![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/50/Flag_of_Burundi.svg/langte-640px-Flag_of_Burundi.svg.png&w=640&q=50)
బురుండి
From Wikipedia, the free encyclopedia
అధికారికంగా బురుండి రిపబ్లిక్ [2] ఇది తూర్పు ఆఫ్రికాలోని గ్రేట్ లేక్ ప్రాంతంలో ఉన్న భూబంధిత దేశం. అని అంటారు. ఉత్తరసరిహద్దులో రువాండా, తూర్పు, దక్షిణ సరిహద్దులో టాంజానియా, పశ్చిమసరిహద్దులో డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో ఉన్నాయి. ఇది మద్య ఆఫ్రికాలో భాగంగా ఉంది. బరుండి రాజధాని ముజుంబురా. నైరుతు సరిహద్దులో తంగానికా సరోవరం ఉంది.
Republika y'u Burundi République du Burundi Republic of Burundi |
||||||
---|---|---|---|---|---|---|
|
||||||
నినాదం "Ubumwe, Ibikorwa, Iterambere" (Kirundi) "Unité, Travail, Progrès" (French) "Unity, Work, Progress" 1 |
||||||
![]() |
||||||
రాజధాని అతి పెద్ద నగరం | Bujumbura 3°30′S 30°00′E | |||||
అధికార భాషలు | Kirundi, French | |||||
ప్రజానామము | Burundian | |||||
ప్రభుత్వం | Republic | |||||
- | President | Pierre Nkurunziza | ||||
Independence | from Belgium | |||||
- | Date | July 1 1962 | ||||
విస్తీర్ణం | ||||||
- | మొత్తం | 27,830 కి.మీ² (145th) 10,745 చ.మై |
||||
- | జలాలు (%) | 7.8% | ||||
జనాభా | ||||||
- | 2005 అంచనా | 7,548,000 (94th) | ||||
- | 1978 జన గణన | 3,589,434 | ||||
- | జన సాంద్రత | 271 /కి.మీ² (43rd) 533.8 /చ.మై |
||||
జీడీపీ (PPP) | 2003 అంచనా | |||||
- | మొత్తం | $4.517 billion² (142nd) | ||||
- | తలసరి | $739 (163rd) | ||||
జీడీపీ (nominal) | 2005 అంచనా | |||||
- | మొత్తం | $799 million[1] (162nd) | ||||
- | తలసరి | $90 (182nd) | ||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2004) | ![]() |
|||||
కరెన్సీ | Burundi franc (FBu) (BIF ) |
|||||
కాలాంశం | CAT (UTC+2) | |||||
- | వేసవి (DST) | not observed (UTC+2) | ||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .bi | |||||
కాలింగ్ కోడ్ | +257 | |||||
1 | Before 1966, "Ganza Sabwa". | |||||
2 | Estimate is based on regression; other PPP figures are extrapolated from the latest International Comparison Programme benchmark estimates. |
500 సంవత్సరాల నుండి దివా, హుటు, టుట్టీ ప్రజలు కనీసం బురుండిలో నివసిస్తున్నారు. ఇందులో 200 సంవత్సరానికంటే అధికంగా బురుండి ఒక స్వతంత్ర రాజ్యంగా ఉంది. 20 వ శతాబ్దం ప్రారంభంలో జర్మనీ ఈ ప్రాంతాన్ని ఆక్రమించింది.[3] మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓటమి తరువాత అది ఈ భూభాగాన్ని బెల్జియంకు అప్పగించింది. జర్మన్లు , బెల్జియన్లు ఇద్దరూ బురుండిని పాలించారు. రువాండా రుయాండ-ఉరుండి పేరుతో యూరోపియన్ కాలనీగా పాలించబడింది.
1962 లో బురుండి స్వాతంత్ర్యం పొందింది. ప్రారంభంలో రాజరికం ఉన్నప్పటికీ వరుస హత్యలు, తిరుగుబాట్లు, ప్రాంతీయ అస్థిరత్వం వాతావరణం కారణంగా 1966 లో ఇది గణతంత్రగా రాజ్యంగా ఒక-పార్టీ రాజ్యంగా మారింది. జాతి ప్రక్షాళన యుద్ధాలు, రెండు పౌర యుద్ధాలు, 1970 లలో - 1990 లలో జరిగిన జాతినిర్మూలన హత్యాకాండ దేశాన్ని అభివృద్ధి చెందని దేశంగా ప్రపంచం లోని పేదదేశాలలో ఒకటిగా మిగిలిపోయింది.[4] అధ్యక్షుడు పియరీ నకురన్జిజా అధ్యక్ష పదవిలో మూడవసారి ఎన్నికయ్యాడు. పెద్ద తిరుగుబాటు ప్రయత్నం విఫలమైంది. దేశం పార్లమెంటరీ, అధ్యక్ష ఎన్నికలను అంతర్జాతీయ సమాజసభ్యులు అత్యధికంగా విమర్శించారు.
