భారత మహిళా క్రికెటర్ From Wikipedia, the free encyclopedia
ఝులన్ గోస్వామి భారత మహిళా క్రికెట జట్టుకు చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారిణి. 2002లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఆమె మహిళ క్రికెట్ వన్డే ప్రపంచకప్లో ప్రపంచంలోనే అత్యధిక వికెట్లు (40 వికెట్లు) తీసిన మొదటి మహిళా బౌలర్గా[1], భారత్ తరపున 200 వన్డే మ్యాచ్లు పూర్తి చేసిన రెండో మహిళా క్రికెటర్గా రికార్డు సృష్టించింది.[2] ఝులన్ గోస్వామి జీవితం ఆధారంగా 'చక్దాహా ఎక్స్ప్రెస్' పేరుతో[3] అనుష్క శర్మ ప్రధాన పాత్రలో నటిస్తుంది.[4]
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | ఝులన్ నిషిత్ గోస్వామి | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | చక్దాహా, పశ్చిమ బెంగాల్, భారతదేశం | 1982 నవంబరు 25||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | బాబుల్, చక్దాహా ఎక్స్ప్రెస్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 5 అ. 11 అం. (1.80 మీ.) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడి చేతి బ్యాట్టింగ్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడి చేతి మీడియం ఫాస్ట్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలర్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 52) | 2002 జనవరి 14 - ఇంగ్లాండ్ తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2021 30 సెప్టెంబర్ - ఆస్ట్రేలియా తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్డే (క్యాప్ 61) | 2002 జనవరి 6 - ఇంగ్లాండ్ తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్డే | 2022 మార్చి 19 - ఆస్ట్రేలియా తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్డేల్లో చొక్కా సంఖ్య. | 25 | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 3) | 2006 5 ఆగష్టు - ఇంగ్లాండ్ తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2018 జూన్ 10 - బంగ్లాదేశ్ తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బెంగాల్ మహిళ క్రికెట్ జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018 - ప్రస్తుతం | ట్రయిల్ బ్లె్జర్స్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 19 మార్చి 2022 |
జులన్ గోస్వామి పంతొమ్మిదేళ్ల వయసున్నప్పుడు బెంగాల్ క్రికెట్ జట్టుకి ఎంపికైంది. ఆమె ఆ తర్వాత ఈస్ట్ జోన్, ఎయిర్ ఇండియా తరపున ప్రాతినిధ్యం వహించింది. ఈస్టన్కి, ఎయిర్ ఇండియాకి మధ్య జరిగిన మ్యాచ్లో ఆమె పది ఓవర్లలో పదమూడు రన్స్ ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టి, భారత సెలెక్టర్ల దృష్టిలో పడింది. ఝులన్ గోస్వామి 2002లో భారత జాతీయ జట్టుకి ఎంపికైన ఇంగ్లండ్ తో తన తొలి మ్యాచ్ ఆడింది. ఆమె 2006లో ఇంగ్లండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో పది వికెట్లు తీసి ఒక మ్యాచ్లో పది వికెట్లు పడగొట్టిన తొలి భారతీయ మహిళా క్రికెటర్గా రికార్డు సృష్టించి, 2011లో న్యూజిలాండ్ తో జరిగిన వన్డే మ్యాచ్లో 31 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీసి తన కెరీర్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది.
జులాన్ గోస్వామి మహిళల క్రికెట్లో 300కి పైగా వికెట్లు తీసిన ప్రపంచంలోనే ఏకైక బౌలర్. ఆమె అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో మోతంగా 350 వికెట్లు తీసింది. వన్డే క్రికెట్లో 250 వికెట్లు తీసిన ప్రపంచంలోనే ఏకైక బౌలర్.[5] ఆమె మొత్తం 199 వన్డేల్లో 250 వికెట్లు, 12 టెస్టుల్లో 44 వికెట్లు, 68 టీ20 మ్యాచ్ల్లో 56 వికెట్లు పడగొట్టింది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.