మార్టినిక్
ఫ్రాన్సు విదేశీ భూభాగం From Wikipedia, the free encyclopedia
ఫ్రాన్సు విదేశీ భూభాగం From Wikipedia, the free encyclopedia
మార్టినిక్, ఫ్రాన్సుకు చెందిన విదేశీ భూభాగం. ఇది ఫ్రెంచ్ రిపబ్లిక్లో అంతర్భాగం. [6] మార్టినిక్ తూర్పు కరేబియన్ సముద్రంలో వెస్టిండీస్‌లోని లెస్సర్ యాంటిల్లెస్‌లో ఉన్న ద్వీపం. దీని వైశాల్యం 1,128 కి.మీ2 (436 చ. మై.). 2019 జనవరి నాటికి దీని జనాభా 3,64,508. [7] ఇది విండ్‌వార్డ్ దీవులలో ఒకటి. సెయింట్ లూసియాకుకు సరిగ్గా ఉత్తరంగా, బార్బడోస్‌కు వాయవ్యంగా, డొమినికాకు దక్షిణంగా ఉంది. మార్టినిక్ యూరోపియన్ యూనియన్ లోని అత్యంత బయటి ప్రాంతం (OMR), యూరోపియన్ యూనియన్ లోని ప్రత్యేక భూభాగం. ఇక్కడ వాడుకలో ఉన్న కరెన్సీ యూరో. ప్రజలందరూ ఫ్రెంచి (ఏకైక అధికారిక భాష), మార్టినికన్ క్రియోల్ రెండింటినీ మాట్లాడతారు. [8]
మార్టినిక్
Matinik or Matnik (Martinican French Creole) | |
---|---|
ఫ్రాన్సు విదేశీ డిపార్టుమెంటు | |
మార్టినిక్ ప్రాంత సమూహం Collectivité Territoriale de Martinique (French) | |
Motto: La collective au service du pays[1] | |
Anthem: La Marseillaise ("The Marseillaise") | |
Coordinates: 14°39′00″N 61°00′54″W | |
దేశం | France |
స్వయంపాలిత ప్రాంతం | ఫోర్ట్ డి ఫ్రాన్స్ |
డిపార్టుమెంట్లు | 1 |
Government | |
• శాసనసభ | మార్టినిక్ అసెంబ్లీ |
విస్తీర్ణం | |
• Total | 1,128 కి.మీ2 (436 చ. మై) |
• Rank | 17th region |
Highest elevation (మోం పెలే) | 1,397 మీ (4,583 అ.) |
జనాభా (మూస:France metadata Wikidata)మూస:France metadata Wikidata | |
• Total | మూస:France metadata Wikidata |
• జాతులు |
|
• మతం | [3] |
భాష | |
• అధికారిక | ఫ్రెంచి |
• స్థానిక భాష | ఫ్హ్రెంచి క్రియోల్ |
Time zone | UTC−04:00 (ECT) |
ISO 3166 code |
|
GDP (2015)[4] | Ranked 23rd in France |
మొత్తం | US$9,363,000,000[5] |
తలసరి ఆదాయం | US$24,964 |
NUTS Region | FRA |
Website | Prefecture, Territorial collectivity |
1493లో క్రిస్టోఫర్ కొలంబస్ మార్టినిక్‌ను గుర్తించాడు. అయితే స్పెయిన్ ఈ భూభాగంపై పెద్దగా ఆసక్తి చూపలేదు. [9] కొలంబస్ 21-రోజుల వాణిజ్య పవన మార్గం తర్వాత, 1502 జూన్ 15 న ఇక్కడ దిగాడు. [9] అతను మూడు రోజులు అక్కడ తన నీటి పీపాలను నింపుకోవడం, స్నానం చేయడం, బట్టలు ఉతుక్కోవడం వంటివి చేశాడు.
