జనవరి 29: బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మద్దతుతో, వారి రక్షణతో బెంగాల్ నవాబుగా సింహాసనం పొందిన మీర్ జాఫర్ మరణానికి ఒక వారం ముందు, తన 18 ఏళ్ల కుమారుడు నజ్ముద్దీన్ అలీ ఖాన్ కు పట్టం గట్టి తాను తప్పుకున్నాడు. [1]
ఏప్రిల్ 26: జర్మన్ ఇంజనీర్ క్రిస్టియన్ క్రాట్జెన్స్టెయిన్, గాట్ఫ్రైడ్ లీబ్నిజ్ కనుగొన్న అంకగణిత యంత్రాన్ని మెరుగుపరచి సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు ప్రదర్శించాడు. క్రాట్జెన్స్టెయిన్ తన యంత్రం నాలుగు అంకెలకు పైన ఉన్న సంఖ్యలతో లెక్కలు చేస్తుందని చెప్పాడు. కాని ఈ యంత్రాన్ని మరింత ముందుకు అభివృద్ధి చెయ్యలేదు. [2]
మే 26: గ్లాస్గో గ్రీన్ వద్ద మధ్యాహ్నం ఉద్యానవనంలో షికారు చేస్తున్నప్పుడు, స్కాటిష్ ఇంజనీర్ జేమ్స్ వాట్కుఆవిరి యంత్రం అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళే ప్రేరణ కలిగింది. అతను తరువాత ఇలా వివరించాడు, "ఈ ఆలోచన నా మనసులోకి వచ్చింది, ఆవిరి శూన్యంలోకి వెళుతుంది, సిలిండర్ లోకి దూసుకుపోతుంది సిలిండర్‌ను చల్లబరచకుండా ద్రవీభవిస్తుంది. ..నా మదిలో ఈ విషయం మొత్తం రూపుదిద్దుకునేటప్పటికి నేనింకా గోల్ఫ్-హౌస్ అంత దూరం కూడా నడవలేదు." [3]
Matthew L. Jones, Reckoning with Matter: Calculating Machines, Innovation, and Thinking about Thinking from Pascal to Babbage (University of Chicago Press, 2016) p133