అతడే ఒక సైన్యం

2004 సినిమా From Wikipedia, the free encyclopedia

అతడే ఒక సైన్యం

అతడే ఒక సైన్యం ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో 2004 లో విడుదలైన సినిమా. కె. అచ్చిరెడ్డి ఈ సినిమాను ఎస్. వి. కె. ఫిలింస్ పతాకంపై నిర్మించాడు.[1] సహకార బ్యాంకుల మోసాల నేపథ్యంలో అల్లుకున్న కథ ఇది. నిజాయితీ గల ఓ బ్యాంకు మేనేజరును ఆ బ్యాంకు యజమానులు మోసం చేసి చంపడంతో అతని తమ్ముడు తన తెలివి తేటలతో వారి మోసాన్ని బయటపెట్టి తన అన్న మీద పడ్డ మచ్చను చెరిపివేయడం, ఖాతాదారులకు న్యాయం చేకూర్చడం స్థూలంగా ఈ చిత్ర కథ.

త్వరిత వాస్తవాలు అతడే ఒక సైన్యం, దర్శకత్వం ...
అతడే ఒక సైన్యం
Thumb
సినిమా పోస్టర్
దర్శకత్వంఎస్. వి. కృష్ణారెడ్డి
రచనదివాకర్ బాబు (మాటలు)
స్క్రీన్ ప్లేఎస్. వి. కృష్ణారెడ్డి
కథఎస్. వి. కృష్ణారెడ్డి
నిర్మాతకె. అచ్చిరెడ్డి
తారాగణంజగపతి బాబు
నేహ బాంబ్
ఛాయాగ్రహణంకె. రవీంద్ర బాబు
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంఎస్. వి. కృష్ణారెడ్డి
నిర్మాణ
సంస్థ
ఎస్. వి. కె. ఫిలింస్
విడుదల తేదీ
23 జనవరి 2004 (2004-01-23)
సినిమా నిడివి
157 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
మూసివేయి

కథ

ప్రకాష్ రావు (ప్రకాష్ రాజ్) గుడ్ లక్ కోపరేటివ్ బ్యాంకు యజమాని. ఆ బ్యాంకు వినియోగదారుల నుంచి కోట్ల రూపాయల డబ్బు డిపాజిట్లు సేకరిస్తుంది. కీలక సమయంలో బ్యాంకు మేనేజరు రాఘవరావు (సుమన్) తప్పిదం వల్ల బ్యాంకు దివాలా తీస్తుంది. నిజానికి ఆ బ్యాంకు చైర్మన్ ప్రకాష్ రావు,, అతని అనుచరులు సొమ్మును తనకిష్టం వచ్చినట్లుగా ఖర్చు పెట్టుకుని అంతా పోగొట్టేస్తారు. బాధ్యత గల ఉద్యోగియైన రాఘవరావు జరిగిన అన్యాయాన్ని తెలుసుకుని వారి మీద తిరగబడతాడు. పోలీసులకు తెలియజేయక ముందే విలన్ గ్యాంగు రాఘవ రావు కుటుంబాన్ని అడ్డుపెట్టుకుని చంపి దాన్ని అత్మహత్యగా చిత్రీకరించి బ్యాంకు దివాలాకు అతనే కారణమని జనాల్ని నమ్మిస్తాడు.

చంటి అలియాస్ శ్రీధర్ (జగపతి బాబు) రాఘవరావు తమ్ముడు. అన్నయ్య క్రమశిక్షణలో పెరుగుతాడు. పదిమందికి సాయం చేయడం ఎలాగో అన్నయ్య నుంచి నేర్చుకుంటాడు. జర్మనీలో ఉండి చదువుకుంటూ ఉంటాడు. జరిగిన ప్రమాదం తెలుసుకుని ఉన్నపళంగా భారతదేశానికి వస్తాడు. జరిగిన ఘోరానికి కారణం ప్రకాష్ రావు, అతని భాగస్వాముల పనే అని తెలుసుకుంటాడు. తనలాగా మోసపోయిన కొంతమందిని తనతో చేర్చుకుని ప్రకాష్ రావును తెలివిగా దెబ్బ కొడతాడు. అతని ఆస్తులన్నీ కొట్టేసి నష్టపోయిన వినియోగదార్లకు పంచిపెడతాడు. ప్రకాష్ రావును తప్పు ఒప్పుకొనేలా చేసి తన అన్నయ్య మీదున్న అపవాదును తుడిచివేయడంతో కథ ముగుస్తుంది.

తారాగణం

పాటలు

మరింత సమాచారం సం., పాట ...
సం.పాటగాయకులుపాట నిడివి
1."నా పాట తేట తెలుగు పాట"సునీత ఉపద్రష్ట5:49
2."ఆగస్టు పదిహేడు"ఎస్. పి. చరణ్, రవి వర్మ, కౌసల్య, సునీత5:28
3."మా ఇంటికి నిన్ను పిలిచి"హరిహరన్, సునీత్5:08
4."నీ బుల్లి నిక్కరు చూసి"ఉదిత్ నారాయణ్, శ్రేయ ఘోషాల్5:43
5."ఏ అప్పారావో"కార్తీక్, సునీత్5:12
మొత్తం నిడివి:27:20
మూసివేయి

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.