1635 సెప్టెంబరు 15 న, సెయింట్ కిట్స్ ద్వీపపు ఫ్రెంచి గవర్నర్ అయిన పియరీ బెలైన్ డి'ఎస్నాంబక్ను, ఆంగ్లేయులు సెయింట్ కిట్స్ నుండి తరిమివేయడంతో అతను 80-150 మంది ఫ్రెంచివారితో కలిసి సెయింట్ పియరీ నౌకాశ్రయంలో దిగాడు. డి'ఎస్నాంబక్ ఫ్రెంచ్ రాజు లూయిస్ XIII ఫ్రెంచ్ " కంపాగ్నీ డెస్ ఐల్స్ డి ఎల్'అమెరిక్ " (అమెరికన్ దీవుల కంపెనీ) కోసం మార్టినిక్‌ను ఆక్రమించాడు. ఫోర్ట్ సెయింట్-పియరీ (ఇప్పుడు సెయింట్ పియరీ)లో మొదటి యూరోపియన్ స్థావరాన్ని స్థాపించాడు. [9] డి'ఎస్నాంబుక్ 1636లో మరణించాక కంపెనీతో పాటు మార్టినిక్ అతని మేనల్లుడు జాక్వెస్ డైల్ డు పార్క్వెట్ చేతుల్లోకి వెళ్ళింది. అతను 1637లో ద్వీపానికి గవర్నర్ అయ్యాడు. [9]
స్వదేశీ కారిబ్‌లు వలసవాసులకు మధ్య జరిగిన అనేక తగువులలో మొదటిది 1636లో జరిగింది. ఫ్రెంచ్ వారు స్థానికులను విజయవంతంగా తిప్పికొట్టి వారిని ద్వీపపు తూర్పు భాగానికి, అప్పటికి కాపెస్టరే అని పిలువబడే ప్రాంతంలోని కారవెల్లే ద్వీపకల్పంలోకి తరిమారు. 1658లో ఫ్రెంచి పాలనకు వ్యతిరేకంగా కారీబ్లు తిరుగుబాటు చేసినప్పుడు, గవర్నర్ చార్లెస్ హౌల్ డు పెటిట్ ప్రే వారిపై యుద్ధంతో ప్రతీకారం తీర్చుకున్నాడు. చాలా మందిని చంపేసారు. ప్రాణాలతో బయటపడిన వారిని బందీలుగా పట్టుకుని ద్వీపం నుండి బహిష్కరించారు. కొంతమంది కారిబ్‌లు డొమినికా లేదా సెయింట్ విన్సెంట్‌కు పారిపోయారు, అక్కడ వారిని ఫ్రెంచి వారు ప్రశాంతంగా ఉండనిచ్చారు.
1658లో డు పార్క్వెట్ మరణించిన తర్వాత, అతని భార్య మేరీ బొన్నార్డ్ డు పార్క్వెట్ మార్టినిక్‌ను పరిపాలించడానికి ప్రయత్నించింది. కానీ ఆమె పాలన పట్ల ఇష్టపడని కారణంగా కింగ్ లూయిస్ XIV ద్వీపపు సార్వభౌమాధికారాన్ని స్వాధీనం చేసుకున్నాడు. [9] 1654లో, పోర్చుగీస్ బ్రెజిల్ నుండి బహిష్కరించబడిన డచ్ యూదులు ఇక్కడ చక్కెర తోటలను ప్రవేశపెట్టారు. ఈ తోటల్లో ఆఫ్రికన్లు పెద్ద సంఖ్యలో బానిసలుగా పనిచేసేవారు. [9]
1667లో రెండవ ఆంగ్లో-డచ్ యుద్ధం కరేబియన్‌లో వ్యాపించింది, మార్టినిక్‌లోని డచ్ అనుకూల ఫ్రెంచ్ నౌకాదళంపై బ్రిటన్ దాడి చేసి, దానిని నాశనం చేసింది. ఈ ప్రాంతంలో బ్రిటిష్ ప్రాబల్యాన్ని మరింత సుస్థిరం చేసింది. [10] 1674లో, డచ్‌లు ఈ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారు, కానీ తిప్పికొట్టారు. [9]
ఆంటిల్లెస్ చార్లెస్ డి కోర్బన్ గవర్నర్ కామ్టే డి బ్లెనాక్ కింద ఉండగా మార్టినిక్, కెప్టెన్ క్రాప్యూ, ఎటియెన్ డి మోంటౌబాన్, మాథురిన్ డెస్మరెస్ట్జ్ వంటి ఫ్రెంచ్ సముద్రపు దొంగలకు హోం పోర్ట్‌గా ఉండేది. [11]
మార్టినిక్పై బ్రిటిషు వారు 1693, 1759, 1762, 1779 లలో అనేకసార్లు దాడి చేసారు. [9] అమియన్స్ ఒప్పందంపై సంతకం చేసిన తరువాత 1802 నుండి 1809 వరకు ఉన్న కాలాన్ని మినహాయించి, 1794 - 1815 మధ్య ఎక్కువ కాలం ఈ ద్వీపం బ్రిటన్ అధీనంలో ఉండేది. [9] నెపోలియన్ యుద్ధాల ముగింపులో ఫ్రాన్స్‌కు తిరిగి అప్పగించినప్పటి నుండి మార్టినిక్, ఫ్రెంచ్ స్వాధీనంలో ఉంది.
