బీర్బం జిల్లా
వెస్ట్ బెంగాల్ లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర జిల్లాలలోని 20 జిల్లాలో బీర్బం (బెంగాలీ:বীরভূম জেলা) జిల్లా ఒకటి. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర 3 విభాగాలలో ఒకటైన బర్ద్వాన్ విభాగంలో ఉత్తరభాగంలో ఉంది. జిల్లా ప్రధాన కార్యాలయం సూరి వద్ద ఉంది.[1][2]జిల్లా పశ్చిమ సరిహద్దులో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన దుంకా, జంతరా, పాకుర్ జిల్లాలు ఉన్నాయి. ఇతర సరిహద్దులో బర్ధామన్, ముర్షిదాబాద్ జిల్లాలు ఉన్నాయి.
Birbhumసవరించు జిల్లా
বীরভূম জেলা | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | West Bengal |
డివిజను | Burdwan |
ముఖ్య పట్టణం | Suri, Birbhum |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | Birbhum, Bolpur (shared with Bardhaman district) |
• శాసనసభ నియోజకవర్గాలు | Dubrajpur (SC), Suri, Sainthia (SC), Rampurhat, Hansan, Nalhati, Murarai, Bolpur, Nanoor (SC), Labpur, Mayureswar |
విస్తీర్ణం | |
• మొత్తం | 4,545 కి.మీ2 (1,755 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 35,02,387 |
• జనసాంద్రత | 770/కి.మీ2 (2,000/చ. మై.) |
• Urban | 2,58,420 (2,001) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 70.90 per cent (2011) |
• లింగ నిష్పత్తి | 926 |
ప్రధాన రహదార్లు | Panagarh–Morgram Highway |
సగటు వార్షిక వర్షపాతం | 1,300 మి.మీ. |
Website | అధికారిక జాలస్థలి |
ఈ జిల్లాను తరచుగా " ది లాండ్ ఆఫ్ రెడ్ సాయిల్ " (ఎర్రమట్టి భూమి) [3] విభిన్నమైన భూలక్షణాలే కాక సంప్రదాయంగా కూడా బిర్బం జిల్లాను పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఇతర జిల్లాల నుండి వేరు చేస్తుంది. జిల్లా పశ్చిమ భూభాగంలోని చోటా నాగ్పూర్ ప్రాంతంలో పొదలు అధికంగా ఉన్నాయి. ఈ భూభాగం క్రమంగా తూర్పు భూభాంలో ఉన్న సారవంతమైన వ్యవసాయభూములలో కలిసిపోతుంది. [4] జిల్లా పలు సాంస్కృతిక, మతపరమైన ఉద్యమాలు జరిగాయి. రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతి నికేతన్ వద్ద విశ్వభారతి విశ్వవిద్యాలయం స్థాపించాడు. ఇది అంతర్జాతీయ గుర్తింపును పొందింది.[5] సాంస్కృతికంగా సుసంపన్నమైన ఈ జిల్లాలో పౌష్ మేళా వంటి పలు ఉత్సవాలు నిర్వహించబడుతున్నాయి. [6] ప్రధానంగా వ్యవసాయ ఆధారిత జిల్లా అయిన బిర్బం జిల్లాలో 75% వ్యవసాయ భూములు ఉన్నాయి.[7] జిల్లాలలో ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులలో పత్తి, పట్టు వ్యవసాయం ప్రధానమైనవి. నేత, నూనె మిల్లులు, రాళ్ళగనులు, లక్కను పండించడం, మృణ్మయ పాత్రల తాయారీ, లోహపాత్రల తయారీ, రైస్ మిల్లులు వంటి చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయి.[8] జిల్లాలో ఉన్న ఏకైక బృహత్తర పరిశ్రమగా " బక్రేశ్వర్ థర్మల్ పవర్ స్టేషను " గుర్తినచబడుతుంది.[9]