From Wikipedia, the free encyclopedia
దుమ్కా, జార్ఖండ్ రాష్ట్రం, దుమ్కా జిల్లా లోని పట్టణం, ఈ జిల్లా ముఖ్యపట్టణం, సంతాల్ పరగణా ప్రాంతానికి ప్రధాన కార్యాలయం. ఇది 1855 లో సంతాల్ తిరుగుబాటు తరువాత, భాగల్పూర్, బీర్భూమ్ జిల్లాల నుండి దుమ్కా జిల్లాను రూపొందించారు. దుమ్కాను బీహార్ దక్షిణ భాగం లోని 18 ఇతర జిల్లాలతో కలిపి 2000 నవంబరు 15 న జార్ఖండ్ రాష్ట్రంగా ఏర్పరచారు. దీనికి సమీపంలోని ముఖ్యమైన నగరాలు రాంపూర్హాట్, దేవఘర్ .
దుమ్కా | ||||||
---|---|---|---|---|---|---|
Coordinates: 24.27°N 87.25°E | ||||||
Country | India | |||||
రాష్ట్రం | జార్ఖండ్ | |||||
జిల్లా | దుమ్కా | |||||
Region | రార్ ప్రాంతం | |||||
విస్తీర్ణం | ||||||
• Total | 4,404.02 కి.మీ2 (1,700.40 చ. మై) | |||||
Elevation | 137 మీ (449 అ.) | |||||
జనాభా (2011) | ||||||
• Total | 47,584 | |||||
• జనసాంద్రత | 300/కి.మీ2 (800/చ. మై.) | |||||
భాషలు | ||||||
• అధికారిక | హిందీ, ఉర్దూ | |||||
Time zone | UTC+5:30 (IST) | |||||
PIN | 814101 | |||||
Telephone code | 06434 | |||||
Vehicle registration | JH-04 | |||||
లింగనిష్పత్తి | 974 ♂/♀ |
ఇంగ్లీష్ ప్రతినిధి, డాక్టర్ గాబ్రియేల్ బాక్లింగ్టన్, ఈ ప్రాంతాన్ని షా జహాన్ నుండి ఒక ఫర్మానా ద్వారా సంపాదించుకున్నాడు. 1742-1751 మధ్య రాజమహల్‌కు దగ్గరగా ఉన్న దుమ్కా ప్రాంతం లోకి రఘోజీ భోంస్లే, పేష్వా బాలాజీ రావు ఆధ్వర్యంలోని మరాఠాలు తరచుగా చొరబడుతూ ఉండేవారు. 1745 లో రఘోజీ భోంస్లే రాజమహల్ ప్రాంతం లోని కొండలు అరణ్యాల ద్వారా సంతల్ పరగణా లోకి ప్రవేశించాడు. మొదట్లో పహారియాలను అణచివేయడంలోనే ఆంగ్లేయులకు సరిపోయింది. 1769 లో దుమ్కా బెంగాల్‌లోని బీర్భుమ్ జిల్లా కింద ఘట్వాలీ పోలీసు పోస్టుగా మిగిలిపోయింది.
1775 లో దుమ్కాను భాగల్పూర్ డివిజన్‌కు బదిలీ చేసారు. 1865 లో దుమ్కాను భాగల్పూర్ నుండి విడదిసి స్వతంత్ర జిల్లాగా చేశారు. 1872 న దుమ్కాను సంతాల్ పరగణాకు ప్రధాన కార్యాలయంగా మార్చారు. 1889 లో లార్స్ ఒల్సెన్ స్క్రెఫ్స్రూడ్ తర్వాత పాల్ ఒలాఫ్ బోడింగ్ భారతదేశంలో (దుమ్కా/బెనగారియా) తన సేవను ప్రారంభించాడు. అతడు సంతాల్ భాషకు మొదటి అక్షరమాలను సృష్టించాడు. కాథలిక్కులు ఈ ప్రాంతంలో మిషన్‌ను స్థాపించడానికి ముందు, NELC- చర్చి ఈ ప్రాంతంలో లూథరన్ చర్చిగా సృష్టించబడింది. 1902 లో మొదటి మునిసిపాలిటీని స్థాపించారు. 1920 లో పట్టణం లోకి మోటార్ కార్లు, బస్సులు వచ్చాయి.
