అతిసార వ్యాధిని అంగ్ల భాషలో డయేరియా అంటారు. అతిసార వ్యాధి మామూలుగా వైరస్ వల్ల వస్తుంది. రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగిన పిల్లలకు రోటా వైరస్ వల్ల వస్తుంది. ఇదే అతిసార వ్యాధితో పాటు నెత్తురు పడితే 'డీసెంట్రీ' అంటారు. పిల్లలో మృత్యువుకు ఇది అతి ముఖ్యమైన కారణం. డీసెంట్రి వివిధ రకాలైన బ్యాక్టీరియా, ప్రోటోజోవాల ద్వారా వల్ల వస్తుంది. కలరా కూడా ఒక రకమైన అతిసార వ్యాధి.రోగి బ్రతికితే డయేరియా చస్తే కలరా అంటారని సామెత . వరల్డ్ హెల్త్ ఆర్గనైసేషన్ ప్రకారం ఒక మనిషి రోజులో మూడు లేక అంతకంటే ఎక్కువ సార్లు వదులుగా వీరేచనాలు చేసుకుంటే దానిని అతిసారం అంటారు.[1] ఐదు సంవత్సరాల లోపు పిల్లలలో మరణానికి అతిసార వ్యాధి రెండవ ప్రధాన కారణం. ప్రతి సంవత్సరం అతిసారం వలం 760 000 ఐదు సంవత్సరాల లోపు శిశువులు మరణిస్తున్నారు. అతిసార వ్యాధి సురక్షిత నీరు తాగుతు, పరిశుభ్రత పాటించడము వలన నివారించవచ్చు. ప్రపంచవ్యాపితంగా ప్రతి ఏడాది దాదాపు 1.7 బిలియన్ అతిసార వ్యాధి కేసులు నమోదవుతున్నాయి. డయేరియా ఐదేళ్ల లోపు పిల్లల్లో పోషకాహార లోపానికి అతిసారం ప్రధాన కారణం అవుతున్నది.[2]

Thumb
పిల్లలలో అతిసారం కలుగజేసే రోటా వైరస్ క్రిములు.

వ్యాధి కారకాలు

రోటా వైరస్, అస్ట్రో వైరస్, నార్ వ్యాక్ వైరస్, పికోర్నా వైరస్ మాములుగా కల్గిస్తాయి. డీసెంట్రీ కలిగించే బాక్టీరియాలు, ఈ.కోలై ( హీమోరేజిక్ సబ్ స్పీసీస్ 0H 157), క్యామపైలోబ్యాక్టర్ జెజెనై, సాల్మొనెల్లా జాతులు, షిగెల్లా. ఇవన్నీ నీటి కలుశితాల ద్వారా సంక్రమిస్తాయి. శుద్ధి లేని నీటిలో ఈ విరస్లు వృద్ధి చెందుతాయి.

వ్యాధి లక్షణాలు

వాంతులు, విరేచనాలు, తక్కువ ఉష్ణోగ్రతతో జ్వరం, డీసెంట్రి ఐతే రక్త విరేచనాలు, వికారంగా ఉండడం, అన్నహితం లేకపోవడం, మాములుగా ఈ జబ్బు 2-3 రోజులలో తగ్గిపోతుంది.పిల్లల్లో అతిసారం సాధారణంగా ఐదు నుంచి ఏడు రోజుల లోపల తగ్గిపోతుంది లేదంటే రెండు వారాల వరకు ఉంటుంది. పెద్దవారిలో సాధారణంగా రెండు నుండి నాలుగు రోజుల్లో తగ్గిపోతుంది.[3]

పరీక్షలు

విరేచనం పరీక్ష, రక్తపరీక్షలు రక్తంలో లవణాలు ఎలా ఉన్నాయో చూడడానికి

చికిత్స

  • లవణాలతో నిండిన నీరు సేవించడం,
  • వాంతుల వల్ల నీరు సేవించలేకపోతే నరాలలోకి లవణాలతో నిండిన నీరు (సెలైన్) ఎక్కించాలి.
  • తగినంత విశ్రాంతి

వ్యాధి నిరోధకత

మూత్ర, మలవిసర్జనల తరువాత, అన్నం తినే ముందు చేతులు కడుగుక్కోవాలి. కాచి చల్లార్చిన నీరు త్రాగాలి. రోటా వైరస్ కు వాక్సిన్‌ని తయారు చేశారు. కాని వ్యాక్సిన్ వల్ల అన్న ప్రేగు మెలిక పడడం వల్ల సంత (మార్కెట్టు) నుండి తీసివేయడం జరిగింది. సాల్మొనెల్లాకి కూడా వ్యాక్సిన్ ఉంది కాని దీనికి 3 సంవత్సరాలుకి ఒకసారి బూస్టర్స్ ఇవ్వాలి.ఎవరైతే మొదటి ఆరు నెలలు తల్లి పాలు తాగుతారో వాళ్ళు అతిసార వ్యాధి బారిన పడకుండా ఉంటారు.[4]

చేతి శుభ్రతతో డయేరియా దూరం

మలవిసర్జన తరువాత సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవడం వల్ల పిల్లల్లో డయేరియాతో సంభవించే మరణాలను 40 శాతం మేర తగ్గించవచ్చని యునిసెఫ్ నిపుణులు చెబుతున్నారు. ఈ విధానం అత్యంత సమర్థవంతమైన, చౌకైన నివారణ పద్ధతని వారు వివరించారు. చేతులు శుభ్రంగా కడుక్కుంటే తీవ్రస్థాయి వూపిరితిత్తుల ఇన్ఫెక్షన్లను కూడా 55 శాతం మేర నిరోధించవచ్చని తెలిపారు. ఈ రెండు వ్యాధుల వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది పిల్లలు చనిపోతున్నారు. చైనాలో ప్రాథమిక పాఠశాలల్లో సబ్బులు పంపిణీ చేయడం వల్ల పిల్లల్లో గైర్హాజరు 54 శాతం మేర తగ్గినట్లు తేలింది. కాన్పు చేసే నర్సులు, తల్లులు చేతులు శుభ్రంగా కడుక్కుంటే నవజాత శిశువులు మనుగడ సాగించే అవకాశాలు 44 శాతం మేర పెరుగుతాయి.ఒక గ్రాము మానవ మలంలో లక్ష వైరస్ ఉంటాయి. దేశంలో ఇప్పటికీ 65 శాతం మంది బహిరంగ ప్రదేశాల్లోనే మల విసర్జన చేస్తున్నారు.ఇందువలన కలిగే ఇన్ఫెక్షన్లను నివారించాలి. అక్టోబర్ 27ను చేతి శుభ్రత దినంగా పాటిస్తున్నారు. (ఈనాడు 26.10.2009)

మందులు

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.