జమీందార్ వి.మధుసూదనరావు దర్శకత్వంలో, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణకుమారి, నాగభూషణం, లింగమూర్తి ముఖ్యపాత్రల్లో నటించిన 1965 నాటి తెలుగు చలనచిత్రం. తమ్మారెడ్డి కృష్ణమూర్తి ఈ సినిమాని నిర్మించారు. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన జమీందార్ చిత్రం మంచి విజయాన్ని సాధించింది.ఈ సినిమా జనవరి 7, 1966న విడుదలయింది.[1]

త్వరిత వాస్తవాలు దర్శకత్వం, నిర్మాణం ...
మూసివేయి

చిత్రకథ

శేషు అనబడే శేషగిరిరావు (అక్కినేని నాగేశ్వరరావు), సరోజ (కృష్ణకుమారి) ఒక పిక్నిక్ లో కలుసుకుంటారు, వారి పరిచయం ప్రేమగా మారుతుంది. శేషు అన్నావదినెలు సుబ్బారావు (గుమ్మడి), లక్ష్మి (పి.హేమలత)లకు శేషును అదుపుచెయ్యడం ఓ పెద్ద పని. వారికి శేషును అదుపుచేస్తూ సరదాగా కాలంగడపడంలోనే సంతోషం. నరహరి (ముదిగొండ లింగమూర్తి), రాజారెడ్డి (నాగభూషణం) యుద్ధంలో పనిచేసే రోజుల్లో ప్రభుత్వసొమ్ము రూ.20లక్షలు ఒక స్థావరం నుంచి మరోదానికి తరలిస్తున్నప్పుడు, అదనుచూసి దొంగిలిస్తారు. ప్రభుత్వోద్యోగం నుంచి ఇద్దరిలో ముందు రిటైరైన నరహరి కాంట్రాక్టరు అవతారమెత్తుతాడు. భార్య (సూర్యకాంతం), కూతురు సరోజలతో సంపదను అనుభవిస్తూ సుఖంగా జీవిస్తూంటాడు. ఈలోగా రాజారెడ్డి కూడా ఉద్యోగం నుంచి రిటైరై తానూ కాంట్రాక్టులు, వ్యాపారాలు చేపడదామని డబ్బు ఎక్కడ దాచావంటూ నరహరిని అడుగుతాడు. తనకేమీ తెలియదని నరహరి తెగేసి చెప్తాడు, అయినా దాని సంగతి తేల్చాకే కదులుతానంటూ రాజారెడ్డి ఇంట్లో నరమరి దిగబడతాడు. ఇంతలో ప్రేమించుకున్న శేషు-సరోజల పెళ్ళికి నిశ్చితార్థం జరుగుతుంది. ఆ సమయంలో అప్పటికే శేషుకు వేరే అమ్మాయితో సంబంధం ఉన్నట్టు, ఆమెకు కడుపుచేసి వదిలేసినట్టు ఓ అన్నచెల్లెళ్ళను పురమాయించి అల్లరిచేయిస్తాడు రాజారెడ్డి. ఇదంతా నిజంకాదని శేషు చెప్పినా వినకుండా అవన్నీ నమ్మి సరోజతో సహా అందరూ అతన్ని అసహ్యించుకుని గెంటేస్తారు.

అదేరోజు రాత్రి రాజారెడ్డి నరహరిని కత్తితో హతమార్చి ఆ నిందను శేషు మీద తోసెయ్యబోతే, అతన్ని కాపాడేందుకు అతని అన్న సుబ్బారావు కేసు తననెత్తిన వేసుకుంటాడు. ఆపైన నేరాన్ని కనుక్కునే క్రైమ్ థ్రిల్లర్ గా సాగుతుంది సినిమా. సినిమా మలుపులు తిరిగి క్లైమాక్సుకల్లా శేషగిరిరావు ప్రభుత్వం నియమించిన సీఐడీ అనీ, పోయిన ఇరవైలక్షల రూపాయలు వెతికేందుకు నియమించిందని తెలుస్తుంది. చివరకి అసలు నేరస్థులు శిక్షింపబడి ఇరవైలక్షల రూపాయలూ ప్రభుత్వానికి స్వాధీనం కావడమూ, హీరోహీరోయిన్ల మధ్య కలతలు తొలిగిపోయి కలిసిపోవడంతో కథ ముగుస్తుంది.

నటీనటులు

స్పందన

ఈ చిత్రం మాస్ ని కూడా ఆకట్టుకుని ఘన విజయం సాధించింది.[2]

పాటలు

  1. అమ్మాయిగారు చాల చాల కోపంగా - టి.ఆర్.జయదేవ్, పి.సుశీల, బి.వసంత, ఘంటసాల బృందం . రచన: దాశరథి.
  2. ఆ నవ్వుల కోసమే నేను కలలు కన్నాను ఆ నడకల కోసమే - ఘంటసాల,సుశీల . రచన: సి. నారాయణ రెడ్డి.
  3. కస్తూరి రంగ రంగా - చిన్నారి కావేటి రంగ రంగా (జోలపాట) - ఘంటసాల . రచన: కొసరాజు.
  4. చుక్కలు పొడిచేవేళ అహ మక్కువ తీరేవేళ ఆడపిల్లే పొడుపుకథ పొడవాలి - రచన: ఆరుద్ర[3] ; గానం: పి.సుశీల, ఘంటసాల
  5. నీతోటే ఉంటాను శేషగిరి బావా నీ మాటే వింటాను మాటకారి బావా - పి.సుశీల, రచన: సి. నారాయణ రెడ్డి
  6. నేనే నేనే లేత లేత పూలబాలను తేనెటీగ సోకినా తాళజాలను - రచన: ఆరుద్ర; గానం: ఎస్. జానకి
  7. పలకరించితేనే ఉలికిఉలికి పడతావు నిన్ను ప్రేమిస్తే ఏంచేస్తావు - ఘంటసాల, పి.సుశీల . రచన: సి. నారాయణ రెడ్డి.
  8. విద్యా విజ్ఞాన చంద్రికల్(పద్యం), మాధవపెద్ది.

మూలాలు

వనరులు

బయటి లింకులు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.