1720లలో కాఫీ తోటలను ప్రవేశపెట్టినప్పుడు మార్టినిక్, పశ్చిమార్ధగోళంలో మొదటి కాఫీ-పండించే ప్రాంతం అయింది. [12] అయితే, 1800ల ప్రారంభంలో చక్కెర ధరలు తగ్గుముఖం పట్టడంతో, ప్లాంటర్ వర్గం రాజకీయ ప్రభావాన్ని కోల్పోయింది. 1789, 1815, 1822లో బానిస తిరుగుబాట్లు, అలాగే సిరిల్ బిస్సెట్, విక్టర్ స్కాల్చెర్ వంటి నిర్మూలనవాదుల ప్రచారాల కారణంగా, 1848 లో ఫ్రెంచ్ వెస్టిండీస్‌లో బానిసత్వాన్ని అంతం చేయడానికి ఫ్రెంచ్ ప్రభుత్వం ఒప్పుకుంది. [13] [9] [14] [15] ఫలితంగా, కొంతమంది తోటల యజమానులు భారతదేశం, చైనాల నుండి కార్మికులను దిగుమతి చేసుకున్నారు. [9] బానిసత్వాన్ని రద్దు చేసినప్పటికీ, చాలా మంది మార్టినికన్ల జీవితాలు మెరుగుపడలేదు; 1870లో దక్షిణ మార్టినిక్‌లో ఆఫ్రికన్ వంశానికి చెందిన వర్తకుడు లియోపోల్డ్ లుబిన్‌ను అరెస్టు వ్చేయడంతో వర్గపరమైన, జాతిపరమైన ఉద్రిక్తతలు అల్లర్లుగా రూపుదాల్చాయి. అనేక మరణాల తరువాత, తిరుగుబాటును ఫ్రెంచ్ మిలీషియా అణిచివేసింది. [16]
1902 మే 8 న, మోంట్ పీలీ విస్ఫోటనం చెంది, సెయింట్ పియరీ పూర్తిగా నాశనమైంది. 30,000 మంది మరణించారు. [9] మార్టినిక్ నుండి శరణార్థులు డొమినికాలోని దక్షిణ గ్రామాలకు పడవలో ప్రయాణించారు. వారిలో కొందరు ఆ ద్వీపంలో శాశ్వతంగా ఉండిపోయారు. సెయింట్-పియరీ పట్టణంలో ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి అగస్టే సైపారిస్ అతని జైలు గదికి ఉన్న మందపాటి గోడల వలన రక్షించబడ్డాడు. [17] కొంతకాలం తర్వాత రాజధానిని ఫోర్ట్-డి-ఫ్రాన్స్‌కు మార్చారు. అదే నేటికీ రాజధానిగా ఉంది. [18]
రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో, నాజీ అనుకూల విచీ ప్రభుత్వం అడ్మిరల్ జార్జెస్ రాబర్ట్ ఆధ్వర్యంలో మార్టినిక్‌ను నియంత్రించింది. [9] జర్మన్ యు-బోట్లు కరేబియన్ యుద్ధంలో రీఫ్యూయలింగుకు, సరఫరాల కోసం మార్టినిక్‌ను ఉపయోగించాయి. [19] 1942లో, 182 నౌకలు కరేబియన్‌లో మునిగిపోగా, 1943లో 45, 1944లో 5 మునిగిపోయాయి. 1943 జూలై 14 బాస్టిల్ డే రోజున ఫ్రీ ఫ్రెంచ్ దళాలు ద్వీపాన్ని స్వాధీనం చేసుకున్నాయి [9] [20]
