ అమ్దావాద్", అనేక ఇతర చారిత్రాత్మక పుస్తకాలు. అహ్మదాబాద్ గెజిటీర్ ప్రకారం ఈ పట్టణానికి పునాది రాళ్ళు 1411 మార్చి 4న పడ్డాయి "మాంచెస్టర్ ఆప్ ఇండియా" అని యూరోపియన్లతో శతాబ్దాల క్రితం కొనియాడిన, ఈ నగరంలో ఎన్నో సుందరమైన పురాతన కట్టడాలను ఈ నాటికీ పాత పట్టణం (ఓల్డ్ సిటీ) లో చూడొచ్చు. ప్రహరీ కలిగిన ఈ పాత పట్టణంలో అనేక సుందరమైన రాతి తలుపులు (దర్వాజాలు) మనసుని మైమరిపిస్తాయి. ఇది మెట్రోపాలిటన్ ప్రాంతం.
అహమ్మదాబాదు జిల్లా ఉత్తర సరిహద్దులో మెహసనా జిల్లా, తూర్పు సరిహద్దులో ఖేడా, ఆనంద్ జిల్లాలు, దక్షిణ సరిహద్దులో గల్ఫ్ ఆఫ్ కంబాత్, బోటాద్ జిల్లా, భావనగర్ జిల్లా ఉన్నాయి. అహ్మదాబాద్ నగరం జిల్లా కేంద్రంగా ఉంది.
శీతోష్ణస్థితి డేటా - అహ్మదాబాద్ | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
అత్యధిక రికార్డు °C (°F) | 0 (32) |
0 (32) |
41 (106) |
0 (32) |
0 (32) |
0 (32) |
0 (32) |
0 (32) |
0 (32) |
94 (201) |
76 (169) |
0 (32) |
0.4 (32.7) |
సగటు అధిక °C (°F) | 0 (32) |
0 (32) |
0 (32) |
0 (32) |
0 (32) |
0 (32) |
0 (32) |
0 (32) |
0 (32) |
0 (32) |
0 (32) |
0 (32) |
0 (32) |
సగటు అల్ప °C (°F) | 0 (32) |
0 (32) |
0 (32) |
0 (32) |
0 (32) |
0 (32) |
0 (32) |
0 (32) |
0 (32) |
0 (32) |
0 (32) |
0 (32) |
15 (59) |
అత్యల్ప రికార్డు °C (°F) | 0 (32) |
0 (32) |
0 (32) |
0 (32) |
0 (32) |
2 (36) |
2 (36) |
2 (36) |
0 (32) |
0 (32) |
0 (32) |
5 (41) |
5 (41) |
సగటు వర్షపాతం mm (inches) | 0 (0) |
0 (0) |
0 (0) |
0 (0) |
0 (0) |
0 (0) |
0 (0) |
0 (0) |
0 (0) |
0 (0) |
0 (0) |
0 (0) |
−57 (−2) |
సగటు వర్షపాతపు రోజులు (≥ 0 mm) | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 |
నెలవారీ సరాసరి ఎండ పడే గంటలు | 0 | 0 | 0 | 0 | 6 | 0 | 0.2 | 0 | 0 | 0.4 | 0 | 0.3 | 0 |
Source: HKO[1] |
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 7, 045, 314, |
ఇది దాదాపు. | హాంగ్ కాంగ్ దేశ జనసంఖ్యకు సమానం.[2] |
అమెరికాలోని. | వాషింటన్ నగర జనసంఖ్యకు సమం.[3] |
640 భారతదేశ జిల్లాలలో. | 8 వ స్థానంలో ఉంది. |
1చ.కి.మీ జనసాంద్రత. | 983 . |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 22.31%. |
స్త్రీ పురుష నిష్పత్తి. | 903:1000 |
జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 86.65%. |
జాతియ సరాసరి (72%) కంటే. | అధికం |
2001లో జిల్లా జనసంఖ్య 5, 816, 519. అక్షరాస్యత 80.18%. 2011 నాటికి అక్షరాస్యత 86% అభివృద్ధి చెందింది.[4]అహ్మదాబాద్ ప్రజలలో అధికంగా గుజరాతీ భాషవాడుకలో ఉంది. అంతేకాక హిందీ కూడా అత్యధిక వాడుకలో ఉంది.
అహ్మదాబాద్ జిల్లా పరిపాలనా సౌలభ్యం కోసం 11 తాలూకాలుగా విభజించబడింది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.