లెబనాన్
From Wikipedia, the free encyclopedia
లెబనాన్ అరబిక్:لبنان. లెబనీస్ అరబిక్ : అధికారనామం " లెబనాన్ రిపబ్లిక్ " [nb 1]
الجمهورية اللبنانية Al-Jumhūriyyah al-Lubnāniyyah Lebanese Republic |
||||||
---|---|---|---|---|---|---|
నినాదం Kūllūnā li-l-waṭan, li-l-'ula wa-l-'alam (Arabic) "We are all for the Country, the Sublime and the Flag!" |
||||||
జాతీయగీతం Kulluna lil-watan lil 'ula lil-'alam |
||||||
రాజధాని అతి పెద్ద నగరం | Beirut 33°54′N 35°32′E | |||||
అధికార భాషలు | Arabic | |||||
ప్రభుత్వం | Republic | |||||
- | President | Michel Suleiman | ||||
- | Prime Minister | Saad Hariri | ||||
Independence | ||||||
- | Declared | November 26, 1941 | ||||
- | Recognized | November 22, 1943 | ||||
విస్తీర్ణం | ||||||
- | మొత్తం | 10,452 కి.మీ² (166th) 4,035 చ.మై |
||||
- | జలాలు (%) | 1.6 | ||||
జనాభా | ||||||
- | July 2007 అంచనా | 3,925,502 (128th) | ||||
- | జన సాంద్రత | 358 /కి.మీ² (26th) 948 /చ.మై |
||||
జీడీపీ (PPP) | 2006 అంచనా | |||||
- | మొత్తం | $21.45 billion (103rd) | ||||
- | తలసరి | $5,500 (90th) | ||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2006) | 0.774 (medium) (78th) | |||||
కరెన్సీ | Lebanese lira (LL) (LBP ) |
|||||
కాలాంశం | EET (UTC+2) | |||||
- | వేసవి (DST) | EEST (UTC+3) | ||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .lb | |||||
కాలింగ్ కోడ్ | +961 |
లెబనీస్ అరబిక్ :, సార్వభౌమాధికారం కలిగిన దేశం. లెబనాల్ ఉత్తర, తూర్పు సరిహద్దులో సిరియా, దక్షిణ సరిహద్దులో ఇజ్రాయిల్ ఉన్నాయి. మధ్యధరా సముద్రతీరంలో ఆరేబియన్ దేశాల మద్య ఉన్నందున లెబనాన్ సుసంపన్నమైన చరిత్ర, సాంస్కృతిక వైభవం, మతం, సంప్రదాయక వైవిధ్యం కలిగి ఉంది. [1] లెబనాన్ లోని నాగరికత సంబంధిత పురాతత్వ సాక్ష్యాలు 7 వేల నాటి చరిత్రకు సాక్ష్యంగా నిలిచాయి.[2]
లెబనాన్ కనానిటీల (ఫోయెనిషియన్లు) పూర్వీకప్రాంతం, వారి పాలిత ప్రాంతం. ఇక్కడ దాదాపు 1000 సంవత్సరాల కాలం (క్రీ.పూ. 1550-539) సముద్రతీర సంప్రదాయం అభివృద్ధిచెంది సుసంపన్నగా వర్ధిల్లింది. క్రీ.పూ 64 లో ఈ ప్రాంతం రోమన్లు స్వాధీనం చేసుకున్నారు. తరువాత ఇది సామ్రాజ్యంలో ప్రధాన కేంద్రంగా (క్రైస్తవ కేంద్రం) మారింది. లెబనాన్ పర్వతశ్రేణిలో రోమన్ సామ్రాజ్యానికి గుర్తుగా " మెరోనైట్ చర్చి " నిర్మించబడింది. ఈ ప్రాంతాన్ని అరబ్ ముస్లిములు ఆక్రమించుకున్నారు. మెరోనైట్లు (లెబనాన్ క్రైస్తవులు) వారి ప్రాంతంలో వారికే ప్రత్యేకమైన మతపరమైన అంతస్తు కలిగి ఉన్నారు. అయినప్పటికీ లెబనాన్ పర్వతశ్రేణిలో సరికొత్తగా డ్రుజ్ మతసంప్రదాయం రూపొందించబడింది. ఈ మతపరమైన విభేదాలు దాదాపు రెండు శతాబ్ధాల కాలం కొనసాగింది. క్రుసేడర్స్ కాలంలో మెరోనైట్లు రోమన్ కాథలిక్ చర్చితో సంబంధాలు పునరుద్ధరించుకొన్నారు. అలాగే వారు రోమ్కు రాకపోకలు కొనసాగించారు. వారు లాటిన్లతో ఏర్పరుచుకున్న పరస్పర సంబంధాలు ఈ ప్రాంతంలో ఆధునికశకారంభానికి నాంది అయింది.