1946లో ఈ వలస రాజ్యాన్ని ఫ్రాన్స్ విదేశీ డిపార్ట్మెంట్గా మార్చడానికి ఫ్రెంచ్ నేషనల్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఓటు వేసింది. [9] ఇంతలో, యుద్ధానంతర కాలంలో పూర్తి స్వాతంత్ర్యం కోసం డిమాండ్లు పెరిగాయి; 1950లలో ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మార్టినిక్ని స్థాపించిన రచయిత ఐమే సిసైర్ దీనికి ప్రముఖ ప్రతిపాదకుడు. 1959 డిసెంబరులో ఇద్దరు వాహనదారుల మధ్య జాతి విద్వేషపూరిత వాగ్వాదం కారణంగా అల్లర్లు చెలరేగడంతో ఉద్రిక్తతలు చెలరేగాయి, ఫలితంగా ముగ్గురు మరణించారు. [21] 1962లో, దీని ఫలితంగాను, వలసవాదానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్త మలుపు ఫలితంగా, బలమైన స్వాతంత్ర్య అనుకూల OJAM (Organisation de la jeunesse anticolonialiste de la Martinique ) ఏర్పడింది. దాని నాయకులను తరువాత ఫ్రెంచ్ అధికారులు అరెస్టు చేశారు. అయితే, వారు తర్వాత నిర్దోషులుగా విడుదలయ్యారు. [21] 1974లో సమ్మె చేస్తున్న ఇద్దరు అరటిపండు కార్మికులను జెండార్మ్స్ కాల్చి చంపడంతో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. [21] 1970లలో మార్టినిక్ ఆర్థిక వ్యవస్థ కుంటుపడటంతో స్వాతంత్య్ర ఉద్యమం చప్పబడింది. ఫలితంగా ప్రజలు పెద్ద ఎత్తున దేశం నుండి వలస వెళ్ళారు. [22] 1979-80లో వచ్చిన తుఫానులు వ్యవసాయ ఉత్పత్తిని తీవ్రంగా ప్రభావితం చేశాయి, ఆర్థిక వ్యవస్థ మరింత కుంగిపోయింది. [9] 1970-80లలో ఫ్రాన్స్ ద్వీపానికి మరింత స్వయంప్రతిపత్తిని మంజూరు చేసింది [9]
2009లో మార్టినిక్ ఫ్రెంచ్ కరేబియన్ జనరల్ స్ట్రైక్స్ వల్ల తల్లడిల్లిపోయింది. సమ్మె ప్రారంభంలో జీవన వ్యయ సమస్యలపై దృష్టి సారించారు. త్వరలోనే వారు ఫ్రెంచ్ యూరోపియన్ వలసవాసుల వారసుల (బెకే) ఆర్థిక ఆధిపత్యాన్ని సవాలు చేయడంతో ఉద్యమం జాతి కోణాన్ని సంతరించుకుంది. [23] అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ ద్వీపాన్ని సందర్శించి, సంస్కరణకు హామీ ఇచ్చాడు. పూర్తి స్వాతంత్య్రాన్ని ఫ్రాన్స్ గానీ మార్టినిక్ గానీ కోరుకోవడం లేదని చెబుతూ సర్కోజీ, మార్టినిక్వాన్లకు ద్వీపం యొక్క భవిష్యత్తు స్థితి, స్వయంప్రతిపత్తి స్థాయిపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాడు. [24]
ఫ్రెంచ్ గయానా లాగా, మార్టినిక్ అనేది ఫ్రెంచ్ రిపబ్లిక్ యొక్క ప్రత్యేక ప్రాంతం. [25]. ఇది యూరోపియన్ యూనియన్‌కు వెలుపలి ప్రాంతం కూడా. మార్టినిక్ నివాసులు పూర్తి రాజకీయ, చట్టపరమైన హక్కులు గల ఫ్రెంచ్ పౌరులు. మార్టినిక్ నుండి ఫ్రెంచ్ నేషనల్ అసెంబ్లీకి నలుగురు డిప్యూటీలను, ఫ్రెంచ్ సెనేట్‌కు ఇద్దరు సెనేటర్లను ఎన్నుకుంటారు.
