![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/2c/DAVID_WARNER_%252811704782453%2529.jpg/640px-DAVID_WARNER_%252811704782453%2529.jpg&w=640&q=50)
డేవిడ్ వార్నర్
ఆస్ట్రేలియా దేశపు క్రికెట్ క్రీడాకారుడు / From Wikipedia, the free encyclopedia
డేవిడ్ ఆండ్రూ వార్నర్ (జననం 1986 అక్టోబరు 27) ఆస్ట్రేలియన్ అంతర్జాతీయ క్రికెటరు, పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఆస్ట్రేలియన్ జాతీయ జట్టు మాజీ కెప్టెన్, మాజీ టెస్టు వైస్ కెప్టెన్. ఎడమచేతి వాటం ఓపెనింగ్ బ్యాటరు. వార్నర్ 132 సంవత్సరాలలో ఫస్ట్-క్లాస్ క్రికెట్లో అనుభవం లేకుండా ఏ ఫార్మాట్లోనైనా జాతీయ జట్టుకు ఎంపికైన మొట్ట మొదటి ఆస్ట్రేలియా క్రికెటర్. అతను న్యూ సౌత్ వేల్స్ తరపున ఆడుతున్నాడు. ప్రస్తుతం దేశీయ క్రికెట్లో ఢిల్లీ క్యాపిటల్స్, సిడ్నీ థండర్ తరపున ఆడుతున్నాడు. వార్నర్ 2015 క్రికెట్ ప్రపంచ కప్, 2023 ICC వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్, 2021 T20 ప్రపంచ కప్‌లో విజయం సాధించిన ఆస్ట్రేలియా జట్టులో ప్రముఖ సభ్యుడు. 2021 టి20 కప్‌లో అతని ప్రదర్శనల ఫలితంగా అతను ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపికయ్యాడు.
![]() 2014 లో వార్నర్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | డేవిడ్ ఆండ్రూ వార్నర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | (1986-10-27) 1986 అక్టోబరు 27 (వయసు 37) పాడింగ్టన్, న్యూ సౌత్ వేల్స్, ఆస్ట్రేలియా | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | Lloyd,[1] the Reverend, Bull,[2] Pocket Size Dynamite | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 170 cమీ. (5 అ. 7 అం.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | Right arm లెగ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | Opening batter | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 426) | 2011 డిసెంబరు 1 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2023 జూలై 27 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్డే (క్యాప్ 170) | 2009 జనవరి 18 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్డే | 2023 సెప్టెంబరు 7 March - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్డేల్లో చొక్కా సంఖ్య. | 31 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 32) | 2009 జనవరి 11 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2022 నవంబరు 4 - Afghanistan తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
T20Iల్లో చొక్కా సంఖ్య. | 31 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2006/07–2020/21 | New South WaIes | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2009–2013, 2022–present | ఢిల్లీ డేర్ డెవిల్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2009 | డర్హమ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2010 | మిడిల్సెక్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2010/11 | నార్దర్న్ డిస్ట్రిక్ట్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2011/12; 2013/14; 2022/23 | సిడ్నీ థండర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2012/13 | Sydney Sixers | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2014–2021 | సన్ రైజర్స్ హైదరాబాద్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018 | St Lucia Stars | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2019 | Sylhet Sixers | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 20 June 2023 |
2017 జనవరిలో, అతను అలన్ బోర్డర్ మెడల్‌ను ఒకటి కంటే ఎక్కువసార్లు గెలుచుకున్న నాల్గవ ఆటగాడు అయ్యాడు. వరుసగా రెండు సంవత్సరాలలో కూడా అవార్డును గెలుచుకున్నాడు. 2017 సెప్టెంబరు 28న, అతను తన 100వ వన్డేలో ఆడాడు. అతని 100వ వన్డేలో సెంచరీ చేసిన ఆస్ట్రేలియా తరపున మొదటి బ్యాటరుగా, 8వ బ్యాటరుగా నిలిచాడు.
2018 మార్చిలో, దక్షిణాఫ్రికాతో జరిగిన తమ టెస్టు సిరీస్‌లోని మూడవ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు బాల్ ట్యాంపరింగ్‌పై ప్రాథమిక విచారణ తర్వాత, ఆటకు చెడ్డపేరు తెచ్చినందుకు అతనిపై అభియోగాలు మోపబడి సస్పెండయ్యాడు. [3] 2018 మార్చి 28న జరిగిన బోర్డ్ మీటింగ్ తరువాత, క్రికెట్ ఆస్ట్రేలియా వార్నర్‌ని ఆస్ట్రేలియాలోని అన్ని అంతర్జాతీయ, దేశీయ క్రికెట్ల నుండి ఒక సంవత్సరం పాటూ, ఎటువంటి నాయకత్వ పదవులు పొందకిఉండా శాశ్వతంగానూ నిషేధించింది. [4]
2019 నవంబరులో, వార్నర్ పాకిస్తాన్‌పై 335 నాటౌట్‌తో ఆస్ట్రేలియా టెస్టు బ్యాట్స్మెన్లలో రెండవ అత్యధిక వ్యక్తిగత స్కోరును సాధించాడు. గార్ఫీల్డ్ సోబర్స్, మార్క్ టేలర్, వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత పాకిస్తాన్‌పై టెస్టు మ్యాచ్ ట్రిపుల్ సెంచరీ చేసిన నాల్గవ వ్యక్తిగా నిలిచాడు. [5]