డార్జిలింగ్ జిల్లా
వెస్ట్ బెంగాల్ లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
డార్జిలింగ్ జిల్లా, తూర్పు భారతదేశం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ఉత్తరాన హిమాలయాల దిగువన ఉన్నజిల్లా. డార్జిలింగ్ పట్జణం జిల్లా కేంద్రంగాఉంది. ఇది కొండప్రాంతం. డార్జిలింగ్ తేనీరు పంటకు ప్రసిద్ధి చెందింది. జిల్లాలోని మూడు ప్రధాన పట్టణాలుగా ఉన్న కుర్సియోంగ్, సిలిగురి, మిరిక్ జిల్లాకు ఉపవిభాగ ప్రధాన కేంద్రాలు. వీటిలో కాలింపాంగ్ ఉప విభాగాలలో ఒకటి. 2017 ఫిబ్రవరి 14న అధికారికంగా ప్రత్యేక కాలింపాంగ్ జిల్లాగా ఏర్పడింది.[2] భౌగోళికంగా, జిల్లాను కొండలు, మైదానాలు అనే రెండు విస్తృత విభాగాలుగా ఉంటుంది. జిల్లాలోని మొత్తం కొండప్రాంతం గూర్ఖాలాండ్ ప్రాదేశిక పరిపాలన పరిధిలోకి వస్తుంది. దీని పరిపాలనను పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం క్రింద ఏర్పాటైన స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక సెమీ పరిపాలనా సంస్థ ద్వారా జరుగుతుంది. కుర్సియోంగ్, మిరిక్, కాలింపాంగ్ జిల్లా మూడు కొండ ఉప విభాగాలను సమీకరిస్తుంది. సిలిగురి ఉపవిభాగంలో ఉన్న డార్జిలింగ్ హిమాలయాల పాదాలను టెరై అని పిలుస్తారు. జిల్లా ఉత్తర సరిహద్దులో సిక్కిం, దక్షిణ సరిహద్దులో బీహార్ రాష్ట్రం లోని కిషన్‌గంజ్ జిల్లా, ఆగ్నేయంలో బంగ్లాదేశ్‌లోని పంచగఢ్ జిల్లా, తూర్పున కాలింపాంగ్, జల్పాయిగురి జిల్లాలు, పశ్చిమాన, తూర్పున నేపాల్ ప్రావిన్స్ నెం.1 ఉన్నాయి.డార్జిలింగ్ జిల్లాఉత్తరంనుండిదక్షిణం వరకు 18 miles (29 km), తూర్పునుండిపడమర వరకు 16 miles (26 km) విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. 2011 నాటికి, పశ్చిమబెంగాల్ లోని 19 జిల్లాలలో దక్షిణ్ దినాజ్‌పూర్ తర్వాత ఇది రెండవ అతితక్కువ జనాభా కలిగిన జిల్లాగా నమోదైంది.[3]
డార్జిలింగ్ జిల్లా | |||||||
---|---|---|---|---|---|---|---|
District | |||||||
Clockwise from top-left: Tea estate in Darjeeling, Darjeeling Himalayan Railway, Ghum Monastery, View of Kangchenjunga from Tiger Hill, View of Siliguri | |||||||
Country | India | ||||||
రాష్ట్రం | West Bengal | ||||||
Division | Jalpaiguri | ||||||
ముఖ్యపట్టణం | Darjeeling | ||||||
Government | |||||||
• Lok Sabha constituencies | Darjeeling (shared with Kalimpong district) | ||||||
• Vidhan Sabha constituencies | Darjeeling, Kurseong, Matigara-Naxalbari, Siliguri, Phansidewa | ||||||
Area | |||||||
• Total | 2,092.5 km2 (807.9 sq mi) | ||||||
Population (2011) | |||||||
• Total | 15,95,181 | ||||||
• Density | 760/km2 (2,000/sq mi) | ||||||
• Urban | 7,27,963 | ||||||
Demographics | |||||||
• Literacy | 79.56% (excluding 0–6 population) | ||||||
• Sex ratio | 970 | ||||||
Time zone | UTC+05:30 (భా.ప్రా.కా) | ||||||
Major highways | NH 31, NH 55 | ||||||
HDI (2004) | 0.650[1] (medium) | ||||||
Website | http://darjeeling.gov.in/ |