2010 జనవరి 24 న, ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా, ఫ్రెంచ్ రిపబ్లిక్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 73 యొక్క చట్రంలో "ప్రత్యేక (ప్రత్యేకమైన) సామూహికత"గా మార్చడాన్ని మార్టినిక్ ప్రజల్లో 68.4% మంది ఆమోదించారు. ఈ కొత్త కౌన్సిల్, జనరల్ కౌన్సిల్, ప్రాంతీయ మండలి రెండింటి అధికారాలనూ తీసుకుని, అమలు చేస్తుంది.
మార్టినిక్ నాలుగు అరోండిస్మెంట్లు, 34 కమ్యూన్లుగా విభజించబడింది. ఇది 45 కాంటన్‌లుగా కూడా విభజించబడింది. అయితే వీటిని 2015లో రద్దు చేసారు. ద్వీపం లోని నాలుగు ప్రాంతాలు, వాటి సంబంధిత స్థానాలతో ఈ క్రింది విధంగా ఉన్నాయి:
యాంటిల్లెస్ ద్వీపసమూహంలో భాగమైన మార్టినిక్ కరేబియన్ సముద్రంలో దక్షిణ అమెరికా తీరానికి ఈశాన్యంగా సుమారు 450 కి.మీ. (280 మై.) లో, డొమినికన్ రిపబ్లిక్ కు ఆగ్నేయంగా సుమారు 700 కి.మీ. (435 మై.) దూరంలో ఉంది. ఇది సెయింట్ లూసియాకు సరిగ్గా ఉత్తరంగా, బార్బడోస్‌కు వాయవ్యంగా, డొమినికాకు దక్షిణంగా ఉంది.
మార్టినిక్ మొత్తం వైశాల్యం 1,128 కి.మీ2 (436 చ. మై.) . దీనిలో 40 కి.మీ2 (15 చ. మై.) నీరు, మిగిలినది నేల. [9] ట్రినిడాడ్, గ్వాడెలోప్ ల తర్వాత లెస్సర్ యాంటిల్లెస్‌లో మార్టినిక్ 3వ అతిపెద్ద ద్వీపం. ఇది 70 కి.మీ. (43 మై.) పొడవు, 30 కి.మీ. (19 మై.) వెడల్పున విస్తరించి ఉంది. సముద్ర మట్టానికి పైన 1,397 మీ. (4,583 అ.) వద్ద ఉన్న మౌంట్ పీలీ అగ్నిపర్వతం ద్వీపం లోని ఎత్తైన ప్రదేశం. తూర్పు తీరంలో అనేక చిన్న ద్వీపాలు ఉన్నాయి.
ద్వీపం యొక్క ఉత్తరం ముఖ్యంగా పర్వతాలతో కూడుకుని ఉంటుంది. ఇక్కడ నాలుగు పిటాన్లు ( అగ్నిపర్వతాలు ), మోర్నెస్ (పర్వతాలు) లు ఉన్నాయి: ఉత్తర కొసన ఉన్న పిటన్ కోనిల్; క్రియాశీల అగ్నిపర్వతమిఅన్ మోంట్ పీలీ; మోర్నే జాకబ్; పిటాన్స్ డు కార్బెట్, ఈ ఐదూ అంతరించిపోయిన అగ్నిపర్వతాలు. మోంట్ పీలీ యొక్క అగ్నిపర్వత బూడిదతో ఉత్తరాన బూడిదరంగు, నల్లని ఇసుక బీచ్‌లు ఏర్పడ్డాయి. దక్షిణాన లెస్ సెలైన్స్ లోని తెల్లని ఇసుకతో పోలిస్తే ఇది చాలా భిన్నంగా ఉంటుంది.
