From Wikipedia, the free encyclopedia
ఐసిసి మహిళల క్రికెట్ ప్రపంచ కప్, క్రికెట్లో అత్యంత పురాతనమైన ప్రపంచ ఛాంపియన్షిప్. మొట్టమొదటి టోర్నమెంటు 1973లో ఇంగ్లాండ్‌లో జరిగింది. ఒక్కో జట్టుకు 50 ఓవర్లుండే వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడారు. ట్వంటీ20 ఇంటర్నేషనల్ క్రికెట్‌కు విడిగా ఐసిసి మహిళల T20 ప్రపంచ కప్ ఉంది.
ఐసిసి మహిళల క్రికెట్ ప్రపంచ కప్ | |
---|---|
నిర్వాహకుడు | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ |
ఫార్మాట్ | WODI |
తొలి టోర్నమెంటు | 1973 England |
చివరి టోర్నమెంటు | 2022 New Zealand |
తరువాతి టోర్నమెంటు | 2025 India |
జట్ల సంఖ్య | 8 (2029 నుండి 10) |
ప్రస్తుత ఛాంపియన్ | ఆస్ట్రేలియా (7వ టైటిల్) |
అత్యంత విజయవంతమైన వారు | ఆస్ట్రేలియా (7 టైటిళ్ళు) |
అత్యధిక పరుగులు | డెబ్బీ హాక్లీ (1,501) |
అత్యధిక వికెట్లు | ఝులన్ గోస్వామి (43) |
ప్రపంచ కప్‌ను ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) నిర్వహిస్తోంది. 2005 వరకు, దీన్ని ఇంటర్నేషనల్ ఉమెన్స్ క్రికెట్ కౌన్సిల్ (IWCC) సంస్థ నిర్వహించేది. పురుషుల టోర్నమెంటు మొదలవడానికి రెండు సంవత్సరాల ముందే, 1973 లో, మొదటి మహిళల ప్రపంచ కప్ ఇంగ్లాండ్‌లో జరిగింది. టోర్నమెంటు మొదలైన తొలి నాళ్ళలో నిధుల సమస్యలు ఎదురయ్యాయి. దీని వలన అనేక జట్లకు పంపిన ఆహ్వానాలను తిరస్కరించాయి. టోర్నమెంట్ల మధ్య ఆరు సంవత్సరాల వరకు అంతరం వచ్చింది. అయితే, 2005 నుండి ప్రపంచ కప్‌లు నాలుగు సంవత్సరాల వ్యవధిలో నిర్వహిస్తున్నారు.
ఐసిసి మహిళల ఛాంపియన్‌షిప్‌లో పోటీ చేసే జట్లు, ప్రపంచ కప్ క్వాలిఫైయర్ ద్వారా అర్హత సాధిస్తాయి. టోర్నమెంటు కూర్పు చాలా సాంప్రదాయకంగా ఉంటుంది - 1997 నుండి టోర్నమెంట్లో కొత్త జట్లు ఏవీ చేరలేదు. 2000 నుండి ప్రపంచ కప్‌లోని జట్ల సంఖ్య ఎనిమిదిగా నిశ్చయించారు. అయితే టోర్నమెంటును 2029 నుండి 10 జట్లకు విస్తరించనున్నట్లు ఐసిసి 2021 మార్చిలో వెల్లడించింది.[1][2] 1997 ఎడిషన్‌లో రికార్డు స్థాయిలో పదకొండు జట్లు పోటీపడ్డాయి. ఇదే ఇప్పటి వరకు అత్యధికం.[3]
ఇప్పటి వరకు జరిగిన పదకొండు ప్రపంచ కప్‌లు ఐదు దేశాల్లో జరిగాయి. భారత్, ఇంగ్లండ్‌లు చెరి మూడుసార్లు ఆతిథ్యం ఇచ్చాయి. ఆస్ట్రేలియా ఏడు టైటిళ్లను గెలుచుకుని, అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. మూడు సందర్భాల్లో మాత్రమే అది ఫైనల్‌కు చేరుకోలేకపోయింది. ఇంగ్లండ్ (నాలుగు టైటిళ్లు), న్యూజిలాండ్‌లు (ఒక టైటిల్) ఈ ఈవెంట్‌ను గెలుచుకున్న ఇతర జట్లు కాగా, భారత్ రెండుసార్లు, వెస్టిండీస్ ఒకసారి ఫైనల్‌కు చేరుకున్నాయి గానీ కప్పు గెలవలేదు.
