జయ బచ్చన్
భారతీయ రాజకీయవేత్త మరియు నటి / From Wikipedia, the free encyclopedia
జయ బాదురీ బచ్చన్ (జన్మ నామం జయ బాదురీ; జననం 1948 ఏప్రిల్ 9) భారతీయ రాజకీయ నాయకురాలు, హిందీ సినీ నటి. ఈమె ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, పూణే పూర్వవిద్యార్థి. ఈమె అమితాబ్ బచ్చన్ భార్య, శ్వేత నంద బచ్చన్, అభిషేక్ బచ్చన్ లకు తల్లి. ఈమె తన నటనకు గానూ క్రియాశీలకంగా ఉన్నన్ని రోజులూ ఎందరో మన్ననలు పొందింది. [1][2] 1963లో వచ్చిన సత్యజిత్ రే సినిమా మహానగర్లో తొలిసారి ఒక యువతిగా నటించింది. ఆపై 1971లో గుడ్డీ అనే సినిమాలో పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. ఉపహార్ (1971), కోషిశ్ (1972), కోరా కాగజ్ (1974) సినిమాలలో ఈమె నటన అపూర్వం. జంజీర్ (1973), అభిమాన్ (1973), చుప్కే చుప్కే (1975), మిలీ (1975), శోలే (1975) సినిమాలలో భర్త అమితాబ్ సరసన నటించింది. పెళ్ళి, పిల్లల తరువాత ఆమె సినిమాలకు పూర్తిగా దూరమయి పోయారు. మధ్యలో 1981లో సిల్సిలా అనే సినిమాలో కనిపించినా, నటనకు దూరంగానే ఉన్నారు. 1998 లో తిరిగి తెరంగేట్రం చేసారు. గోవింద్ నిహ్లానీ తీసిన హజార్ చౌరాసీ కీ మాఁ అన్న సినిమాలో నటించారు. అప్పటి నుండి ఎన్నో సినిమాలలో తల్లి పాత్రలలో కనిపించారు. ఈ సినిమాలలో నటనకు గానూ ఈమెకు ఎన్నో బిరుదులు, అవార్డులు అందాయి. ఈమె మొత్తం నటన జీవితంలో ఇప్పటి వరకూ 9 ఫిల్మ్ ఫేర్ అవార్డులు, (3 అత్యుత్తమ నటి, 3 అత్యుత్తమ సహాయ నటితో సహా). 2007లో ఫిల్మ్ ఫేర్ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. 1992లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అందుకున్నారు.
జయ బచ్చన్ | |
---|---|
![]() | |
జననం | జయ బాదురీ (బహాదురీ కి వికృతం) (1948-04-09) 1948 ఏప్రిల్ 9 (వయసు 76) |
వృత్తి | నటి, రాజకీయ నాయకురాలు |
క్రియాశీల సంవత్సరాలు | 1963, 1971–1981, 1998–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | అమితాబ్ బచ్చన్ |
పిల్లలు | శ్వేతా బచ్చన్ నందా అభిషేక్ బచ్చన్ |