కువైట్
From Wikipedia, the free encyclopedia
కువైత్ /kuːˈweɪt/ ( listen) (అరబ్బీ: دولة الكويت Dawlat al-Kuwait), అధికారికంగా " స్టేట్ ఆఫ్ కువైత్ " పశ్చిమాసియా దేశాలలో ఒక దేశం. ఇది తూర్పు అరేబియా సరిహద్దులో పర్షియన్ గల్ఫ్ చివరన ఉంది. దేశ సరిహద్దులో ఇరాక్, సౌదీ అరేబియా దేశాలు ఉన్నాయి. 2014 గణాంకాలు అనుసరించి కువైత్ జనసంఖ్య 4.2 మిలియన్లు. వీరిలో 1.3 మిలియన్లు కువైత్ ప్రజలు ఉండగా 2.9 మిలియన్లు బహిష్కృత ప్రజలు ఉన్నారు .[1] 1938లో కువైత్‌లో ఆయిల్ నిలువలు వెలువడ్డాయి. 1946 నుండి 1982 దేశం బృహత్తర ప్రణాళికలో ఆధునికీకరణ చేయబడింది. 1980 లో కువైత్ భౌగోళిక అస్థిరత, ఆర్థిక సంక్షోభం ఎదుర్కొన్నది. 1990 లో కువైత్ మీద ఇరాక్ దాడి చేసింది. 1991లో యునైటెడ్ స్టేట్స్ నాయకత్వంలో నడిచిన సైనికుల విజయంతో ఇరాకీ యుద్ధం ముగింపుకు వచ్చింది. యుద్ధం ముగింపుకువచ్చిన తరువాత కువైత్ తిరిగి ఇంఫ్రాస్ట్రక్చర్, ఆర్థికరగం పునరుద్ధరణ చేసింది.
دولة الكويت Dawlat al-Kuwayt State of Kuwait |
||||||
---|---|---|---|---|---|---|
|
||||||
జాతీయగీతం అల్ నషీద్ అల్ వతని |
||||||
రాజధాని | కువైట్ నగరం 29°22′N 47°58′E | |||||
అతి పెద్ద నగరం | రాజధాని | |||||
అధికార భాషలు | అరబ్బీ | |||||
ప్రభుత్వం | రాజ్యాంగపర వారసత్వ ఎమిరేట్1 | |||||
- | ఎమీర్ | సబా అల్ అహ్మద్ అల్ జాబిర్ అల్ సబా | ||||
- | ప్రధానమంత్రి | నాసిర్ అల్ ముహమ్మద్ అల్ అహ్మద్ అల్ సబా | ||||
స్వతంత్రం | ||||||
- | యునైటెడ్ కింగ్ డం నుండి | జూన్ 19, 1961 | ||||
విస్తీర్ణం | ||||||
- | మొత్తం | 17,818 కి.మీ² (157వది) 6,880 చ.మై |
||||
- | జలాలు (%) | negligible | ||||
జనాభా | ||||||
- | 2006 అంచనా | 3,100,0002 (లభ్యం లేదు) | ||||
- | జన సాంద్రత | 131 /కి.మీ² (68వది) 339 /చ.మై |
||||
జీడీపీ (PPP) | 2005 అంచనా | |||||
- | మొత్తం | $88,7 బిలియన్లు (n/a) | ||||
- | తలసరి | $29,566 (n/a) | ||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2004) | 0.871 (high) (33వది) | |||||
కరెన్సీ | కువైటీ దీనార్ (KWD ) |
|||||
కాలాంశం | AST (UTC+3) | |||||
- | వేసవి (DST) | (not observed) (UTC+3) | ||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .kw | |||||
కాలింగ్ కోడ్ | +965 | |||||
1 | Nominal. | |||||
2 | Figure includes approximately two million non-nationals (2005 estimate). |
ఆయిల్ నిలువల కారణంగా కువైత్ " అత్యున్నత ఆర్ధికాభివృద్ధి చెందిన దేశంగా " అభివృద్ధి చెందింది. కువైత్ దీనార్ ప్రపంచంలో అత్యంత విలువైన కరెంసీలలో ఒకటిగా గుర్తించబడుతుంది.[2] వరల్డ్ బ్యాంక్ అభిప్రాయం అనుసరించి కువైత్ తలసరి జి.డి.పి. అంతర్జాతీయస్థాయిలో 4వ స్థానంలో ఉంది. కువైత్ రాజ్యాంగం 1962 లో రూపొందించబడింది. తరువాత కువైత్ ఈ ప్రాంతంలో రాజకీయంగా ప్రభావితమై ఉంది.[3][4][5] సమీపకాలంలో రాజకీయ అస్థిరత దేశ ఆర్థికరగం మీద ప్రభావం చూపుతుంది.[6][7]