1934లో ఇంగ్లండ్‌కు చెందిన జట్టు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో పర్యటించినప్పుడు తొలిసారి మహిళల అంతర్జాతీయ క్రికెట్ ఆడారు. మొదటి టెస్టు మ్యాచ్ 1934 డిసెంబరు 28-31 ల్లో జరిగింది. అందులో ఇంగ్లండ్ గెలిచింది.[4] మరుసటి సంవత్సరం ప్రారంభంలో న్యూజిలాండ్‌తో మొదటి టెస్టు ఆడారు. 1960 వరకు ఈ మూడు దేశాలే మహిళల క్రికెట్లో టెస్టులు ఆడేవి. 1960 లో దక్షిణాఫ్రికా ఇంగ్లాండ్‌తో అనేక మ్యాచ్‌లు ఆడింది.[5] [4] పరిమిత ఓవర్ల క్రికెట్‌ను మొదటిసారిగా 1962లో ఇంగ్లాండ్‌లో ఫస్ట్-క్లాస్ జట్లు ఆడాయి. తొమ్మిదేళ్ల తర్వాత, మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఇంగ్లండ్ ఆస్ట్రేలియాతో తలపడినప్పుడు పురుషుల క్రికెట్లో మొదటి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడారు.[6]
జాక్ హేవార్డ్ నేతృత్వంలో మహిళల క్రికెట్ ప్రపంచ కప్ నిర్వహించడం గురించి 1971లో చర్చలు ప్రారంభమయ్యాయి. [7] దక్షిణాఫ్రికాలో వర్ణవివక్ష చట్టాల కారణంగా, ఆ జట్టును పోటీలో పాల్గొనడానికి ఆహ్వానించలేదు.[8] మరో రెండు టెస్టు ఆడే దేశాలు - ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లను ఆహ్వానించారు. హేవార్డ్ గతంలో ఇంగ్లండ్ మహిళల వెస్టిండీస్ పర్యటనలను నిర్వహించాడు. ఈ ప్రాంతం నుండి జమైకా, ట్రినిడాడ్ అండ్ టొబాగో లను పోటీకి ఆహ్వానించారు. మరిన్ని జట్ల కోసం ఇంగ్లాండ్, "యంగ్ ఇంగ్లండ్" అనే పేరుతో మరో జట్టును రంగంలోకి దించింది. వీటన్నిటికి తోడు "ఇంటర్నేషనల్ XI " అనే జట్టును కూడా చేర్చారు. [7] ఐదుగురు దక్షిణాఫ్రికా ఆటగాళ్ళు అంతర్జాతీయ XI కోసం ఆడటానికి ఆహ్వానించినప్పటికీ, తరువాత ఈ ఆహ్వానాలను వెనక్కి తీసుకున్నారు.[8]
ప్రారంభ టోర్నమెంటు 1973 జూన్, జూలైల్లో ఇంగ్లాండ్ అంతటా వివిధ వేదికలలో జరిగింది.[9] మొదటి పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ ఆడటానికి రెండు సంవత్సరాల ముందే ఈ పోటీ జరిగింది.[10] ఈ పోటీ రౌండ్-రాబిన్ టోర్నమెంట్‌గా ఆడారు. చివరి షెడ్యూల్ మ్యాచ్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్‌ల మధ్య జరిగింది. ఆస్ట్రేలియా ఒక పాయింటుతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది: వారు నాలుగు మ్యాచ్‌లు గెలవగా, ఒకటి రద్దైంది. ఇంగ్లండ్ కూడా నాలుగు మ్యాచ్‌లు గెలిచింది, కానీ వారు న్యూజిలాండ్‌తో ఓడిపోయారు.[9][11] ఫలితంగా, ఈ మ్యాచ్ పోటీకి ఫైనల్ లాంటిదైంది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 92 పరుగుల తేడాతో గెలిచి టోర్నీని గెలుచుకుంది.[12]
Year | Host (s) | Final venue | Final | జట్టుs | ||
---|---|---|---|---|---|---|
