అమలా శంకర్

From Wikipedia, the free encyclopedia

అమలా శంకర్

అమలా శంకర్ (1919 జూన్ 27 - 2020 జూలై 24) [1] భారతీయ నర్తకి. [2] ఆమె నర్తకి, నృత్య రూపకర్త అయిన ఉదయ్ శంకర్ భార్య. సంగీత విద్వాంసుడు ఆనంద శంకర్, నర్తకి మమతా శంకర్ ల తల్లి.[3], సంగీతకారుడు, స్వరకర్త రవిశంకర్ వదిన.[4][5] భర్త ఉదయ్ శంకర్ రచన, సహనిర్మాత, దర్శకత్వం వహించిన కల్పన చిత్రంలో అమల శంకర్ నటించింది. ఆమె 2020 జూలై 24 న పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో 101 సంవత్సరాల వయస్సులో మరణించింది.[6]

 

త్వరిత వాస్తవాలు అమలా శంకర్, జననం ...
అమలా శంకర్
Thumb
2011 లో అమలా శంకర్
జననం
అమలా నంది

(1919-06-27)1919 జూన్ 27
మరణం24 జూలై 2020(2020-07-24) (aged 101)
జాతీయతభారతీయురాలు
వృత్తినర్తకి, నటి
క్రియాశీల సంవత్సరాలు1948
జీవిత భాగస్వామి
(m. 1942; died 1977)
పిల్లలుఆనంద శంకర్, మమతా శంకర్
తల్లిదండ్రులుఅఖోయ్ కుమార్ నంది (తండ్రి)
మూసివేయి

జీవిత చరిత్ర

అమలా శంకర్ బ్రిటిషు భారతదేశం (నేటి బంగ్లాదేశ్), బెంగాల్ ప్రెసిడెన్సీలో మగురా జిల్లాలోని బటాజోర్ గ్రామంలో 1919 జూన్ 27 న అమలా నందిగా జన్మించింది. ఆమె తండ్రి అఖోయ్ కుమార్ నంది తన పిల్లలు ప్రకృతిపై, గ్రామాలపై ఆసక్తి కలిగి ఉండాలని కోరుకున్నాడు.[7] 1931 లో, 11 సంవత్సరాల వయస్సులో ఆమె, పారిస్‌లోని అంతర్జాతీయ కలోనియల్ ఎగ్జిబిషన్‌కు వెళ్ళింది. ఇక్కడ ఆమె ఉదయ్ శంకర్‌ను, అతని కుటుంబాన్నీ కలిసింది. ఆ సమయంలో అమల ఫ్రాక్ వేసుకుంది. ఉదయ్ శంకర్ తల్లి హేమాంగినీ దేవి ఆమెకు కట్టుకోవడానికి చీరను ఇచ్చింది. ఆమె ఉదయ్ శంకర్ నృత్య బృందంలో చేరి ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శన ఇచ్చింది.[3]

Thumb
1941లో ఉదయ్ శంకర్, అమలా శంకర్

1939లో ఉదయ్ శంకర్ డ్యాన్స్ గ్రూప్‌తో చెన్నైలో ఉంటున్నప్పుడు, ఒకరోజు రాత్రి అమల వద్దకు వచ్చి పెళ్లి ప్రతిపాదన చేసాడు.[8] 1942 లో వాళ్ళ పెళ్ళి జరిగింది.[8] వారి మొదటి కుమారుడు ఆనంద శంకర్ 1942 డిసెంబరులో జన్మించాడు [9] కుమార్తె మమతా శంకర్ 1954 జనవరిలో జన్మించింది.[10] ఉదయ్ శంకర్, అమలా శంకర్ చాలా కాలం పాటు ప్రసిద్ధ నృత్య జంటగా వెలిగారు. కానీ, తరువాత ఉదయ్ శంకర్ తన బృందంలోని ఒక యువతితో ప్రేమలో పడ్డాడు. అతను అమల లేకుండా చండాలికను నిర్మించాడు.[3] ఉదయ్ శంకర్ 1977 లో మరణించారు. అంతకు కొన్ని సంవత్సరాలు ముందు నుండీ, ఈ జంట విడిగా ఉన్నారు.[3] 2012 నాటికి, అమలా శంకర్ చురుకుగా కృషిచేస్తోంది. ఆమె కుమార్తె మమత, కోడలు తనుశ్రీ శంకర్‌తో కలిసి శంకర్ ఘరానాను సజీవంగా ఉంచింది.[3] ఆమె సితార వాయిద్యకారుడైన రవిశంకర్‌కి వదిన.[11] ఆమె తొంభైల వరకు చురుకుగా ఉంది. 92 సంవత్సరాల వయస్సులో తన చివరి ప్రదర్శన అయిన సీతా స్వయంవర్ అనే నృత్య నాటకంలో ఆమె రాజు జనక పాత్రను పోషించింది.[12]

Thumb
కల్పన, 1948లో ఉదయ్ శంకర్, అమలా శంకర్‌లను చూపించే చిత్రం

అమల శంకర్ కల్పన (1948) చిత్రంలో నటించింది. ఈ చిత్రానికి రచన, సహనిర్మాత, దర్శకుడూ అయిన ఉదయ్ శంకర్ కూడా ఈ చిత్రంలో కనిపించాడు. ఉమ పాత్రలో అమల నటించింది. 2012 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ చిత్రం ప్రదర్శించబడినపుడు అమలా శంకర్ హాజరయ్యారు. అమలా శంకర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ– " 2012 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ ... కేన్స్ ఫెస్టివల్లో నేను అతి పిన్న వయస్కురాలిని... 81 ఏళ్ల తర్వాత మళ్లీ కేన్స్‌ని సందర్శిస్తున్నాను..." [8]

ఫిల్మోగ్రఫీ

మరింత సమాచారం సంవత్సరం, సినిమా ...
సంవత్సరం సినిమా దర్శకుడు సహనటులు
1948 కల్పన ఉదయ్ శంకర్ లక్ష్మీకాంత, ఉదయ్ శంకర్
మూసివేయి

సూచనలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.