శరత్ బాబు
సినీ నటుడు / From Wikipedia, the free encyclopedia
శరత్‌బాబు (1951, జూలై 31 - 2023, మే 22) విలక్షణమైన తెలుగు సినిమా నటుడు. తమిళ, తెలుగు, కన్నడ సినిమాలలో తన 50 ఏళ్ల సినీ జీవితంలో 250కి పైగా సినిమాలలో నటించాడు. కథానాయకుడుగానే కాక, ప్రతినాయకుని పాత్రలు, తండ్రి పాత్రలు వంటి విలక్షణ పాత్రలు పోషించాడు.[2] ఈయన అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్. రామవిజేతా వాళ్లు (కె.ప్రభాకర్, కె.బాబూరావు) సినీరంగానికి పరిచయం చేస్తూ ఈయన పేరును శరత్‌బాబుగా మార్చారు.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
శరత్ బాబు | |
---|---|
జననం | సత్యం బాబు దీక్షిత్ 1951 జులై 31 |
మరణం | 2023 మే 22(2023-05-22) (వయసు 71) [1] |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1973 – 2023 |
జీవిత భాగస్వామి | రమాప్రభ (-1988) |
హీరోగా శరత్ బాబు తొలిచిత్రం 1973లో విడుదలైన రామరాజ్యం. తర్వాత కన్నెవయసు చిత్రంలో నటించారు. అటుపిమ్మట సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో పంతులమ్మ, అమెరికా అమ్మాయి చిత్రాలలో నటించారు. తర్వాత తెలుగులో బాలచందర్ దర్శకత్వంలో విడుదలైన చిలకమ్మ చెప్పింది సినిమాలో నటించాడు.
బుల్లితెరపై అంతరంగాలు, ఎండమావులు తదితర ధారావాహికలలోనూ ఆయన నటించాడు. ఆయన చివరిసారిగా వకీల్ సాబ్ సినిమాలో కనిపించగా త్వరలో రిలీజ్ కానున్న మళ్లీ పెళ్లి (2023) సినిమాలోనూ ఓ కీలక పాత్ర పోషించాడు.