Winners | Result | Runners-up | ||||
1973 | England | No final | ఇంగ్లాండు 20 points |
ఇంగ్లాండ్ పాయింట్ల ఆధారంగా గెలిచింది table |
ఆస్ట్రేలియా 17 points |
7 |
1978 | India | No final | ఆస్ట్రేలియా 6 points |
ఆస్ట్రేలియా పాయింట్ల ఆధారంగా గెలిచింది table |
ఇంగ్లాండు 4 points |
4 |
1982 | New Zealand | Lancaster Park, Christchurch | ఆస్ట్రేలియా 152/7 (59 overs) |
ఆస్ట్రేలియా 3 వికెట్లతో గెలిచింది స్కోరు |
ఇంగ్లాండు 151/5 (60 overs) |
5 |
1988 | Australia | మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్ | ఆస్ట్రేలియా 129/2 (44.5 overs) |
ఆస్ట్రేలియా 8 వికెట్లతో గెలిచింది స్కోరు |
ఇంగ్లాండు 127/7 (60 overs) |
5 |
1993 | England | లార్డ్స్, లండన్ | ఇంగ్లాండు 195/5 (60 overs) |
ఇంగ్లాండ్ 67 పరుగులతో గెలిచింది స్కోరు |
న్యూజీలాండ్ 128 (55.1 overs) |
8 |
1997 | India | ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా | ఆస్ట్రేలియా 165/5 (47.4 overs) |
ఆస్ట్రేలియా 5 వికెట్లతో గెలిచింది స్కోరు |
న్యూజీలాండ్ 164 (49.3 overs) |
11 |
2000 | New Zealand | Bert Sutcliffe Oval, Lincoln | న్యూజీలాండ్ 184 (48.4 overs) |
న్యూజీలాండ్ 4 పరుగులతో గెలిచింది స్కోరు |
ఆస్ట్రేలియా 180 (49.1 overs) |
8 |
2005 | South Africa | SuperSport Park, Centurion | ఆస్ట్రేలియా 215/4 (50 overs) |
ఆస్ట్రేలియా 98 పరుగులతో గెలిచింది స్కోరు |
భారతదేశం 117 (46 overs) |
8 |
2009 | Australia | నార్త్ సిడ్నీ ఓవల్, సిడ్నీ | ఇంగ్లాండు 167/6 (46.1 overs) |
ఇంగ్లాండ్ 4 వికెట్లతో గెలిచింది స్కోరు |
న్యూజీలాండ్ 166 (47.2 overs) |
8 |
2013 | India | Brabourne Stadium, Mumbai | ఆస్ట్రేలియా 259/7 (50 overs) |
ఆస్ట్రేలియా 114 పరుగులతో గెలిచింది స్కోరు |
వెస్ట్ ఇండీస్ 145 (43.1 overs) |
8 |
2017 | England | లార్డ్స్, లండన్ | ఇంగ్లాండు 228/7 (50 overs) |
ఇంగ్లాండ్ 9 పరుగులతో గెలిచింది స్కోరు |
భారతదేశం 219 (48.4 overs) |
8 |
2022 | New Zealand | Hagley Oval, Christchurch | ఆస్ట్రేలియా 356/5 (50 overs) |
ఆస్ట్రేలియా 71 పరుగులతో గెలిచింది స్కోరు |
ఇంగ్లాండు 285 (43.4 overs) |
8 |
2025 | India | To be confirmed | 8 |
పదిహేను జట్లు మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌కు కనీసం ఒక్కసారైనా అర్హత సాధించాయి. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ -ఈ మూడు జట్లు అన్ని టోర్నమెంట్ల లోనూ పోటీ చేసాయి. ఇప్పటి వరకూ టైటిల్ గెలుచుకున్నది కూడా ఆ మూడూ జట్లే.