దక్షిణ ప్రాంతం ప్రయాణాలకు వీలుగా ఉంటుంది. ప్రయాణించడం సులభతరంగా ఉన్నందున, ఈ ప్రాంతం అంతటా అనేక బీచ్‌లు, ఆహార సౌకర్యాల కారణంగా, దక్షిణాది పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. పాయింట్ డి బౌట్ నుండి డయామాంట్, సెయింట్ లూస్, సెయింట్ అన్నే డిపార్ట్మెంట్, లెస్ సెలైన్స్ వరకు ఉన్న బీచ్‌లు ప్రసిద్ధి చెందాయి.
2014లో, మార్టినిక్ GDP 8.4 బిలియన్ యూరోలు . దీని ఆర్థిక వ్యవస్థ పర్యాటకం, పరిమిత వ్యవసాయ ఉత్పత్తి, ఫ్రాన్స్ ప్రధాన భూభాగం నుండి సహాయం మంజూరు చేయడంపై ఎక్కువగా ఆధారపడి ఉంది. [9]
చారిత్రికంగా, మార్టినిక్ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయంపై ఆధారపడింది. ముఖ్యంగా చక్కెర, అరటిపండ్లు పండుతాయి. కానీ 21వ శతాబ్దం ప్రారంభం నాటికి ఈ రంగం గణనీయంగా క్షీణించింది. చక్కెర ఉత్పత్తి తగ్గిపోయింది. ఇప్పుడు చాలా చెరకు చాలావరకు రమ్ ఉత్పత్తికి ఉపయోగించబడుతోంది. [9] అరటిపండు ఎగుమతులు పెరుగుతున్నాయి. ఇవి ఎక్కువగా ఫ్రాన్స్ ప్రధాన భూభాగానికి వెళుతున్నాయి. 1993లో నిషేధానికి ముందు అరటిపండ్ల పెంపకంలో ఉపయోగించే క్లోర్డెకోన్ అనే క్రిమిసంహారక మందు వ్యవసాయ భూమి, నదులు, చేపలను కలుషితం చేసి, ద్వీపవాసుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసినట్లు కనుగొన్నారు. దాంతో ఈ ప్రాంతాల్లో చేపలు పట్టడం, వ్యవసాయం నిలిపివేయవలసి రావడంతో ఇది ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపింది. [26] మాంసం, కూరగాయలు, ధాన్యం అవసరాలలో ఎక్కువ భాగం దిగుమతి చేసుకోవాలి. ఇది దీర్ఘకాలిక వాణిజ్య లోటుకు కారణమైంది. ఈ లోటు పూడ్చడానికి ప్రధాన భూభాగం ఫ్రాన్స్ నుండి పెద్ద వార్షిక సహాయం అవసరమౌతోంది. [9]
మార్టినిక్లోకి ప్రవేశించే అన్ని వస్తువులపై వేరియబుల్ "సీ టోల్" వసూలు చేస్తారు. ఇది కార్గో విలువలో 30% వరకూ ఉంటుంది. ఇది ద్వీపం మొత్తం ఆదాయంలో 40% ఉంటుంది. అదనంగా ప్రభుత్వం 1–2.5% "వార్షిక బకాయి", 2.2–8.5% విలువ ఆధారిత పన్నును వసూలు చేస్తుంది. [27]
విదేశీ మారకద్రవ్య మూలంగా వ్యవసాయ ఎగుమతుల కంటే పర్యాటకం ప్రాధాన్యత సంతరించుకుంది. [9] ఎక్కువ మంది సందర్శకులు ప్రధాన భూభాగం ఫ్రాన్స్, కెనడా, అమెరికాల నుండి వస్తారు. [9] ద్వీపంలోని మొత్తం వ్యాపారాలలో దాదాపు 16% (సుమారు 6,000 కంపెనీలు) పర్యాటక-సంబంధిత సేవలను అందిస్తాయి. [27]