మొదటగా 1952 లో మాల్డా అపోస్టోలిక్ పీఠాన్ని స్థాపించారు. 1962 లో, ఇది దుమ్కా రోమన్ కాథలిక్ డియోసెస్‌గా పదోన్నతి పొందింది. ఆ తర్వాత 1983 లో దుమ్కాను సంతాల్ పరగణా డివిజన్ కేంద్రంగా చేశారు. 2000 నవంబరు 15 న దుమ్కా, జార్ఖండ్ ఉప రాజధానిగా మారింది. 2011 లో కొత్తగా నిర్మించిన జాసిదిహ్-దుమ్కా రైల్వే మార్గంతో దుమ్కా, రైల్వే మ్యాపు లోకి చేరింది. 2012 లో రాంచీకి ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ జాసిదిహ్ ద్వారా ప్రారంభమైంది. తరువాత 2017 లో దుమ్కాలో పైలట్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. చివరకు 2018 లో దుధాని నుండి టాటా షోరూమ్ వరకు నాలుగు లేన్ల రహదారి నిర్మించారు.
దుమ్కా 24.27°N 87.25°E వద్ద,[1] సముద్రమట్టం నుండి సగటున 137 మీటర్ల ఎత్తున ఉంది.
దుమ్కా జనాభా | |||
---|---|---|---|
Census | Pop. | %± | |
1911 | 5,629 | — | |
1921 | 7,396 | 31.4% | |
1931 | 9,471 | 28.1% | |
1941 | 10,811 | 14.1% | |
1951 | 13,582 | 25.6% | |
1961 | 18,720 | 37.8% | |
1971 | 23,338 | 24.7% | |
1981 | 31,068 | 33.1% | |
1991 | 38,096 | 22.6% | |
2001 | 44,989 | 18.1% | |
2011 | 47,584 | 5.8% | |
మూలం:[2] |
2011 జనగణన ప్రకారం,[3] దుమ్కా పట్టణ జనాభా 47,584, ఇందులో 25,364 మంది పురుషులు, 22,220 మంది మహిళలు ఉన్నారు. 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 5371, ఇది దుమ్కా పట్టణ మొత్తం జనాభాలో 11.29%. దుమ్కాలో పురుష/స్త్రీ లింగ నిష్పత్తి 876. ఇది రాష్ట్ర సగటు 948 తో పోలిస్తే తక్కువగా ఉంది. దుమ్కాలో పిల్లల్లో లింగ నిష్పత్తి 891. జార్ఖండ్ రాష్ట్ర సగటు 948. దుమ్కా పట్టణ అక్షరాస్యత 89.92%. ఇది రాష్ట్ర సగటు 66.41% కంటే ఎక్కువ. పురుషుల అక్షరాస్యత దాదాపు 93.46% కాగా, మహిళా అక్షరాస్యత 85.87%
దుమ్కాలో మతం(2011) | ||||
---|---|---|---|---|
మతం | శాతం | |||
హిందూమతం | 88.25% | |||
ఇస్లాం | 8.46% | |||
క్రైస్తవం | 2.70% | |||
జైనమతం | 0.04% | |||
ఇతరాలు† | 0.14% | |||
ఇతరాల్లో †సిక్కుమతం(0.06%), బౌద్ధం(0.08%). |
దుమ్కాలో తేమతో కూడిన ఉపఉష్ణమండల వాతావరణం ( కోపెన్ వాతావరణ వర్గీకరణ Cwa ), వెచ్చగా, తడిగా ఉండే వేసవి, తేలికపాటి శీతాకాలాలు ఉంటాయి.