జట్టు | 1973 (7) |
1978 (4) |
1982 (5) |
1988 (5) |
1993 (8) |
1997 (11) |
2000 (8) |
2005 (8) |
2009 (8) |
2013 (8) |
2017 (8) |
2022 (8) |
మొత్తం |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
ఆస్ట్రేలియా | 2వ | మొదటి | మొదటి | మొదటి | 3వ | మొదటి | 2వ | మొదటి | 4వ | మొదటి | సె.ఫై | మొదటి | 12 |
బంగ్లాదేశ్ | 7వ | 1 | |||||||||||
డెన్మార్క్ | 7వ | 9వ | 2 | ||||||||||
ఇంగ్లాండు | మొదటి | 2వ | 2వ | 2వ | మొదటి | సె.ఫై | 5వ | సె.ఫై | మొదటి | 3వ | మొదటి | 2వ | 12 |
భారతదేశం | 4వ | 4వ | 4వ | సె.ఫై | సె.ఫై | 2వ | 3వ | 7వ | 2వ | 5వ | 10 | ||
ఐర్లాండ్ | 4వ | 5వ | QF | 7వ | 8వ | 5 | |||||||
నెదర్లాండ్స్ | 5వ | 8వ | QF | 8వ | 4 | ||||||||
న్యూజీలాండ్ | 3వ | 3వ | 3వ | 3వ | 2వ | 2వ | మొదటి | సె.ఫై | 2వ | 4వ | 5వ | 6వ | 12 |
పాకిస్తాన్ | 11వ | 5వ | 8వ | 8వ | 8వ | 5 | |||||||
దక్షిణాఫ్రికా | QF | సె.ఫై | 7వ | 7వ | 6వ | సె.ఫై | సె.ఫై | 7 | |||||
శ్రీలంక | QF | 6వ | 6వ | 8వ | 5వ | 7వ | 6 | ||||||
వెస్ట్ ఇండీస్ | 6వ | 10వ | 5వ | 6వ | 2వ | 6వ | సె.ఫై | 7 | |||||
Defunct జట్టుs | |||||||||||||
International XI | 4వ | 5వ | 2 | ||||||||||
జమైకా | 6వ | 1 | |||||||||||
ట్రినిడాడ్ అండ్ టొబాగో | 5వ | 1 | |||||||||||
యంగ్ ఇంగ్లాండ్ | 7వ | 1 |
సంవత్సరం | జట్లు |
---|---|
1973 | ఆస్ట్రేలియా, ఇంగ్లాండు, న్యూజీలాండ్, అంతర్జాతీయ XI ‡, జమైకా †, ట్రినిడాడ్ అండ్ టొబాగో †, యంగ్ ఇంగ్లాండ్ ‡ |
1978 | భారతదేశం |
1982 | ఏదీ లేదు |
1988 | ఐర్లాండ్, నెదర్లాండ్స్ |
1993 | డెన్మార్క్, వెస్ట్ ఇండీస్ |
1997 | పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక |
2000 | ఏదీ లేదు |
2005 | ఏదీ లేదు |
2009 | ఏదీ లేదు |
2013 | ఏదీ లేదు |
2017 | ఏదీ లేదు |
2022 | బంగ్లాదేశ్ |
2025 | TBD |
† ఇకపై వన్డే హోదా లేదు. ‡ ఇప్పుడు ఉనికిలో లేదు.
దిగువ పట్టిక 2022 టోర్నమెంట్ ముగింపు నాటికి గత ప్రపంచ కప్‌లలో జట్ల ప్రదర్శనల అవలోకనాన్ని అందిస్తుంది. జట్లు, అత్యుత్తమ ప్రదర్శన ద్వారా, ఆపై ఆడిన మ్యాచ్‌లు, మొత్తం విజయాల సంఖ్య, మొత్తం గేమ్‌ల సంఖ్య, అక్షర క్రమం ద్వారా వరుసగా పేర్చబడ్డాయి.
Appearances | Statistics | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|
జట్టు | మొత్తం | తొలి | తాజా | అత్యుత్తమ స్థానం | గెలి | ఓడి | టై | ఫతే | గెలుపు%* | |
ఆస్ట్రేలియా | 11 | 1973 | 2022 | ఛాంపియన్లు (1978, 1982, 1988, 1997, 2005, 2013, 2022) | 84 | 70 | 11 | 1 | 2 | 85.47 |
ఇంగ్లాండు | 11 | 1973 | 2022 | ఛాంపియన్లు (1973, 1993, 2009, 2017) | 83 | 57 | 23 | 2 | 1 | 75.04 |
న్యూజీలాండ్ | 11 | 1973 | 2022 | ఛాంపియన్లు (2000) | 80 | 51 | 26 | 2 | 1 | 65.82 |
భారతదేశం | 9 | 1978 | 2022 | రన్నరప్ (2005, 2017) | 63 | 34 | 27 | 1 | 1 | 55.64 |
