![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/1/19/Flag_of_Ghana.svg/langte-640px-Flag_of_Ghana.svg.png&w=640&q=50)
ఘనా
From Wikipedia, the free encyclopedia
ఘనా (ఆంగ్లం :The Republic of Ghana) అధికారిక నామం రిపబ్లిక్ ఆఫ్ ఘనా, పడమటి ఆఫ్రికాలోని ఒక దేశం. దీని పశ్చిమసరిహద్దులో ఐవరీకోస్ట్, ఉత్తరసరిహద్దులో బుర్కినాఫాసో, తూర్పున టోగో, దక్షిణసరిహద్దులో గినియా అఖాతం ఉన్నాయి. ఘనా అంటే సోనింకే భాషలో యోధుడైన రాజు అని అర్ధం. "[3] 1957 లో యునైటెడ్ కింగ్ డం నుండి స్వాతంత్ర్యం పొందినది.[4] ఇది పశ్చిమ ఆఫ్రికా గినియా అఖాతం, అట్లాంటికు మహాసముద్రం సమీపంలో ఉన్న ఒక దేశం. దేశవైశాల్యం 2,38,535 చ.కి.మీ.[3]
రిపబ్లిక్ ఆఫ్ ఘనా |
||||
---|---|---|---|---|
|
||||
నినాదం "Freedom and Justice" |
||||
జాతీయగీతం |
||||
![]() |
||||
రాజధాని అతి పెద్ద నగరం | Accra 5°33′N 0°15′W | |||
అధికార భాషలు | ఆంగ్లం | |||
ప్రజానామము | Ghanaian | |||
ప్రభుత్వం | Constitutional presidential republic | |||
- | President | John Atta Mills | ||
- | Vice-President | John Dramani Mahama | ||
Independence | from the United Kingdom | |||
- | Declared | 6 March 1957 | ||
- | Republic | 1 July 1960 | ||
- | Constitution | 28 April 1992 | ||
- | జలాలు (%) | 3.5 | ||
జనాభా | ||||
- | 2008 అంచనా | 23,000,000[1] (48th) | ||
జీడీపీ (PPP) | 2008 అంచనా | |||
- | మొత్తం | $35 billion[2] | ||
- | తలసరి | $1,500[2] | ||
జీడీపీ (nominal) | 2008 అంచనా | |||
- | మొత్తం | $18 billion[2] | ||
- | తలసరి | $800[2] | ||
మా.సూ (హెచ్.డి.ఐ) (2007) | ![]() |
|||
కరెన్సీ | Ghanaian cedi (GHS ) |
|||
కాలాంశం | GMT (UTC0) | |||
- | వేసవి (DST) | GMT (UTC0) | ||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .gh | |||
కాలింగ్ కోడ్ | +233 |
11 వ శతాబ్దంలో ప్రస్తుత ఘనా భూభాగంలో మొదటి శాశ్వత రాజ్యం స్థాపించబడింది. శతాబ్దాలుగా ఈప్రాంతంలో అనేక రాజ్యాలు, సామ్రాజ్యాలు ఉద్భవించాయి. వీటిలో " అశాంతి రాజ్యం " అత్యంత శక్తివంతమైనది.[5] 15 వ శతాబ్దం నుండి అనేక ఐరోపా శక్తులు వాణిజ్య హక్కుల కోసం ఈ ప్రాంతం కొరకు పోటీ పడ్డాయి. 19 వ శతాబ్దం చివరి నాటికి బ్రిటిషు వారు తీరంపై నియంత్రణను సాధించారు. శతాబ్ధకాలం కొనసాగిన స్థానిక ప్రతిఘటన తరువాత, ఘనా ప్రస్తుత సరిహద్దులు (1900 ల నాటికి) బ్రిటిషు గోల్డు కోస్టుగా స్థాపించబడ్డాయి. 1957 మార్చి 6 న యునైటెడు కింగ్డం నుండి స్వతంత్రం పొందింది.[6][7][8]
ఘనా జనాభా సుమారు 30 మిలియన్లు [9] ఘనాలో వివిధ రకాల జాతి, భాషా, మత సమూహాలను కలిగి ఉంది.[10] 2010 జనాభా లెక్కల ఆధారంగా జనాభాలో 71.2% క్రైస్తవులు, 17.6% ముస్లింలు, 5.2% మంది సాంప్రదాయ విశ్వాసాలను పాటించే ప్రజలు ఉన్నారు.[11] తీరప్రాంత సవన్నా నుండి ఉష్ణమండల వర్షారణ్యాలతో ఘనా భౌగోళిక, పర్యావరణ వైవిధ్యం కలిగి ఉంటుంది.
ఘనా అధ్యక్షుడి నేతృత్వంలోని ఏకీకృత రాజ్యాంగ ప్రజాస్వామ్యం.[12] ఘనా పెరుగుతున్న ఆర్థిక ప్రయోజనాలు, ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థ దీనిని పశ్చిమ ఆఫ్రికాలో ప్రాంతీయ శక్తిగా మార్చాయి.[13] ఇది అలీన ఉద్యమదేశాలు, ఆఫ్రికా సమాఖ్య, ఎకనామికు కమ్యూనిటీ ఆఫ్ వెస్టు ఆఫ్రికన్ స్టేట్సు (ECOWAS), గ్రూప్ ఆఫ్ 24 (G24), కామన్వెల్తు నేషన్సు సభ్యదేశంగా ఉంది.[14]