శీతోష్ణస్థితి డేటా - Dumka | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
అత్యధిక రికార్డు °C (°F) | 33.3 (91.9) |
35.6 (96.1) |
42.8 (109.0) |
46.3 (115.3) |
48.3 (118.9) |
45.2 (113.4) |
41.5 (106.7) |
38.6 (101.5) |
38.1 (100.6) |
37.6 (99.7) |
35.8 (96.4) |
31.2 (88.2) |
48.3 (118.9) |
సగటు అధిక °C (°F) | 25.9 (78.6) |
28.9 (84.0) |
34.3 (93.7) |
38.4 (101.1) |
37.5 (99.5) |
35.5 (95.9) |
32.7 (90.9) |
32.5 (90.5) |
32.9 (91.2) |
33.0 (91.4) |
30.5 (86.9) |
27.0 (80.6) |
32.4 (90.4) |
సగటు అల్ప °C (°F) | 10.2 (50.4) |
13.2 (55.8) |
17.4 (63.3) |
22.3 (72.1) |
23.9 (75.0) |
24.7 (76.5) |
24.1 (75.4) |
23.7 (74.7) |
23.6 (74.5) |
21.0 (69.8) |
16.0 (60.8) |
11.1 (52.0) |
19.3 (66.7) |
అత్యల్ప రికార్డు °C (°F) | 1.7 (35.1) |
1.8 (35.2) |
5.8 (42.4) |
13.8 (56.8) |
14.5 (58.1) |
17.8 (64.0) |
13.4 (56.1) |
16.8 (62.2) |
13.8 (56.8) |
11.8 (53.2) |
4.8 (40.6) |
2.8 (37.0) |
1.7 (35.1) |
సగటు అవపాతం mm (inches) | 9.0 (0.35) |
15.0 (0.59) |
21.0 (0.83) |
35.0 (1.38) |
72.0 (2.83) |
198.0 (7.80) |
343.0 (13.50) |
293.0 (11.54) |
273.0 (10.75) |
116.0 (4.57) |
9.0 (0.35) |
7.0 (0.28) |
1,391 (54.77) |
సగటు వర్షపాతపు రోజులు | 1.5 | 2.3 | 2.2 | 2.8 | 6.3 | 11.3 | 18.9 | 16.9 | 14.1 | 5.7 | 1.1 | 0.8 | 83.9 |
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) | 60 | 53 | 47 | 50 | 60 | 73 | 83 | 83 | 81 | 74 | 65 | 62 | 66 |
Source: NOAA (1971-1990)[4] |
క్ర.సం. నం. | పారిశ్రామిక ప్రాంతం పేరు | సేకరించిన భూమి (హెక్టార్లలో) | అభివృద్ధి చెందిన భూమి (హెక్టార్లలో) | ప్రతి చదరపు అడుగుకి (రూ. లో) ఉన్న రేటు | ప్లాట్ల సంఖ్య | కేటాయించిన సంఖ్య
ప్లాట్లు |
ఖాళీ ప్లాట్ల సంఖ్య | ఉత్పత్తిలో యూనిట్ల సంఖ్య |
---|---|---|---|---|---|---|---|---|
1 | దుమ్కా పారిశ్రామిక ప్రాంతం | 6.088 | 6.088 | 19.00 | 13 | 13 | 03 | 10 |
క్ర.సం. నం. | తల | యూనిట్ | ప్రత్యేకతలు |
---|---|---|---|
1 | నమోదైన పరిశ్రమలు | నం. | 2241 |
2 | మొత్తం పరిశ్రమలు | నం. | 2241 |
3 | నమోదిత మధ్యస్థ & పెద్ద పరిశ్రమలు | నం. | శూన్యం |
4 | సగటున ఒక్కో చిన్న తరహా పరిశ్రమలో పనిచేసే రోజువారీ కార్మికుల సంఖ్య (అంచనా) | నం. | 38 |
5 | పెద్ద, మధ్యతరహా పరిశ్రమలలో ఉపాధి | నం. | శూన్యం |
6 | పారిశ్రామిక ప్రాంతాల సంఖ్య | నం. | 1 |
2011 జూలైలో, దుమ్కాను కొత్తగా నిర్మించిన జసిది - దుమ్కా రైల్వే మార్గం ద్వారా జసిదిహ్‌కి అనుసంధానించారు. అప్పటి నుండి, నగరం రోడ్డుపై పెరుగుతున్న మూడు చక్రాల వాహనాలను చూసింది. 2015 జూన్ లో, దుమ్కా రాంపూర్హాట్ రైలు కూడా నడవడం మొదలైంది.
దుమ్కాకు పొరుగున ఉన్న నగరాలైన దేవఘర్, భాగల్పూర్, ధన్‌బాద్, రాంపూర్హాట్కు రోడ్డు సౌకర్యం. బస్సులు, ఇక్కడి ప్రజలు ఎక్కువగా వాడే రవాణా విధానం. ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ ఆపరేటర్లు రెండూ బస్సులు నడుపుతున్నారు. దుమ్కా బస్సులతో పొరుగు జిల్లాలకు మంచి కనెక్టివిటీని కలిగి ఉంది. దుమ్కా - రాంచీ, దుమ్కా- కోల్‌కతా ల మధ్య లగ్జరీ రాత్రి బస్సు సౌకర్యం ఉంది.[5]
సమీప విమానాశ్రయాలు:
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.