బెంగాల్ ప్రెసిడెన్సీ

బ్రిటిషు భారతదేశం లోని పరిపాలన విభాగం From Wikipedia, the free encyclopedia

బెంగాల్ ప్రెసిడెన్సీ

బెంగాల్ ప్రెసిడెన్సీ (అధికారికంగా ప్రెసిడెన్సీ ఆఫ్ ఫోర్ట్ విలియం ఇన్ బెంగాల్) తర్వాతి కాలంలో బెంగాల్ ప్రావిన్స్, బ్రిటిష్ ఇండియా కాలం నాటి పరిపాలనా విభాగం. ఆ కాలంలో బ్రిటిష్ వారి ఏలుబడిలో ఉన్న భారతదేశంలో అన్ని ప్రెసిడెన్సీలలో ఇదే అతి పెద్దది.[5] బెంగాల్ ప్రెసిడెన్సీ అత్యుత్తమ ఏలుబడిలో ఉన్నప్పటికి ప్రస్తుతం దక్షిణాసియా, ఆగ్నేయ ఆసియాగా పిలుస్తున్న ప్రాంతంలో సింహభాగం ఇందులో భాగంగా ఉండేది. ఇవి ప్రధానంగా బంగ్లా భాష, సంస్కృతి ప్రధానంగా కలిగిన బంగ్లాదేశ్, భారత్ లోని పశ్చిమ బెంగాల్ ప్రాంతాలు. ఫోర్ట్ విలియం అనే కోట చుట్టూ ఏర్పడిన కలకత్తా ఈ ప్రెసిడెన్సీకి రాజధాని. చాలా సంవత్సరాలు బెంగాల్ గవర్నరే భారతదేశపు గవర్నరు జనరల్ గా ఉండేవారు. అలానే 1911 దాకా భారతదేశపు యథార్థ రాజధాని కలకత్తాయే.

త్వరిత వాస్తవాలు ప్రెసిడెన్సీ ఆఫ్ ఫోర్ట్ విలియం ఇన్ బెంగాల్ (1699–1935)ప్రావిన్స్ ఆఫ్ బెంగాల్ (1935–1947), రాజధాని ...
ప్రెసిడెన్సీ ఆఫ్ ఫోర్ట్ విలియం ఇన్ బెంగాల్
(1699–1935)[1]
ప్రావిన్స్ ఆఫ్ బెంగాల్
(1935–1947)[2]

1699–1947
Thumb
జండా
Thumb
19వ శతాబ్దం మధ్యలో పరిఢవిల్లిన బెంగాల్ పరిపాలనా విభాగం
రాజధానికోల్కత
అధికార భాషలు
  • ఆంగ్లం
  • బెంగాలీ
గవర్నరు 
 1699–1701 (మొదటి)
సర్ చార్లెస్ ఐర్
 1946–1947 (చివరి)
సర్ ఫ్రెడరిక్ బర్రోస్
ప్రీమియర్ 
 1937–1943 (మొదటి)
ఎ. కె. ఫజ్లుల్ హక్
 1946–1947 (ఆఖరి)
హెచ్. ఎస్. సూహ్రావార్డీ
శాసనవ్యవస్థలెజిస్లేచర్ ఆఫ్ బెంగాల్
 ఎగువ సభ
బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ (1862–1947)
 దిగువ సభ
బెంగాల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ (1935–1947)
చరిత్ర 
 బెంగాల్ ప్రాంతంతో వ్యాపారానికి మొఘలుల అనుమతి
1612
1757
 భారతదేశ విభజనలో భాగంగా బెంగాల్ రెండవ విభజన
1947
జనాభా
 1770
30,000,000[4]
ద్రవ్యంరూపాయి, పౌండ్ స్టెర్లింగ్, స్ట్రెయిట్స్ డాలర్
Preceded by
Succeeded by
బెంగాల్ సుబాహ్
కోన్‌బాంగ్ వంశం
డచ్ మలక్కా
కేడా సుల్తానులు
డచ్ బెంగాల్
ఫ్రెంచ్ ఇండియా
డేనిష్ ఇండియా
అహోం సామ్రాజ్యం
దిమాసా సామ్రాజ్యం
మటక్ సామ్రాజ్యం
జైన్షియా సామ్రాజ్యం
1853:
పంజాబ్ ప్రావిన్స్
1867:
వలస స్థావరాలు
1902:
యునైటెడ్ ప్రావిన్సెస్
1905:
తూర్పు బెంగాల్, అస్సామ్
1912:
బీహార్ అండ్ ఒరిస్సా ప్రావిన్స్
1947:
తూర్పు బెంగాల్
పశ్చిమ బెంగాల్
    మూసివేయి

