గణతంత్ర రాజ్యమైన భారత దేశాధినేత From Wikipedia, the free encyclopedia
సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యమైన భారతదేశానికి దేశాధినేత రాష్ట్రపతి (Rashtrapati / President). రాష్ట్రపతి దేశ ప్రథమ పౌరుడు, సర్వ సైన్యాధ్యక్షుడు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి కార్యనిర్వాహక దేశాధినేత. శాసన విభాగమైన పార్లమెంటు ఉభయసభలను రాష్ట్రపతి సమావేశపరుస్తారు. ప్రభుత్వాధినేత అయిన ప్రధానమంత్రిని నియమిస్తారు. అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను నియమిస్తారు. అయితే, వాస్తవానికి కార్యనిర్వాహక అధికారాలన్నీ ప్రభుత్వాధినేత ప్రధానమంత్రివే. ప్రధానమంత్రి సలహా మేరకే, రాష్ట్రపతి సంతకంతో ఉత్తర్వులు జారీ అవుతాయి. రాష్ట్రపతి పదవి అలంకార ప్రాయమైంది.
భారత రాష్ట్రపతి
Bhārata kē Rāṣṭrapati | |
---|---|
రిపబ్లిక్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వ కార్యనిర్వాహక శాఖ | |
విధం | |
రకం |
|
Abbreviation | POI |
అధికారిక నివాసం | రాష్ట్రపతి భవన్ |
స్థానం | న్యూ ఢిల్లీ, ఢిల్లీ, భారతదేశం |
నియామకం | ఎలక్టోరల్ కాలేజ్ ఆఫ్ ఇండియా |
కాలవ్యవధి | 5 సంవత్సరాలు పునరుద్ధరణపై పరిమితి లేదు |
స్థిరమైన పరికరం | భారత రాజ్యాంగం (ఆర్టికల్ 52) |
అగ్రగామి | భారత చక్రవర్తి (అతని ప్రతినిధి భారత గవర్నరు జనరల్) |
నిర్మాణం | 26 జనవరి 1950 |
మొదట చేపట్టినవ్యక్తి | బాబూ రాజేంద్ర ప్రసాద్ |
ఉప | భారత ఉపరాష్ట్రపతి |
జీతం | • ₹5,00,000 (US$6,300) (per month) • ₹60,00,000 (US$75,000) (annually)[2] |
రాష్ట్రపతి దేశాధినేతగా 1950 జనవరి 26 న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిననాటి నుండి గుర్తించబడింది. అప్పటి వరకు గవర్నర్ జనరల్ దేశాధినేతగా ఉండేవాడు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, భారతదేశానికి ఇద్దరు గవర్నర్ జనరల్ గా పనిచేసారు.
భారత రాష్ట్రపతిగా ఎన్నికయేందుకు క్రింద తెలిపిన అర్హతలు ఉండాలి.
ఒక వ్యక్తి ఎన్నిసార్లు అయినా రాష్ట్రపతిగా ఎన్నిక కావచ్చు. రాష్ట్రపతిగా ఎన్నికవ్వబోయే వ్యక్తి, పార్లమెంటు ఉభయసభల్లోగాని, రాష్ట్ర శాసనసభల్లోగాని సభ్యుడిగా ఉండరాదు. ఒకవేళ అటువంటి సభ్యుడు రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేస్తే వెంటనే సదరు సభల్లో సభ్యత్వం కోల్పోతారు.
రాష్ట్రపతి వేతనం పార్లమెంటు నిర్ణయిస్తుంది. పదవీకాలం ముగిసే వరకు రాష్ట్రపతి వేతనంలో కోత ఉండదు. అధికరణ 360 కింద ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో రాష్ట్రపతి వేతనంలో కోత విధించరాదు.
రాష్ట్రపతిని కింది సభ్యులు గల ఎలెక్టోరల్ కాలేజి ఎన్నుకుంటుంది.
అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతిచే ప్రమాణ స్వీకారం చేయిస్తారు.[3]
ఏ కారణం చేతనైనా రాష్ట్రపతి పదవి ఖాళీ అయినపుడు, ఆరు నెలలలోగా కొత్త రాష్ట్రపతి పదవీ స్వీకారం జరగాలి. మొదట్లో రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒక ఎంపి లేదా ఎమ్మెల్యే ప్రతిపాదించి మరో ఎంపి లేదా ఎమ్మెల్యే బలపరిస్తే సరిపోయేది. 1974 లో జరిగిన రాజ్యాంగ సవరణ ప్రకారం ప్రతిపాదించే వారి సంఖ్య, బలపరిచే వారి సంఖ్యను 10 కి పెంచారు. 1997 లో జరిగిన మరో సవరణ ప్రకారం ఈ సంఖ్యను 50 కి పెంచారు. రాష్ట్రపతి ఎన్నికల్లో నోటా (ఎవరికీ ఓటు వేయకపోవడం) అవకాశం లేదు. ఓటు వేసే వాళ్ళు కచ్చితంగా ఎవరినో ఒకరిని ఎన్నుకోవాల్సిందే. ఈ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలట్ ఉండదు. సాధారణంగా రాజకీయ పార్టీలు తమ సభ్యులు ఓటింగ్ లో పాల్గొనేటపుడు ఫలానా వారికే ఓటు వేయాలని విప్ జారీ చేస్తాయి. కానీ రాష్ట్రపతి ఎన్నికకు మాత్రం విప్ జారీ చేయరు. ఒకసారి రాష్ట్రపతిగా ఎన్నికైనా కూడా ఎన్ని సార్లయినా తిరిగి ఆ పదవికి పోటీ చేయవచ్చు.[4]
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీ కాలం 2022 జూలై 24తో ముగియనున్న నేపథ్యంలో, జూలై 25లోగా నూతన రాష్ట్రపతి ఎన్నిక పూర్తి కావాల్సి ఉంది. 2022 జూన్ 9న ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, భారత రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేశారు.[5]
రాష్ట్రపతి ఎన్నికకు 2022 జూన్ 9న కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్ షెడ్యూల్ ప్రకటించాడు. రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఈ ఎన్నిక నిర్వహిస్తున్నట్లు చీఫ్ ఎన్నికల కమిషనర్ తెలిపాడు.[6]
సంఖ్య | ఎన్నికల ప్రకియ | తేదీ | వారం |
---|---|---|---|
1. | ఎన్నికకు నోటిఫికేషన్ | 2022 జూన్ 15 | బుధవారం |
2. | నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ | 2022 జూన్ 29 | బుధవారం |
3. | నామినేషన్ల పరిశీలన | 2022 జూన్ 30 | గురువారం |
4. | నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ | 2022 జూలై 2 | శనివారం |
5. | ఎన్నిక | 2022 జూలై 18 | సోమవారం |
6. | కౌంటింగ్ | 2022 జూలై 21 | గురువారం |
అభ్యర్థి | సంకీర్ణ | వ్యక్తిగత
ఓట్లు |
ఎలక్టోరల్
కాలేజీ ఓట్లు |
% | |
---|---|---|---|---|---|
ద్రౌపది ముర్ము | ఎన్డీఏ | 2,824 | 676,803 | 64.03 | |
యశ్వంత్ సిన్హా | ఉమ్మడి ప్రతిపక్షం | 1,877 | 380,177 | 35.97 | |
చెల్లుబాటు ఓట్లు | 4,701 | 1,056,980 | 98.89 | ||
ఖాళీ, చెల్లని ఓట్లు | 53 | 15,397 | 1.11 | ||
మొత్తం | 4,754 | 1,072,377 | 100 | ||
నమోదైన ఓటర్లు / పోలింగ్ శాతం | 4,809 | 1,086,431 | 98.86 |
రాష్ట్రపతి ఐదేళ్ళు పదవిలో ఉంటారు. అయితే కింది పద్ధతుల ద్వారా రాష్ట్రపతి పదవీకాలం ముందే/తరువాత ముగియవచ్చు.
ప్రభుత్వంలోని మూడు వ్యవస్థలకు సంబంధించి, రాష్ట్రపతికి కింది అధికారాలు ఉంటాయి. అయితే ఈ అధికారాలన్నీ అలంకారప్రాయమైనవే. దాదాపుగా అన్ని విధులూ, ప్రధానమంత్రి సలహా మేరకే జరుగుతాయి.
