ఎన్నికల నిర్వహణ సంస్థ From Wikipedia, the free encyclopedia
భారత ఎన్నికల కమిషను, స్వతంత్ర భారతదేశంలో ఎన్నికలను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రాజ్యాంగం ద్వారా ఏర్పాటు చేసిన సంస్థ. 1950 జనవరి 25 న ఏర్పాటు చేయబడిన ఈ కమిషను సుప్రీం కోర్టు వలెనే, రాజ్యాంగం ఏర్పరచిన స్వతంత్ర వ్యవస్థ, ప్రభుత్వ నియంత్రణకు లోబడి ఉండదు.[1]
భారతదేశం |
ఈ వ్యాసం భారతదేశం రాజకీయాలు, ప్రభుత్వంలో ఒక భాగం. |
|
|
|
దేశంలో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ, రాష్ట్ర శాసన సభలు, శాసన మండళ్ళకు జరిగే ఎన్నికలను కమిషను నిర్వహిస్తుంది. ఈ ఎన్నికల నిర్వహణలో పర్యవేక్షణ, మార్గ నిర్దేశకత్వం, నియంత్రణ చేయవలసిన బాధ్యతను రాజ్యాంగం కమిషనుపై ఉంచింది.
ఎన్నికల కమిషను అధినేతను ప్రధాన ఎన్నికల కమిషనర్ అంటారు. మొదట్లో ఒక కమిషనరు ఉండేవారు. 1989 అక్టోబర్ 16 న మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్లను నియమించారు. అయితే అది కేవలం 1990 జనవరి 1 వరకు మాత్రమే కొనసాగింది. మళ్ళీ 1993 అక్టోబర్ 1న ఈ నియామకాలు జరిగాయి. అప్పటి నుండి ముగ్గురు సభ్యుల కమిషను బాధ్యతలు నిర్వహిస్తూ వస్తూంది.
ముగ్గురు కమిషనర్లతో పాటు ఢిల్లీలో ఉన్న కమిషను కార్యాలయంలో కొంత మంది డిప్యూటీ కమిషనర్లు, 300 మంది ఇతర అధికారులు, సిబ్బంది ఉంటారు. రాష్ట్ర ఎన్నికల కమీషన్ [2] రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాటు చేయబడింది. జాతీయ ఎన్నికల కమీషన్ కు వున్న అధికారాలు రాష్ట్ర ఎన్నికల కమీషన్ కు వుంటాయి. రాష్ట్రాల్లో ప్రధాన ఎన్నికల కమిషనరుచే నియమించబడే ముఖ్య ఎన్నికల అధికారి, కొందరు సహాయక సిబ్బంది ఉంటారు. అయితే ఎన్నికల సమయంలో మాత్రం, ఎన్నికల నిర్వహణలో పాల్గొనే 50 లక్షల పైచిలుకు సిబ్బంది యావత్తూ తాత్కాలికంగా ఎన్నికలు ముగిసేవరకు కమిషను అదుపాజ్ఞలలో పనిచేస్తారు.
ప్రధాన ఎన్నికల కమిషనరును, ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమిస్తారు. పదవీకాలం 6 లేదా ఆ వ్యక్తికి 65 ఏళ్ళ వయసు వచ్చే వరకు -ఏది ముందయితే అది.
రాజ్యాంగ సంస్థ అయిన కమిషను ఎన్నికలకు సంబంధించినంత వరకు సర్వ స్వతంత్ర సంస్థ. దీని ముఖ్య కార్యకలాపాలు ఇలా ఉన్నాయి.