బురుండి రాజకీయ వ్యవస్థ సార్వభౌమ రాజ్యం ఒక బహుళ-పార్టీ రాష్ట్రంపై ఆధారపడింది. ప్రభుత్వానికి అధ్యక్షుడు నాయకత్వం వహిస్తాడు. ప్రస్తుతం బురుండిలో 21 పార్టీలు నమోదై ఉన్నాయి.[5] 1992 మార్చి 13 న టుట్సీ తిరుగుబాటు నాయకుడు పియరీ బీయోయోయా రాజ్యాంగంను స్థాపించాడు.[6] ఇది ఒక బహుళ-పార్టీ రాజకీయ ప్రక్రియను, బహు-పార్టీ పోటీని ప్రతిబింబిస్తుంది.[7] 6 సంవత్సరాల తరువాత 1998 జూన్ 6 న రాజ్యాంగం మార్చబడింది. జాతీయ అసెంబ్లీ సీట్లు విస్తరించడం, రెండు ఉపాధ్యక్షుల నియమాలను తయారు చేయడం జరిగింది. అరుష అకార్డు కారణంగా, 2000 లో బురుండిలో పరివర్తిత ప్రభుత్వం అమలులోకి తెచ్చింది.[8] 2016 అక్టోబరులో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ నుండి ఉపసంహరించుకోవాలని ఐక్యరాజ్య సమితికి బురుండి తెలియజేసింది. [9]
2013 లో పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న జనాభాలో కేవలం 13% మాత్రమే ఉన్న బురుండి అధికంగా నగరనివాసిత సమాజంగా మిగిలిపోయింది.[10] చదరపు కిలోమీటరుకు 315 జనసాంద్రత (చదరపు మైలుకు 753)ఉంది. ఉప-సహారా ఆఫ్రికాలో జనసాధ్రతలో ద్వితీయ స్థానంలో ఉంది.[5] జనాభాలో దాదాపు 85% మంది హుటు, 15% టుట్సి, 1% స్వల్ప స్వజాతి ప్రజలు ఉన్నారు.[11] బురుండి అధికారిక భాషలుగా కిరుండి, ఫ్రెంచి, ఆంగ్లం ఉన్నాయి. కిరుండి అధికారికంగా ఏకైక జాతీయ భాషగా గుర్తింపు పొందాయి.[12]
ఆఫ్రికాలోని అతి చిన్న దేశమైన బురుండిలో భూమధ్యరేఖా వాతావరణం ఉంటుంది. బురుండి ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ పశ్చిమ పొడిగింపులో ఉన్న ఆల్బర్టౌనులో భాగంగా ఉంది. ఆఫ్రికా ఆఫ్రికాలో రోలింగ్ పీఠభూమి మీద ఉంది. 2,685 (8,810 ft) ఎత్తు ఉన్న మౌంట్ హేహ ఎత్తైన శిఖరంగా ఉంది.[13] ఇది రాజధాని బుజుంబురా ఆగ్నేయంలో ఉంది. బురుండి లోని బురురీ ప్రావింసులో ఉన్న రువిరోరోజా నది నైలు నదికి అత్యంత సుదూర వనరుగా ఉంది. నైలు లేక్ విక్టోరియా సరసుతో అనుసంధానితమై ఉంది. విక్టోరియా సరోవర జలాలు కాగెరా నది ద్వారా రువిరోరోజా నదిలో సంగమించి నైలు నదికి చేరుతుంది. [14][15] బురుండి నైరుతి మూలలో ఉన్న టాంగ్యానికా సరసు మరొక ప్రధాన సరసుగా ఉంది.[16] ఈ రెండు జాతీయ ఉద్యానవనాలలో ఒకటి వాయువ్య దిశలో ఉన్న కిబిరా నేషనల్ పార్క్ (రువాండాలోని న్యుంగ్వే ఫారెస్ట్ నేషనల్ పార్కుకు సమీపంలో ఉన్న వర్షపు అడవులతో కూడిన ఒక చిన్న ప్రాంతం), రెండవది ఈశాన్య దిశలో ఉన్న రువాబు నేషనల్ పార్క్ (రురుబ నది వెంట కూడా రవుబు లేదా రువువువు అని కూడా పిలుస్తారు) . రెండు వన్యప్రాణుల జనాభాను రక్షించడానికి 1982 లో స్థాపించబడ్డాయి.[17] బురుండిలో అధికంగా వ్యవసాయం లేదా పచ్చిక భూములు ఉన్నాయి.
గ్రామీణ ప్రజల స్థావరాలు అటవీ నిర్మూలనకు, నేల కోత, నివాస నష్టాలకు దారితీసింది.[18] జనాభా పెరుగుదల కారణంగా మొత్తం దేశం అటవీ నిర్మూలనం దాదాపుగా 600 కిలోమీటర్లు (230 చదరపు మైళ్ళు) చేరుకుంది. సంవత్సరానికి సుమారు 9% నష్టపోతుంది.[19] పేదరికంతో పాటు, బురుండియన్లు తరచూ అవినీతి, బలహీనమైన మౌలిక నిర్మాణాలు, ఆరోగ్యం, విద్యా సేవలకు తక్కువ అభివృద్ధి, ఆకలి వంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.[20] బురుండి అధిక జనసాంద్రత కలిగి ఉంది. యౌవనస్థులు అవకాశాలను కోరుకుంటూ గణనీయమైన వెలుపలకు వలస పోతూ ఉన్నారు. ప్రపంచ హ్యాపీనెస్ రిపోర్ట్ 2018 బురుండిని ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశాలలో 156 వ స్థానంలో ఉందని పేర్కొంది. [21]