అన్నా మణి

భారతీయ అంతరిక్ష శాస్త్రజ్ఞురాలు From Wikipedia, the free encyclopedia

అన్నా మణి

అన్నా మణి (ఆగష్టు 23, 1918 - ఆగస్టు 16, 2001) భారత దేశానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త, వాతావరణ శాస్త్రవేత్త.[1] ఈమె భారత వాతావరణ శాఖ, పూణెలో డిప్యూటీ డైరక్టర్ జనరల్ గా ఉన్నారు. ఈమె వాతావరణ పరికరాలపై విశేష కృషిచేశరు. ఈమె సౌరశక్తి, పవన శక్తి, ఓజోన్ పొరపై అనేక పరిశోధనలు నిర్వహించి అనేక పరిశోధనా పత్రాలను ప్రచురించారు.[2]

త్వరిత వాస్తవాలు అన్నా మణి അന്ന മാണി, జననం ...
అన్నా మణి
അന്ന മാണി
Thumb
అన్నా మణి
జననంఆగష్టు 23 , 1918
ట్రావన్‌కోర్, కేరళ
మరణం16 ఆగస్టు 2001(2001-08-16) (aged 82)
తిరువనంతపురం, కేరళ
జాతీయతభారతీయులు
రంగములువాతావరణ శాస్త్రం, భౌతిక శాస్త్రవేత్త
వృత్తిసంస్థలుభారత వాతావరణ శాఖ, పూనే
మూసివేయి

ప్రారంభ జీవితం

అన్నామణి ట్రాన్స్‌కోర్ లో గల పీరుమేడులో జన్మించారు[3] ఆమె తండ్రి ఒక సివిల్ ఇంజనీరుగా పనిచేసేవారు. ఈమె తన కుటుంబంలో గల ఎనిమిది మంది సహోదరీ సహోదరులలో ఏడవది. ఆమె బాల్యంలో జ్ఞాన తృష్ణ గలది. ఈమె "వైకోం సత్యాగ్రగం" నిర్వహించే సమయంలో మహాత్మా గాంధీ చే ఆకట్టుకుంది. ఈమె జాతీయోద్యమంలో గాంధీజీచే ప్రభావితురాలైనది. ఆమె ఖాదీ దుస్తులు దరించేది. ఆమె వైద్యం కొనసాగించాలని కోరుకుంది. కానీ ఆమె భౌతిక శాస్త్రంపై గల మక్కువతో ఆ రంగంలో ఉండటానికి యిష్టపడ్డారు. 1939లో ఆమె మద్రాసులో గల ప్రెసిడెన్సీ కాలేజీలో పట్టభద్రురాలయ్యారు. ఈమె బి.యస్సీ. ఆనర్స్ డిగ్రీని భౌతిక, రసాయన శాస్త్రాలలో డిగ్రీని పొందారు.[3]

కెరీర్

ప్రెసిడెన్సీ కాలేజీ నుండి పట్టభద్రురాలైన తర్వాత ఆమె సి.వి.రామన్ వద్ద పనిచేశారు. ఇచట రుబీ, వజ్రం యొక్క దృశా ధర్మాలను పరిశోధించారు[2] ఆమె ఐదు పరిశోధనా పత్రాలను రచించింది. కానీ ఈమె భౌతిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేయని కారణంగా పి.హె.డి నిపొందలేకపోయింది.అపుడు ఆమె భౌతిక శాస్త్రం అధ్యయనం చేయుటకు బ్రిటన్ వెళ్ళింది. కానీ దానిని ఆపివేసి లండన్ నందుగల "ఇంపీరియల్ కాలేజి"లో వాతావరణ రంగానికి చెందిన పరికరాలపై పరిశోధనలు కొనసాహించారు.[3] 1948లో ఆమె భారతదేశానికి వచ్చిన తర్వాత పూనేలో గల వాతావరణ శాఖలో చేరారు. ఆమె వాతావరణ రంగంలో వివిధ పరికరాలపై విశేషమైన పరిశోధనలు చేసి పత్రాలను ప్రచురించారు. ఆమె 1976లో భాతర మెటెరోలోజికల్ డిపార్ట్‌మెంట్ నుండి డిప్యూటీ డైరక్టరు జనరల్ గా పదవీవిరమణ పొందారు. ఆమె 1980లో The Handbook for Solar Radiation data for India, 1981లో Solar Radiation over India అనే పుస్తకాలను రాశారు.[2] ఈమె కె.ఆర్.రామనాథన్ మెడల్ ను 1987లో గెలుపొందారు.[3]

1994 నుండి ఆమెకు గుండెపోటుతో బాధపడి ఆగష్టు 16, 2001తిరువనంతపురంలో మరణించారు[1]

సూచికలు

ఇతర లంకెలు

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.