అరటి సాగు ప్రధాన వ్యవసాయ కార్యకలాపం. 7,200 హెక్టార్ల పైచిలుకు నేలలో అరటి సాగు అవుతుంది. 2006 గణాంకాల ప్రకారం ఈ రంగం దాదాపు 220,000 టన్నుల ఉత్పత్తి, దాదాపు 12,000 ఉద్యోగాలు (ప్రత్యక్ష + పరోక్ష) కలుగజేస్తోంది. ద్వీపపు ఆర్థిక వ్యవస్థలో దీని వాటా తక్కువగా ఉంది (1.6%). అయితే ఇది వ్యవసాయ ఉత్పత్తిలో 40% కంటే ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. [28]
రమ్, మరీ ముఖ్యంగా వ్యవసాయ రమ్, 2005లో వ్యవసాయ-ఆహార విలువలో 23% వాటాను కలిగి ఉంది. ద్వీపంలో (సాంప్రదాయ రమ్‌తో సహా) 380 మందికి ఉపాధి కల్పిస్తోంది. 2009లో ద్వీపపు మొత్తం స్వచ్ఛమైన ఆల్కహాల్ ఉత్పత్తి 90,000 హెక్టా లీటర్లు కాగా, ఇందులో 79,116 hl స్వచ్ఛమైన ఆల్కహాల్ వ్యవసాయ రమ్. [29]
2009లో, చెరకు సాగు 4,150 హెక్టార్లు. ఇది మొత్తం వ్యవసాయ భూమిలో 13.7%. గత 20 ఏళ్లలో సాగు విస్తీర్ణం 20% కంటే ఎక్కువ పెరిగింది. ఉత్పత్తి చేయబడిన రమ్ యొక్క అధిక అదనపు విలువ, ప్రపంచ చక్కెర ధరల పెరుగుదల కారణంగా ఈ పెరుగుదల జరిగింది. ఈ ఉత్పత్తి ఎక్కువగా - 50 హెక్టార్ల కంటే ఎక్కువ పొలాల నుండి వస్తుంది..2009లో వార్షిక ఉత్పత్తి దాదాపు 2,20,000 టన్నులు, అందులో దాదాపు 90,000 టన్నులు చక్కెర ఉత్పత్తికి వెళ్లగా, మిగిలినది వ్యవసాయ రమ్ డిస్టిలరీలకు సరఫరా అయింది. [30]
మార్టినిక్‌లో ప్రధాన, వాణిజ్య విమానాలు కలిగిన ఏకైక విమానాశ్రయం మార్టినిక్ ఐమె సిసైర్ అంతర్జాతీయ విమానాశ్రయం . ఇక్కడి నుండి ఐరోపా, కరేబియన్, వెనిజులా, యునైటెడ్ స్టేట్స్, కెనడాలకు వైమానిక సేవలున్నాయి. [17]
ఫోర్ట్-డి-ఫ్రాన్స్ ప్రధాన నౌకాశ్రయం. ఈ ద్వీపం నుండి గ్వాడెలోప్, డొమినికా, సెయింట్ లూసియాకు ఫెర్రీ సేవలున్నాయి. [18] [17] ఫోర్ట్-డి-ఫ్రాన్స్‌ను పాయింట్ డు బౌట్‌తో అనుసంధానించే అనేక స్థానిక ఫెర్రీ సేవలు కూడా ఉన్నాయి. [18]
ఫోర్ట్-డి-ఫ్రాన్స్ చుట్టూ ఉన్న ప్రాంతంలో ఫ్రీవేలతో విస్తృతమైనది రహదారి నెట్వర్కు ఉంది. రాజధానికి సెయింట్ పియర్‌కు మధ్య బస్సులు నడుస్తాయి. [18]
2019లో, మార్టినిక్‌లో 2,123 కి.మీ. ల రోడ్ నెట్వర్క్ ఉంది. [31]
2019లో, మార్టినిక్‌లో 19,137 కొత్త వాహనాలు నమోదు చేయబడ్డాయి, అంటే 1,000 మంది నివాసితులకు 42 కొత్త వాహనాలు కొనుగోలు చేయబడ్డాయి. [32]
మార్టినిక్‌కు సముద్ర రవాణా ముఖ్యమైనది. ఫోర్ట్-డి-ఫ్రాన్స్ నౌకాశ్రయం కంటైనర్ ట్రాఫిక్ పరంగా ఏడవ అతిపెద్ద ఫ్రెంచ్ ఓడరేవు. [33] 2012 తర్వాత, జాతీయ ఆసక్తి ఉన్న పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లను ఆధునీకరించాలనే ప్రభుత్వ నిర్ణయం తర్వాత ఇది మార్టినిక్ యొక్క గ్రాండ్ పోర్ట్ మారిటైమ్ పోర్ట్ (GPM)గా మారింది.
