హిందుస్థానీ సంగీత గాయకులు - ఘరానాలు : హిందుస్తానీ సంగీతంలో ఘరానాలు ఉంటాయి. ఒక్కొక్క ఘరానా ఒక్కొక్క శాస్త్రీయ గాన శైలి, పోకడలను కలిగి ఉంటుంది.

గ్వాలియర్ ఘరానా

ఇది అన్నిటిలోకెల్లా పురాతనమైంది.ఇందులోని సుప్రసిద్ధ గాయకులు

Thumb
విష్ణు దిగంబర్ పలుస్కర్, ఇతను హిందుస్తానీ సంగీత విద్వాంసుడు.రఘుపతి రాఘవ రాజారామ్ భజన అసలు వెర్షన్ పాడారు.అతని పేరు మీద విడుదల చేయబడిన భారత పోష్టల్ స్టాంపు చిత్రం

కిరాణా ఘరానా

కురుక్షేత్ర్ లోని కిరాణా, కరీంఖాన్ స్వస్థలం. ఇందులోని ప్రసిద్ధ గాయకులు: అబ్దుల్ కరీంఖాన్, (1872 - 1937) హీరాబాయి బరోడేకర్, బేగం అఖ్తర్, భీమ్‌సేన్ జోషి, గంగూబాయి హంగల్, ప్రభా ఆత్రే లు.

అత్రౌలి - జయపూర్ ఘరానా

ఇందులో అల్లాదియా ఖాన్ (1855 - 1943), మల్లికార్జున్ మన్సూర్, కేసర్ బాయి కేర్కర్, కిషోరీ అమోంకర్, శ్రుతి సడోలికర్, పద్మా తల్వార్కర్, మోగుబాయి కుర్దికర్, అశ్విని భిడె దేశ్ పాండేలు ప్రముఖులు.

ఆగ్రా ఘరానా

ఇందులో ఉస్తాద్ ఫయాజ్ ఖాన్ (1886 - 1950), సి.ఆర్.వ్యాస్, ఎస్.ఎన్.రతన్ జన్‌కర్,, జితేంద్ర అభిషేకిలు ప్రసిద్దులు.

పటియాలా ఘరానా

అలీ బక్ష్ (1850 - 1920), ఫతే అలీ ఖాన్ (1850 - 1909) ఈ ఘరానాకు ఆద్యులు. ఐతే ప్రజల్లోకి తీసికెళ్ళి, దీనికి బాగా ప్రాచుర్యం కలుగజేసిన వాడు ఉస్తాద్ బడేగులాం అలీఖాన్ (1901 - 1969). చాలా గొప్పగా పాడే పండిట్ అజయ్ చక్రవర్తి, పర్వీన్ సుల్తానాలు ఈ ఘరానాకు చెందిన వారే.

రాంపూర్ - సహస్వాన్ ఘరానా

దీనిని స్థాపించినవాడు ఉస్తాద్ ఇనాయత్ హుసేన్ ఖాన్ (1849 - 1919).

  • గులాం ముస్తఫా ఖాన్,
  • ఉస్తాద్ నిసార్ హుసేన్ ఖాన్
  • ఉస్తాద్ రాషిద్ ఖాన్
  • షన్నూ ఖురానా

మేవాతి ఘరానా

దీనికి మూలపురుషుడు ఘగ్గె నాజిర్ ఖాన్.ఇందులో ఎక్కువగా విష్ణుతత్వ భజనలను ఆలపిస్తారు. ఇందులోని సుప్రసిద్ధ గాయకులు పండిట్ జస్రాజ్, అతని శిష్యులు సంజీవ్ అభయంకర్, రత్తన్ శర్మ లు.

భూండీ బజార్ ఘరానా

ఇందులోని ముఖ్య గాయకులు ఉస్తాద్ అమాన్ అలీ ఖాన్, అంజనీబాయి మాల్పేకర్ లు.

మూలాలు

బయటి లింకులు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.