ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా
ఆంధ్రప్రదేశ్ లో రెండవ స్థాయి పరిపాలన విభాగమైన జిల్లాలు / From Wikipedia, the free encyclopedia
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలలో 26 జిల్లాలను కలిగి ఉంది. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి. రాయలసీమలో కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ జిల్లాలు | |
---|---|
రకం | జిల్లాలు |
స్థానం | ఆంధ్రప్రదేశ్ |
సంఖ్య | 26 జిల్లాలు |
జనాభా వ్యాప్తి | పార్వతీపురం మన్యం – 9,25,340 (అత్యల్ప); నెల్లూరు – 24,69,712 (అత్యధిక) |
విస్తీర్ణాల వ్యాప్తి | విశాఖపట్నం – 1,048 చ.కి.మీ. (చిన్నది); ప్రకాశం – 14,322 చ.కి.మీ. (అతిపెద్ద) |
ప్రభుత్వం | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం |
ఉప విభజన | ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్లు |
విశాఖపట్నం జిల్లా విస్తీర్ణంలో అతి చిన్న జిల్లా కాగా, ప్రకాశం జిల్లా పెద్దది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అత్యధికజనాభా కలిగిన జిల్లా అయితే, పార్వతీపురం మన్యం జిల్లా అత్యల్పజనాభా కలిగిన జిల్లాగా గుర్తించబడ్డాయి. ప్రతి జిల్లాను రెండు లేదా అంతకంటే తక్కువ రెవెన్యూ డివిజన్లుగా విభజించబడ్డాయి. రెవెన్యూ డివిజన్లును పరిపాలనా ప్రయోజనాల కోసం మండలాలుగా ఉపవిభజన చేయబడ్డాయి.