From Wikipedia, the free encyclopedia
అస్సాం క్రికెట్ జట్టు, అస్సాం క్రికెట్ అసోసియేషన్ నిర్వహణలో అస్సాం రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దేశీయ క్రికెట్ జట్టు. వారు ఏటా ఫస్ట్-క్లాస్ రంజీ ట్రోఫీ టోర్నమెంట్, పరిమిత ఓవర్ల విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంటు, ట్వంటీ20 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహిస్తారు.
వ్యక్తిగత సమాచారం | |
---|---|
కెప్టెన్ | కునాలొ సైకియా (FC & LA) మృణ్మయ్ దత్తా (T20) |
కోచ్ | ట్రెవర్ గాన్సాల్వెస్ |
యజమాని | అస్సాం క్రికెట్ అసోసియేషన్ |
జట్టు సమాచారం | |
రంగులు | Dark Green Yellow |
స్థాపితం | 1948 |
స్వంత మైదానం | అస్సాం క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, గౌహతి |
సామర్థ్యం | 40,000 |
రెండవ స్వంత మైదానం | నెహ్రూ స్టేడియం, గౌహతి |
రెండవ మైదాన సామర్థ్యం | 15,000 |
చరిత్ర | |
రంజీ ట్రోఫీ విజయాలు | 0 |
విజయ్ హజారే ట్రోఫీ విజయాలు | 0 |
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజయాలు | 0 |
అధికార వెబ్ సైట్ | www.assamcricket.com |
అస్సాం తన మొదటి ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ను 1948-49 రంజీ ట్రోఫీలో ఆడింది. రూపెర్ట్ కెటిల్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. రెండు సీజన్ల తర్వాత అతను తన మొదటి సెంచరీని సాధించాడు. వారు 1951–52 రంజీ ట్రోఫీలో ఒరిస్సాపై 103 పరుగుల తేడాతో విజయం సాధించారు; కెప్టెన్, పీటర్ బుల్లక్, 31, 148 పరుగులతో అత్యధిక స్కోరు సాధించాడు. 70 పరుగులకు 7 వికెట్లు, 29కి 3 వికెట్లు తీసుకున్నాడు.[1]
2002-03 సీజన్ వరకు, జోనల్ వ్యవస్థ రద్దు చేయక ముందు వరకు, అస్సాం ఈస్ట్ జోన్లో భాగంగా ఉండేది. ప్రీ-క్వార్టర్-ఫైనల్స్ కంటే ముందుకు ఎప్పుడూ పోలేదు. 2006/07లో తమ ప్లేట్ గ్రూప్‌ను గెలుచుకున్నాక, సెమీ-ఫైనల్లో ఒరిస్సా చేతిలో ఓడిపోయింది. 2009-10 సీజన్లో అస్సాం, రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్‌లోకి ప్రవేశించింది. ప్లేట్ గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచి, సూపర్ లీగ్‌కు చేరుకుంది. అయితే, 2010-11 సీజన్లో, వారు సూపర్ లీగ్‌లో తమ గ్రూప్‌లో అట్టడుగున నిలవడంతో, తరువాతి సీజన్లో ప్లేట్ లీగ్‌కు పంపబడ్డారు. 2012-13 విజయ్ హజారే ట్రోఫీలో అస్సాం చాలా బాగా ఆడి రన్నరప్‌గా నిలిచింది. [2] 2014-15 రంజీ సీజన్లో అస్సాం, మళ్లీ గ్రూప్ A స్థాయికి పదోన్నతి పొందింది. [3] 2015-16 రంజీ ట్రోఫీలో, జట్టు చరిత్రలో తొలిసారిగా సెమీ-ఫైనల్‌కు చేరుకుంది. [4]
2017 సెప్టెంబరులో భారత మాజీ బ్యాట్స్‌మెన్ లాల్‌చంద్ రాజ్‌పుత్ రెండు రంజీ ట్రోఫీ సీజన్లకు అస్సాం క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యాడు.
1948లో అస్సాం తన మొదటి హోమ్ మ్యాచ్ ఆడినప్పటి నుండి, షిల్లాంగ్, జోర్హాట్, నౌగాంగ్, డిబ్రూఘర్, కరీంగంజ్, హైలకండి, మంగళ్దోయ్, టిన్సుకియాలో (కాలక్రమానుసారం) కూడా ఫస్ట్-క్లాస్ హోమ్ మ్యాచ్‌లను ఆడింది. [5]
పేరు | పుట్టినరోజు | బ్యాఅటింగు శైలి | బౌలింగు శైలి | గమనికలు | ||
---|---|---|---|---|---|---|
బ్యాటర్లు | ||||||
రాహుల్ హజారికా | 1993 మే 31 | ఎడమచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |||
రిషవ్ దాస్ | 1989 డిసెంబరు 16 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |||
సిబ్శంకర్ రాయ్ | 1990 అక్టోబరు 10 | ఎడమచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |||
శుభం మండలం | 1998 ఆగస్టు 23 | ఎడమచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |||
గోకుల్ శర్మ | 1985 డిసెంబరు 25 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |||
సాహిల్ జైన్ | 1998 అక్టోబరు 22 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |||
నిహార్ నరహ్ | 2002 అక్టోబరు 10 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ | |||
డెనిష్ దాస్ | 2002 మే 17 | కుడిచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ | |||
ఆల్ రౌండర్లు | ||||||
రియాన్ పరాగ్ | 2001 నవంబరు 10 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | Plays for Rajasthan Royals in IPL | ||
స్వరూపం పురకాయస్థ | 1989 సెప్టెంబరు 15 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |||
రజ్జకుద్దీన్ అహ్మద్ | 1995 సెప్టెంబరు 2 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | |||
ఆకాష్ సేన్‌గుప్తా | 2000 అక్టోబరు 26 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ | |||
నిపాన్ దేకా | 2001 నవంబరు 15 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |||
వికెట్ కీపర్లు | ||||||
కునాల్ సైకియా | 1988 జూన్ 19 | కుడిచేతి వాటం | First-class and List A Captain | |||
అభిషేక్ ఠాకూరి | 1998 అక్టోబరు 31 | ఎడమచేతి వాటం | ||||
వసీకర్ రెహమాన్ | 1994 డిసెంబరు 29 | కుడిచేతి వాటం | ||||
స్పిన్ బౌలర్లు | ||||||
అవినోవ్ చౌదరి | 1999 డిసెంబరు 1 | కుడిచేతి వాటం | ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ | Vice-captain | ||
సిద్ధార్థ శర్మ | 1998 డిసెంబరు 7 | ఎడమచేతి వాటం | ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ | |||
రోషన్ ఆలం | 1995 ఏప్రిల్ 20 | కుడిచేతి వాటం | ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ | |||
అమలంజ్యోతి దాస్ | 2002 జనవరి 15 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |||
ఫాస్ట్ బౌలర్లు | ||||||
ముఖ్తార్ హుస్సేన్ | 1999 జనవరి 11 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ | |||
సునీల్ లచిత్ | 1999 డిసెంబరు 6 | కుడిచేతి వాటం | ఎడమచేతి మీడియం ఫాస్ట్ | |||
మృణ్మోయ్ దత్తా | 1998 నవంబరు 24 | ఎడమచేతి వాటం | ఎడమచేతి ఫాస్ట్ మీడియం | Twenty20 Captain | ||
హృదీప్ దేకా | 1999 అక్టోబరు 10 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ | |||
ధరణి రభా | 1997 సెప్టెంబరు 10 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ |
2023 జనవరి 24 నాటికి నవీకరించబడింది
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.