రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్
From Wikipedia, the free encyclopedia
రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ తెలుగు సినీ నిర్మాణ సంస్థ. దీనిని తమ్మారెడ్డి కృష్ణమూర్తి స్థాపించారు. విశ్వకవి రవీంద్రుని పట్ల గల అభిమానంతో అతడు రచించిన ‘గీతాంజలి’లోని ఓ గీత మకుటాన్ని ‘విశ్వవిజ్ఞాన చంద్రికలు వెలయుచోట, నిర్భయముగా స్వేచ్ఛాగీతి నిలుపుచోట, మానవుడు పరిపూర్ణుడై మలయుచోట, మాతృదేశమా అచటచే మనగదమ్మా’అని రచయిత నార్ల చిరంజీవిచే తర్జుమా చేయించి, దీనిని మోనోగ్రాఫ్‌పై బ్యాక్‌గ్రౌండ్‌గా, మాధవపెద్ది సత్యంచే పాడించి, విన్పించారు. చేతిలో పనిముట్టు ధరించిన కార్మికుని చిత్రం, ఈ చరణం, రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ ప్రత్యేకతగా నిలిచాయి[1].

నిర్మించిన చిత్రాలు[2]
- లక్షాధికారి (1963)
- జమీందార్ (1965)
- బంగారు గాజులు (1968)
- ధర్మదాత (1970)
- దత్తపుత్రుడు (1972)
- డాక్టర్ బాబు (1973)
- సిసింద్రీ చిట్టిబాబు (1971)
- చిన్ననాటి కలలు (1975)
- లవ్ మారేజి
- ఇద్దరు కొడుకులు
- అమ్మానాన్న (1976)
మూలాలు
బయటి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.