ద్వీపం యొక్క విమానాశ్రయం మార్టినిక్-ఐమె-సెసైర్ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది లే లామెంటిన్ మునిసిపాలిటీలో ఉంది. దీని పౌర ట్రాఫిక్ (2015లో 16,96,071 మంది ప్రయాణికులు) ఫ్రెంచ్ విమానాశ్రయాలలో పదమూడవ స్థానంలో ఉంది. దీని ట్రాఫిక్‌లో ప్రధానమైనది ఫ్రాన్సు నుండి వచ్చేదే ఎక్కువ (2017లో 192,244 మంది ప్రయాణికులు). తగ్గుతున్న అంతర్జాతీయ ట్రాఫిక్ కారణంగా ఇది మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది.
20వ శతాబ్దం ప్రారంభంలో, మార్టినిక్‌లో 240 కి.మీ. కంటే పొడవైన రైలుమార్గాలుండేవి. ఇవి చక్కెర కర్మాగారాలకు (చెరకు రవాణా) సేవలందించేవి. పర్యాటకుల కోసం సెయింట్-జేమ్స్ హౌస్, బనానా మ్యూజియం మధ్య సెయింట్-మేరీలో ఒక రైలు మాత్రమే నడుస్తోంది. [33]
2019 జనవరి నాటికి మార్టినిక్ జనాభా 3,64,508. 2013 నుండి జనాభా సంవత్సరానికి 0.9% చొప్పున తగ్గుతోంది. [34] మార్టినికన్ మూలానికి చెందిన 2,60,000 మంది ప్రజలు ఫ్రాన్స్ ప్రధాన భూభాగంలో నివసిస్తున్నారని అంచనా. వారిలో ఎక్కువ మంది పారిస్ ప్రాంతంలో ఉన్నారు. 1970లలో ద్వీపం నుండి బయటికి వలసలు అత్యధికంగా ఉన్నాయి, దీనివల్ల జనాభా పెరుగుదల దాదాపుగా ఆగిపోయింది. [9]
1700 అంచనా |
1738 అంచనా |
1848 అంచనా |
1869
అంచనా |
1873 అంచనా |
1878 అంచనా |
1883 అంచనా |
1888 అంచనా |
1893 అంచనా |
1900 అంచనా | ||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
24,000 | 74,000 | 1,20,400 | 1,52,925 | 1,57,805 | 1,62,861 | 1,67,119 | 1,75,863 | 1,89,599 | 2,03,781 | ||||||||||
1954 జనాభా గణన |
1961 జనాభా గణన |
1967 జనాభా గణన |
1974 జనాభా గణన |
1982 జనాభా గణన |
1990 జనాభా గణన |
1999 జనాభా గణన |
2006 జనాభా గణన |
2011 జనాభా గణన |
2013 జనాభా గణన | ||||||||||
2,39,130 | 2,92,062 | 3,20,030 | 3,24,832 | 3,28,566 | 3,59,572 | 3,81,325 | 3,97,732 | 3,92,291 | 3,85,551 | ||||||||||
గత జనాభా లెక్కలు, INSEE అంచనాల నుండి అధికారిక గణాంకాలు |
మార్టినిక్వాన్లలో దాదాపు 90% మంది క్రైస్తవులు, ప్రధానంగా రోమన్ క్యాథలిక్‌లు అలాగే తక్కువ సంఖ్యలో వివిధ ప్రొటెస్టంట్ తెగలు. [9] ఇస్లాం, హిందూ మతం, బహాయి విశ్వాసం వంటి ఇతర విశ్వాసాల యొక్క చాలా చిన్న సమాజాలు ఉన్నాయి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.