ఎన్నికల నిర్వహణను సంస్కరిస్తూ కమిషను కొన్ని చర్యలు చేపట్టింది. వాటిలో కొన్ని:
పూర్వపు రోజుల్లో కమిషను కార్యనిర్వాహ వ్యవస్థకు అనుకూలంగా ఉంటూ ఉండేది. ఇటీవలి కాలంలో- ముఖ్యంగా 1990 నుండి - కమిషను మరింత చైతన్యవంతంగా, ప్రభావవంతంగా వ్యవహరిస్తూంది. ఇప్పటికే ఉన్న నియమాలను కఠినంగా అమలు చెయ్యడంతో పాటు, కొన్ని కొత్త నియమాలను కూడా ప్రవేశపెట్టింది. కొన్ని సందర్భాలలో రాజకీయ పార్టీలతో కొందరు కమిషనర్లకు ఘర్షణ నెలకొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎలా ఉన్నా, మొత్తం మీద కమిషను పనితీరు మాత్రం ఎంతో మెరుగుపడింది
క్ర.సం | పేరు | పదవీకాలం | |
---|---|---|---|
మొదలు | అంతం | ||
1 | సుకుమార్ సేన్ | 1950 మార్చి 21 | 1958 డిసెంబరు 19 |
2 | కె.వి.కె.సుందరం | 1958 డిసెంబరు 20 | 1967 సెప్టెంబరు 30 |
3 | ఎస్.పి.సేన్వర్మ | 1967 అక్టోబరు 1 | 1972 సెప్టెంబరు 30 |
4 | నాగేంద్ర సింగ్ | 1972 అక్టోబరు 1 | 1973 ఫిబ్రవరి 6 |
5 | టి.స్వామినాథన్ | 1973 ఫిబ్రవరి 7 | 1977 జూన్ 17 |
6 | ఎస్.ఎల్.షక్దర్ | 1977 జూన్ 18 | 1982 జూన్ 17 |
7 | ఆర్.కె.త్రివేది | 1982 జూన్ 18 | 1985 డిసెంబరు 31 |
8 | ఆర్.వి.ఎస్.పేరిశాస్త్రి | 1986 జనవరి 1 | 1990 నవంబరు 25 |
9 | వి.ఎస్.రమాదేవి | 1990 నవంబరు 26 | 1990 డిసెంబరు 11 |
10 | టి.ఎన్.శేషన్ | 1990 డిసెంబరు 12 | 1996 డిసెంబరు 11 |
11 | మనోహర్ సింగ్ గిల్ | 1996 డిసెంబర్ 12 | 2001 జూన్ 13 |
12 | జె.ఎం.లింగ్డో | 2001 జూన్ 14 | 2004 ఫిబ్రవరి 7 |
13 | టి.ఎస్.కృష్ణ మూర్తి | 2004 ఫిబ్రవరి 8 | 2005 మే 15 |
14 | బి.బి.టాండన్ | 2005 మే 16 | 2006 జూన్ 29 |
15 | ఎన్.గోపాల స్వామి | 2006 జూన్ 30 | 2009 ఏప్రిల్ 20 |
16 | నవీన్ చావ్లా | 2009 ఏప్రిల్ 21 | 2010 జూలై 29 |
17 | ఎస్.వై.ఖురైషి | 2011 జూలై 30 | 2012 జూన్ 10 |
18 | వి.ఎస్.సంపత్ | 2012 జూన్ 11 | 2015 జనవరి 15 |
19 | హరిశంకర్ బ్రహ్మ | 2015 జనవరి 16 | 2015 ఏప్రిల్ 18 |
20 | నసీమ్ జైదీ | 2015 ఏప్రిల్ 19 | 2017 జూలై 5 |
21 | అచల్ కుమార్ జ్యోతి | 2017 జూలై 6 | 2018 జనవరి 22 |
22 | ఓం పకాష్ రావత్ | 2018 జనవరి 23 | 2018 డిసెంబరు1 |
23 | సునీల్ అరోరా | 2018 డిసెంబరు 2 | 2021 ఏప్రిల్ 12 |
23 | సుశీల్ చంద్ర | 2021 ఏప్రిల్ 13 | 2022 మే 14 |
23 | రాజీవ్ కుమార్ | 2022 మే 15 | 2022 నవంబరు 19 |
తొలి ప్రధాన ఎన్నికల అధికారిగా పి.సిసోడియా పనిచేశాడు. 2019 జనవరి 17న గోపాలకృష్ణ ద్వివేది ప్రధాన ఎన్నికల అధికారిగా నియమించబడ్డాడు.[3] 2019 జూన్ 13న ద్వివేది స్థానంలో కె విజయానంద్ నియమించబడ్డాడు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.