కురుంగ్ కుమే జిల్లా
అరుణాచల్ ప్రదేశ్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
అరుణాచల్ ప్రదేశ్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
కురుంగ్ కుమే జిల్లా, భారతదేశం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా.[2] జిల్లా కేంద్రం కొలోరియాంగ్.
కురుంగ్ కుమే జిల్లా | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | అరుణాచల ప్రదేశ్ |
ముఖ్య పట్టణం | కోలోరియాంగ్ |
జనాభా (2011) | |
• మొత్తం | 89,717[1] |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 50.7%[1] |
• లింగ నిష్పత్తి | 1029[1] |
కురుంగ్, కుమే పదాల కలయికతో ఈ జిల్లాకీ పేరు వచ్చింది. ఈ జిల్లా నుండి కురుంగ్, కుమే నదులు ప్రవహిస్తూ ఉండడమే ఇందుకు కారణం. పురాణకథనం అనుసరించి కురుంగ్, కుమే నదులు అక్కచెల్లెళ్ళని కురుంగ్ వారి తల్లితండ్రులల అనుమతి లేకుండా వివాహం చేసుకొందని. వారి తల్లితండ్రులు ఆమెను శపిస్తూ ఆమె మీద బూడిదను చల్లారని అందుకనే అది ఉగ్రంగా బూడిద వర్ణంలో ప్రవహిస్తుందని, కుమే తన తల్లి తండ్రుల అనుమతితో వివాహం చేసుకుని వారి దీవెనలందుకున్నదని అందుకే అది స్వచ్ఛంగా నెమ్మదిగా ప్రవహిస్తుందని ఇక్కడి ప్రజలు విశ్వసిస్తున్నారు.
1914లో ప్రస్తుత జిల్లా ప్రాంతం ఒకప్పుడి ఈశాన్య సరిహద్దు భాగంగా ఉండేది. 1954లో ఇది సుబంసిరి విభాగం సరిహద్దుగా మారింది. తరువాత ఇది దిగువ సుబన్సిరి జిల్లా అయింది. 2001 ఏప్రిల్ 1 దిగువ సుబంసిరి జిల్లలో కొంత భూభాగం వేరు చేసి ఈ జిల్లా రూపొందించబడింది.[3]
కురుంగ్కుమే జిల్లాలో 3 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి: పాలిన్, నియాపిన్, కొలోరియాంగ్. అరుణాచల్ పశ్చిమ లోక్సభ నియోజకవర్గానికి చెంది ఉన్నాయి.[4]
2011 భారత జనాభా లెక్కల ప్రకారం అరుణాచల్ ప్రదేశ్లోని కురుంగ్ కుమే జిల్లాలో మొత్తం జనాభా 92,076. వీరిలో 45,318 మంది పురుషులుకాగా, 46,758 మంది స్త్రీలు ఉన్నారు.[5] జిల్లా పరిధిలో మొత్తం 15,037 కుటుంబాలు ఉన్నాయి. జిల్లా సగటు లింగ నిష్పత్తి 1,032.జిల్లా మొత్తం జనాభాలో 2.5% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, 97.5% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సగటు అక్షరాస్యత రేటు 69.4% కాగా గ్రామీణ ప్రాంతాల్లో 48.2%. అలాగే కురుంగ్ కుమే జిల్లాలోని పట్టణ ప్రాంతాల లింగ నిష్పత్తి 882 కాగా గ్రామీణ ప్రాంతాల వారిది 1,036గా ఉంది కురుంగ్ కుమే జిల్లాలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 16988, ఇది మొత్తం జనాభాలో 18%. 0-6 సంవత్సరాల మధ్య 8568 మంది మగ పిల్లలు ఉండగా, 8420 మంది ఆడ పిల్లలు ఉన్నారు. బాలల లింగ నిష్పత్తి 983, కురుంగ్ కుమే జిల్లా మొత్తం అక్షరాస్యత రేటు 48.75%. కురుంగ్ కుమే జిల్లాలో పురుషుల అక్షరాస్యత రేటు 44.7%, స్త్రీల అక్షరాస్యత రేటు 34.96%.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.