రాష్ట్రపతికి శాసన వ్యవస్థకు సంబంధించిన కింది అధికారాలు ఉంటాయి
రాజ్యాంగం ప్రకారం కార్యనిర్వాహక అధికారాలన్నీ రాష్ట్రపతివే. అవి:
352వ ప్రకరణం ప్రకారం యుద్ధం, విదేశీ దురాక్రమణ, సాయుధ తిరుగుబాటు జరిగినప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తారు. ఇప్పటికి ఇది 3 సార్లు విధించబడింది
356వ అధికరణ ప్రకారం ఏదైన రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు దీనిని విధిస్తారు. ఇప్పటికి ఇది సుమారుగా 126 సార్లు విధించబడింది
360వ ప్రకరణం ప్రకారం దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనపడినప్పుడు దీనిని విధిస్తారు. ఇప్పటికి ఇది ఒక్కసారి కూడా విధించబడలేదు.
రాష్ట్రపతి తొలగింపు ప్రక్రియను రాజ్యాంగంలో వివరించటం జరిగింది. ఈ విషయంలో పార్లమెంటు ఉభయ సభలకు సమాన అధికారములు ఉన్నాయి.
ఇంత వరకు ఏ రాష్ట్రపతి ఈ పద్ధతి ద్వారా తొలగించబడలేదు. తొలగించబడే రాష్ట్రపతి అనర్హతల గురించి రాజ్యాంగంలో వివరించలేదు.
సంఖ్య | పేరు | నుండి | వరకు |
---|---|---|---|
01 | లూయీ మౌంట్బాటెన్ | ఆగష్టు 15, 1947 | జూన్ 21, 1948 |
02 | చక్రవర్తి రాజగోపాలాచారి | జూన్ 21, 1948 | జనవరి 26, 1950 |
సంఖ్య | పేరు | నుండి | వరకు |
---|---|---|---|
01 | రాజేంద్ర ప్రసాద్ | జనవరి 26, 1950 | మే 13, 1962 |
02 | డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ | మే 13, 1962 | మే 13, 1967 |
03 | డా.జాకీర్ హుస్సేన్ | మే 13, 1967 | మే 3, 1969 |
* | వరాహగిరి వేంకటగిరి | మే 3, 1969 | జూలై 20, 1969 |
* | ఎం.హిదయతుల్లా | జూలై 20, 1969 | ఆగష్టు 24, 1969 |
04 | వరాహగిరి వేంకటగిరి | ఆగష్టు 24, 1969 | ఆగష్టు 24, 1974 |
05 | ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ | ఆగష్టు 24, 1974 | ఫిబ్రవరి 11, 1977 |
* | బి.డి.జట్టి | ఫిబ్రవరి 11, 1977 | జూలై 25, 1977 |
06 | నీలం సంజీవరెడ్డి | జూలై 25, 1977 | జూలై 25, 1982 |
07 | జ్ఞాని జైల్ సింగ్ | జూలై 25, 1982 | జూలై 25, 1987 |
08 | ఆర్.వెంకటరామన్ | జూలై 25, 1987 | జూలై 25, 1992 |
09 | డా.శంకర దయాళ్ శర్మ | జూలై 25, 1992 | జూలై 25, 1997 |
10 | కె.ఆర్.నారాయణన్ | జూలై 25, 1997 | జూలై 25, 2002 |
11 | డా.ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ | జూలై 25, 2002 | జూలై 25, 2007 |
12 | ప్రతిభా పాటిల్ | జూలై 25, 2007 | జూలై 25, 2012 |
13 | ప్రణబ్ ముఖర్జీ | జూలై 25, 2012 | జూలై 25, 2017 |
14 | రామ్నాథ్ కోవింద్ | జూలై 25, 2017 | 2022 జూలై 25 |
15 | ద్రౌపది ముర్ము | 2022 జూలై 25 | నేటి వరకూ |
గమనిక:* తాత్కాలిక
భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24తో ముగిసింది. కొత్త రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్.డి.ఎ. కూటమి గిరిజన నేత, ఒడిశా రాష్ట్రమంత్రిగా, గవర్నరుగా, అలాగే జార్ఖండ్ రాష్ట గవర్నరుగా పనిచేసిన ద్రౌపది ముర్మును ప్రతిపాదించింది.భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ద్రౌపది ముర్ము సంయుక్త ప్రతిపక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై 2,96,626 ఓట్ల తేడాతో గెలుపొందింది. నూతన రాష్ట్రపతిగా ఎన్నికైవ ద్రౌపది ముర్ము 2022 జూలై 25న భారతదేశ 15వ రాష్ట్రపతిగా భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు.[9][10]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.