మధ్య ఆఫ్రికా గణతంత్రం
From Wikipedia, the free encyclopedia
మధ్య ఆఫ్రికా గణతంత్రం మధ్య ఆఫ్రికాలో ఒక భూబంధిత దేశం. దేశ ఉత్తర సరిహద్దులో చాద్, ఈశాన్య సరిహద్దులో సూడాన్, తూర్పు సరిహద్దులో దక్షిణ సూడాన్, దక్షిణ సరిహద్దులో కాంగో ప్రజాస్వామ్య గణతంత్రం, నైరుతి సరిహద్దులో కాంగో గణతంత్రం, పశ్చిమ సరిహద్దులో కామెరూన్ ఉన్నాయి. సి.ఎ.ఆర్. సుమారు 6,20,000 చదరపు కిలో మీటర్ల (240,000 చదరపు మైళ్ళు) భూభాగ వైశాల్యాన్ని కలిగి ఉంది. 2016 నాటికి సుమారుగా అంచనా వేసిన జనాభా 4.6 మిలియన్లుగా అంచనా వేయబడింది.
République Centrafricaine Ködörösêse tî Bêafrîka మధ్య ఆఫ్రికా గణతంత్రం |
||||||
---|---|---|---|---|---|---|
నినాదం "Unité, Dignité, Travail" (French) "Unity, Dignity, Work" |
||||||
రాజధాని అతి పెద్ద నగరం | Bangui 4°22′N 18°35′E | |||||
అధికార భాషలు | Sango, French | |||||
ప్రభుత్వం | Republic | |||||
- | President | François Bozizé | ||||
- | Prime Minister | Élie Doté | ||||
en:Independence | from ఫ్రాన్స్ | |||||
- | Date | en:August 13 1960 | ||||
విస్తీర్ణం | ||||||
- | మొత్తం | 622,984 కి.మీ² (43వది) 240,534 చ.మై |
||||
- | జలాలు (%) | 0 | ||||
జనాభా | ||||||
- | 2007 అంచనా | 4,216,666 (124వది) | ||||
- | 2003 జన గణన | 3,895,150 | ||||
- | జన సాంద్రత | 6.77 /కి.మీ² (191వది) 17.53 /చ.మై |
||||
జీడీపీ (PPP) | 2006 అంచనా | |||||
- | మొత్తం | $5.015 బిలియన్లు (153వది) | ||||
- | తలసరి | $1,198 (167th) | ||||
జీడీపీ (nominal) | 2006 అంచనా | |||||
- | మొత్తం | $1,488 billion (153rd) | ||||
- | తలసరి | $355 (160th) | ||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2004) | 0.353 (low) (172వది) | |||||
కరెన్సీ | en:Central African CFA franc (XAF ) |
|||||
కాలాంశం | WAT (UTC+1) | |||||
- | వేసవి (DST) | not observed (UTC+1) | ||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .cf | |||||
కాలింగ్ కోడ్ | +236 |
సి.ఎ.ఆర్.లో అధిక భాగం సుండో - గుయినీన్ సవన్నా ఉంది. కానీ దేశం ఉత్తరంలో ఉన్న సహెల్-సూడాన్ జోన్, దక్షిణాన ఒక ఈక్వెటోరియల్ అటవీ ప్రాంతం దేశంలో భాగంగా ఉన్నాయి. దేశంలో మూడింట రెండు వంతులభూభాగం ఉబాంగి నదీ పరీవాహక ప్రాంతంగా ఉంది (కాంగోలో ప్రవహిస్తుంది). మిగిలిన మూడవ భూభాగం చారి ముఖద్వారంలో ఉంది. చారి నదీ జలాలు చాదు సరోవరంలోకి సంగమిస్తుంటాయి.
ప్రస్తుత మధ్య ఆఫ్రికా గణతంత్రం ప్రాంతంలో వేల సంవత్సరాల నుండి మానవనివసిత ప్రాంతంగా ఉంది. ప్రస్తుత దేశం సరిహద్దులు పరాసుదేశం (ఫ్రెంచిదేశం) స్థాపించినవి. 19 వ శతాబ్దం చివరలో ఈ భూభాగంలో కాలనీగా పాలన ప్రారంభం అయింది. 1960 లో పరాసుదేశం నుండి స్వాతంత్ర్యం పొందిన తరువాత మధ్య ఆఫ్రికా గణతంత్రంకును పలువురు నిరంకుశ నాయకులు పాలించారు. ఒక రాచరిక పాలన విఫలమైంది.[1] 1990 నాటికి ఈ ప్రజాస్వామ్యం 1993 లో మొట్టమొదటి బహుళ-పార్టీ ప్రజాస్వామ్య ఎన్నికలకు దారి తీసింది. ఆంగె-ఫెలిక్స్ పాటాసు అధ్యక్షుడిగా నియమించడమైంది. కానీ తరువాత 2003 తిరుగుబాటులో జనరల్ ఫ్రాంకోయిస్ బోజీజేచే తొలగించబడింది. 2004 లో మధ్య ఆఫ్రికా గణతంత్రం బుష్ యుద్ధం ప్రారంభమైంది. 2007 లో శాంతి ఒప్పందం, 2011 లో మరొక యుద్ధం మొదలైంది. 2012 డిసెంబరులో పలు వర్గాల మధ్య జరిగిన పోరాటంలో తక్కువసంఖ్యతో ఉన్న ముస్లిం జాతి మతపరమైన ప్రక్షాళనలో భాగంగా 2013 - 2014 లో భారీ జనాభా స్థానభ్రంశం సంభవించింది.
దేశంలో యురేనియం నిల్వలు, ముడి చమురు, బంగారం, వజ్రాలు, కోబాల్ట్, కలప, జలశక్తి వంటి గణనీయమైన ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. [2] గణనీయమైన పరిమాణంలో సాగు భూమి వంటి ఇతర వనరులు ఉన్నాయి. ప్రపంచంలోని 10 పేద దేశాలలో మధ్య ఆఫ్రికా గణతంత్రం ఒకటి. 2017 నాటికి ప్రపంచములో అతి తక్కువ జి.డి.పి, కొనుగోలు శక్తిని కలిగిన దేశంగా గుర్తించబడుతుంది.[3] 2015 నాటికి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ (హెచ్డిఐ) ప్రకారం అత్యల్ప మానవ అభివృద్ధిని కలిగిన దేశంగా 188 దేశాల్లో 188 వ స్థానంలో ఉంది.[4] ఇది అత్యంత అనారోగ్యకరమైన దేశంగా గుర్తించబడుతుంది.[5] అలాగే చిన్న వయస్సు ప్రజలకు అతి భయంకరమైన దేశంగా కూడా అంచనా వేయబడింది.[6] మధ్య ఆఫ్రికా గణతంత్రం యునైటెడ్ నేషన్స్, ఆఫ్రికన్ యూనియన్, సెంట్రల్ ఆఫ్రికన్ స్టేట్స్ ఎకనామిక్ కమ్యూనిటీ, ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ డి లా ఫ్రాంకోఫొనీ, నాన్-అలైండ్ మూవ్మెంటు సభ్యదేశంగా ఉంది.