తూత్తుకూడి
From Wikipedia, the free encyclopedia
తూత్తుకూడి (గతంలో టుటికోరిన్) భారతదేశం, తమిళనాడు రాష్ట్రం, తూత్తుకూడి జిల్లాలోని ఓడరేవు నగరం.ఇది నగరపాలక సంస్థ ప్రధానకార్యాలయం, పారిశ్రామిక నగరం.ఈ నగరం బంగాళాఖాతంలోని కోరమాండల్ తీరంలో ఉంది. తూత్తుకూడి నగరం తూత్తుకూడి జిల్లాకు ప్రధాన కార్యాలయం. ఇది చెన్నైకి నైరుతిదిశలో 590 kilometres (367 miles), తిరువనంతపురంకు ఈశాన్యంగా 190 kilometres (118 miles), బెంగుళూరుకు ఆగ్నేయంగా 580 kilometres (360 miles) దూరంలో ఉంది. భారత పరిశ్రమల సమాఖ్య ప్రకారం, చెన్నై తర్వాత తమిళనాడులో తూత్తుకూడి రెండవ అత్యధిక మానవ అభివృద్ధి సూచికను కలిగి ఉంది.[3]తూత్తుకూడి నగరం తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ లిమిటెడ్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తుంది. నగరంలోని ప్రధాన విద్యా సంస్థలలో ప్రభుత్వ తూత్తుకూడి వైద్య కళాశాల, చేపల కళాశాల, పరిశోధనా సంస్థ, తమిళనాడు మారిటైమ్ అకాడమీ,[4] విఒ చిదంబరం కళాశాల, కామరాజ్ కళాశాల, అన్నా విశ్వవిద్యాలయం (తూత్తుకూడి క్యాంపస్), ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఉన్నాయి. [5] విఒ చిదంబరనార్ నౌకాశ్రయ సంస్థ భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారీ నౌకాశ్రయాలలో ఒకటి. తూత్తుకూడి "దక్షిణ భారతదేశంలో ఉద్భవిస్తున్న శక్తి, పరిశ్రమల కేంద్రం" గా గుర్తింపు పొందింది. [6]
Thoothukudi
Tuticorin (colonial) | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
City | |||||||||
Clockwise from the top Thoothukkudi Thermal Power Station, Tuticorin Airport, Pearl Oyster of Pearl City, Our Lady Of Snows Church, Tiruchendur Subramaniya Swamy Temple, Salt Pans in Thoothukudi and V.O. Chidambaranar Port Authority | |||||||||
Nickname(s): Pearl City, Salt Capital of Tamil Nadu and Sea Gateway of Tamil Nadu. | |||||||||
Coordinates: 8.764200°N 78.134800°E / 8.764200; 78.134800 | |||||||||
Country | India | ||||||||
State | Tamil Nadu | ||||||||
District | Thoothukudi | ||||||||
Former name | Tuticorin | ||||||||
Region | Pandya Nadu | ||||||||
Named for | Macaroon, Parotta, Pearl and Salt | ||||||||
Government | |||||||||
• Type | Municipal corporation | ||||||||
• Body | Thoothukudi City Municipal Corporation | ||||||||
• Corporation Commissioner | T. Charusree, I.A.S. | ||||||||
• Lok Sabha Constituency | Thoothukkudi | ||||||||
• State Assembly Constituency | Thoothukkudi | ||||||||
Area | |||||||||
• Metro | 90.663 km2 (35.005 sq mi) | ||||||||
• Rank | 8 | ||||||||
Elevation | 29 మీ (95 అ.) | ||||||||
Population (2011)[1] | |||||||||
• City | 2,37,830 | ||||||||
• Rank | 8th in Tamil Nadu | ||||||||
• Metro | 4,11,628 [2] | ||||||||
Demonym | Thoothukudian | ||||||||
Languages | |||||||||
• Official | Tamil | ||||||||
Time zone | UTC+5:30 (IST) | ||||||||
PIN | 628 0xx | ||||||||
Telephone code | +91-461 | ||||||||
Vehicle registration | TN-69, TN-92,TN-96 | ||||||||
Literacy | 92.10[2] | ||||||||
Climate | BSh (Köppen) | ||||||||
Coastline | 40 kilometres (25 mi) | ||||||||
Website |
2011 భారత జనాభా లెక్కలు ప్రకారం 2,37,830 జనాభాను కలిగి ఉంది. పట్టణ సమ్మేళనం జనాభా 4,10,760 కలిగి ఉంది. నగర పరిధి 353.07 km2 (136.32 sq mi) విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దీని పరిపాలన తూత్తుకూడి నగరపాలస సంస్థ ద్వారా సాగుతుంది. తూత్తుకూడికి రోడ్డు మార్గాలు ప్రధాన రవాణా మార్గం, నగరంలో రైలు, విమాన, సముద్ర రవాణా సౌకర్యాలు ఉన్నాయి.