వెస్ట్ ఇండీస్ | 6 | 1993 | 2022 | రన్నరప్ (2013) | 38 | 13 | 24 | 0 | 1 | 35.13 |
దక్షిణాఫ్రికా | 6 | 1997 | 2022 | సెమీ ఫైనల్స్ (2000, 2017, 2022) | 38 | 15 | 22 | 0 | 3 | 40.54 |
పాకిస్తాన్ | 4 | 1997 | 2022 | Super 6s (2009) | 23 | 3 | 21 | 0 | 0 | 14.28 |
శ్రీలంక | 6 | 1997 | 2017 | క్వార్టర్ ఫైనల్స్ (1997) | 35 | 8 | 26 | 0 | 1 | 23.52 |
ఐర్లాండ్ | 5 | 1988 | 2005 | క్వార్టర్ ఫైనల్స్ (1997) | 34 | 7 | 26 | 0 | 1 | 21.21 |
నెదర్లాండ్స్ | 4 | 1988 | 2000 | క్వార్టర్ ఫైనల్స్ (1997) | 26 | 2 | 24 | 0 | 0 | 07.69 |
International XI‡ | 2 | 1973 | 1982 | మొదటి రౌండు (1973, 1982) | 18 | 3 | 14 | 0 | 1 | 16.66 |
డెన్మార్క్ | 2 | 1993 | 1997 | మొదటి రౌండు (1993, 1997) | 13 | 2 | 11 | 0 | 0 | 15.38 |
ట్రినిడాడ్ అండ్ టొబాగో† | 1 | 1973 | 1973 | మొదటి రౌండు (1973) | 6 | 2 | 4 | 0 | 0 | 33.33 |
బంగ్లాదేశ్ | 1 | 2022 | 2022 | మొదటి రౌండు (2022) | 7 | 1 | 6 | 0 | 0 | 14.28 |
Young Englaవ‡ | 1 | 1973 | 1973 | మొదటి రౌండు (1973) | 6 | 1 | 5 | 0 | 0 | 16.66 |
జమైకా† | 1 | 1973 | 1973 | మొదటి రౌండు (1973) | 5 | 1 | 4 | 0 | 0 | 20.00 |
బ్యాటింగ్ | |||||
---|---|---|---|---|---|
అత్యధిక పరుగులు | డెబ్బీ హాక్లీ | న్యూజీలాండ్ | 1,501 | 1982–2000 | [13] |
అత్యధిక సగటు (నిమి. 10 ఇన్నింగ్స్) | కరెన్ రోల్టన్ | ఆస్ట్రేలియా | 74.92 | 1997–2009 | [14] |
అత్యధిక స్కోరు | బెలిండా క్లార్క్ | ఆస్ట్రేలియా | 229 * | 1997 | [15] |
అత్యధిక భాగస్వామ్యం | టామీ బ్యూమాంట్ & సారా టేలర్ | ఇంగ్లాండు | 275 | 2017 | [16] |
టోర్నీలో అత్యధిక పరుగులు | అలిస్సా హీలీ | ఆస్ట్రేలియా | 509 | 2022 | [17] |
బౌలింగ్ | |||||
అత్యధిక వికెట్లు | ఝులన్ గోస్వామి | భారతదేశం | 43 | 2005–2022 | [18] |
అత్యల్ప సగటు (నిమి. 500 బంతులు బౌల్డ్) | కత్రినా కీనన్ | న్యూజీలాండ్ | 9.72 | 1997–2000 | [19] |
అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు | జాకీ లార్డ్ | న్యూజీలాండ్ | 6/10 | 1982 | [20] |
టోర్నీలో అత్యధిక వికెట్లు | లిన్ ఫుల్స్టన్ | ఆస్ట్రేలియా | 23 | 1982 | [21] |
ఫీల్డింగ్ | |||||
అత్యధిక అవుట్లు ( వికెట్ కీపర్ ) | జేన్ స్మిత్ | ఇంగ్లాండు | 40 | 1993–2005 | [22] |
అత్యధిక క్యాచ్‌లు ( ఫీల్డర్ ) | జానెట్ బ్రిటిన్ | ఇంగ్లాండు | 19 | 1982–1997 | [23] |
జట్టు | |||||
అత్యధిక స్కోరు | ఆస్ట్రేలియా (వి డెన్మార్క్ ) | 412/3 | 1997 | [24] | |
అత్యల్ప స్కోరు | పాకిస్తాన్ (v ఆస్ట్రేలియా ) | 27 | 1997 | [25] | |
అత్యధిక విజయం % | ఆస్ట్రేలియా | 87.36 | [26] | ||
అత్యధిక విజయాలు | ఆస్ట్రేలియా | 79 | [26] | ||
చాలా లాస్ట్ | భారతదేశం | 31 | [26] |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.