ఇటానగర్
అరుణాచల్ ప్రదేశ్ యొక్క రాజధాని, భారతదేశం From Wikipedia, the free encyclopedia
అరుణాచల్ ప్రదేశ్ యొక్క రాజధాని, భారతదేశం From Wikipedia, the free encyclopedia
ఇటానగర్, భారతదేశం లోని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని, అతిపెద్ద నగరం. అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ స్థానం, అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వ, పరిపాలనా కేంద్రస్థానం. ఇటానగర్‌లో ఒక భాగమైన నహర్లాగన్ వద్ద గౌహతి హైకోర్టు శాశ్వత బెంచ్ ఇతరాలు ఉన్నాయి.
Itanagar | |
---|---|
Capital City | |
Coordinates: 27°06′00″N 93°37′12″E | |
Country | India |
రాష్ట్రం | Arunachal Pradesh |
జిల్లా | Papum Pare |
Government | |
• Body | Itanagar Municipal Council |
Elevation | 320 మీ (1,050 అ.) |
జనాభా (2011) | |
• Total | 59,490 |
Time zone | UTC+5:30 (IST) |
Vehicle registration | AR-01, AR-02, ARX |
ఇటానగర్ 27.1°N 93.62°E వద్ద ఉంది. ఇది సముద్ర మట్టానికి సుమారు 320 మీటర్ల సగటు ఎత్తులో ఉంది.
ఇటానగర్‌లో తేమతో కూడిన ఉపఉష్ణమండల వాతావరణం ఉంటుంది. శీతాకాలం తేలికపాటి పొడి వాతావరణం, వేసవికాలం వెచ్చని, తేలికపాటి తడి వాతావరణంతో కూడి ఉంటుంది.
ఇటానగర్‌లో నైషి, ఆది, అపాటాని, టాగిన్, గాలో, నైషిలు,ఇతర ఆదిమవాసుల అనేక తెగలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు.
గువహతి నుండి నహర్లాగన్ (ఇటానగర్) వరకు నిరంతరం హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉంది.2019 ఫిబ్రవి 19 న హోలోంగిలోని గ్రీన్‌ఫీల్డ్ ఇటానగర్ విమానాశ్రయానికి ప్రధాని నరేంద్ర మోడీ పునాదిరాయి వేశారు.[1] జాతీయ రహదారి 415 ఇటానగర్ను అరుణాచల్ ప్రదేశ్, దేశంలోని ఇతర ప్రాంతాలతో కలుపుతుంది. గువహటి, లోక్ప్రియా గోపినాథ్ బోర్డోలోయి అంతర్జాతీయ విమానాశ్రయం నుండి నిరంతరం బస్సు, ఇన్నోవా సేవలు అందుబాటులో ఉన్నాయి.ఇటానగర్ నుండి సుమారు 15 కి.మీ.దూరంలో నహర్లాగన్ రైల్వే స్టేషన్ సమీపంగా ఉంది. రైల్వే స్టేషన్ నుండి ఇటానగర్ వరకు టాక్సీ,, బస్సు సర్వీసులు సులభంగా లభిస్తాయి. డోని పోలో ఎక్స్‌ప్రెస్‌ను గౌహతి నుండి వారంలోని అన్ని రోజులలో నడుస్తుంది. గౌహతినుండి వారానికి మూడుసార్లు శతాబ్ది ఎక్స్‌ప్రెస్ నడుస్తుంది అరుణాచల్ ఎసి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ వారానికి రెండుసార్లు నహర్లాగన్, ఆనంద్ విహార్ టెర్మినల్ మధ్య నడుస్తుంది.ఇది అరుణాచల్ ప్రదేశ్ రాజధానితో కలిపే ఏకైక ప్రత్యక్ష రైలు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.