    1612 లో మొఘల్ చక్రవర్తి జహంగీర్ బెంగాల్ ను పరిపాలిస్తున్న కాలంలో ఏర్పడ్డ వాణిజ్య స్థానాలు (ట్రేడింగ్ పోస్ట్) బెంగాల్ ప్రెసిడెన్సీకి పునాది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మిగతా ఐరోపా దేశాల కంపెనీలతో పోటీపడి బెంగాల్ లో మంచి ప్రాబల్యం సంపాదించింది. 1757 లో బెంగాల్ నవాబును అధికారం నుంచి తొలగించాక, 1764 లో జరిగిన బక్సర్ యుద్ధం తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ దాదాపు భారతదేశపు ఉపఖండంపైనంతా పట్టు సాధించింది. ఈ యుద్ధాల తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యం శక్తివంతమైనదిగా అవతరించడంతో భారతదేశంలో కంపెనీ పరిపాలనకు ఇదే నాంది అయ్యింది.[6][7] 1793 లో చార్లెస్ కార్న్‌వాలీస్ కు మొఘల్ ప్రభుత్వం నుంచి నిజామత్ (పరిపాలన, న్యాయాధికారాలు), దివానీ (పన్నులు వసూలు) అధికారాలు సంక్రమించాయి. దాంతో వారు విశాలమైన బెంగాల్ భూభాగంలో శాశ్వత స్థావరం ఏర్పాటు చేసుకుని, దాన్ని తమ పూర్తి నియంత్రణలోకి తెచ్చుకుని కొత్త పన్నుల విధానాన్ని ప్రవేశపెట్టారు.[8]

    చరిత్ర

    1599 లో ఒకటో ఎలిజబెత్ రాణి తూర్పు దేశాలతో వ్యాపారం చేసేందుకు లండన్ కేంద్రంగా ఒక వాణిజ్య సంస్థ ఏర్పాటు చేయాలని రాజశాసనం చేసింది. దీని పరిపాలనను ఒక గవర్నరు, 24 మంది డైరెక్టర్లకు అప్పగించింది. ఈ సంస్థనే ఆనరబుల్ ఈస్ట్ ఇండియా కంపెనీ (HEIC) అని పిలిచారు. ఆ కాలంలో ఇది ప్రపంచంలో సరిగే వాణిజ్యంలో సగభాగం మీద పట్టు సాధించి అత్యంత శక్తివంతమైన సంస్థగా నిలిచింది. ఎడ్మండ్ బర్క్ దీనిని, ప్రభుత్వమే వ్యాపార సంస్థ అయితే ఎలా ఉంటుందో ఇది అలా ఉంది అని వ్యాఖ్యానించాడు.[9] ఇంకా దీనిని రాజ్యంలో ఇంకో రాజ్యం అని అభివర్ణించారు.[10] ఈ సంస్థకు ఆంగ్లేయులు హిందూ మహాసముద్రంలో జరిపే వాణిజ్యమంతటి మీద గుత్తాధిపత్యాన్ని ఇచ్చారు.[11]

    మూలాలు

    Loading related searches...

    Wikiwand - on

    Seamless Wikipedia browsing. On steroids.