మార్చి 27: గ్రేట్ బ్రిటన్, స్పెయిన్ మధ్య మొదటి ఉట్రేచ్ట్ ఒప్పందం: ఫిలిప్ V ను స్పెయిన్ రాజుగా బ్రిటన్, ఆస్ట్రియాలు అంగీకరించాయి. స్పెయిన్ జిబ్రాల్టర్, మెనోర్కాను బ్రిటన్‌కు అప్పగించింది.[1][2]
ఏప్రిల్ 11: గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్‌ల మధ్య కుదిరిన రెండవ ఉట్రేచ్ట్ ఒప్పందంతో స్పానిష్ వారసత్వ యుద్ధం ముగిసింది .[3] ఫ్రాన్స్ న్యూఫౌండ్లాండ్, అకాడియా, హడ్సన్ బే, సెయింట్ కిట్స్ లను గ్రేట్ బ్రిటన్‌కు అప్పగించింది.[1]
ఏప్రిల్ 14: జోసెఫ్ అడిసన్ యొక్క స్వేచ్ఛావాద నాటకం కాటో, ఎ ట్రాజెడీని తొలిసారి లండన్‌లో, ప్రదర్శించారు.[4]
జూన్ 23: అకాడియాలోని ఫ్రెంచ్ నివాసితులకు గ్రేట్ బ్రిటన్‌కు విధేయత ప్రకటించడానికి లేదా నోవా స్కోటియాను విడిచిపెట్టి పోడానికి ఒక సంవత్సరం సమయం ఇచ్చారు.
జూలై 13: పోర్ట్స్మౌత్ ఒప్పందంతో క్వీన్ అన్నే యుద్ధానికి ముగిసింది.
నవంబరు: తీవ్రంగా పోటీ జరిగిన ఐరిష్ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా డబ్లిన్‌లో అల్లర్లు చెలరేగాయి.
తేదీ తెలియదు: కడప నవాబైన అబ్దుల్ నబి ఖాన్ మదనపల్లెని తన ఆధీనంలో తీసుకున్నాడు.
తేదీ తెలియదు: నిజాం ఉల్ ముల్క్‌ను దకక్కనులో మొగల్ సామ్రాజ్య సుబేదారుగా ప్రకకటించారు.
జనవరి 5: జార్జ్ జువాన్ వై శాంటాసిలియా, స్పానిష్ జియోడెసిస్ట్ (మ .1773 )
జనవరి 7: గియోవన్నీ బాటిస్టా లోకటెల్లి, ఇటాలియన్ ఒపెరా డైరెక్టర్ (మ .1755 )
జనవరి 13: షార్లెట్ చార్క్, బ్రిటిష్ నటుడు, రచయిత (d. 1760 )