భారతీయ గాయకుడు From Wikipedia, the free encyclopedia
హిందుస్థానీ గాయకుడైన భీమ్‌సేన్ గురురాజ్ జోషి (ఫిబ్రవరి 4, 1922 - జనవరి 24, 2011) కిరాణా ఘరానాకు చెందిన భీమ్‌సేన్ జోషి 'ఖయాల్ గాయనంలోనే కాక, భక్తిరస ప్రధానమైన భజనలు, అభంగాలు పాడడంలో సిద్ధ హస్తుడు. ఈయన కర్ణాటకలోని గదగ్ జిల్లాలో జన్మించాడు.
భీమ్‌సేన్ జోషి | |
---|---|
| |
వ్యక్తిగత సమాచారం | |
జన్మనామం | భీమ్‌సేన్ గురురాజ్ జోషి |
జననం | 1922 ఫిబ్రవరి 4 |
ప్రాంతము | గదగ్, కర్ణాటక, భారతదేశం |
మరణం | 24 జనవరి 2011 |
సంగీత రీతి | హిందుస్థానీ సంగీతము |
వృత్తి | హిందుస్థానీ సంగీతము |
20వ శతాబ్దం పూర్వార్థం వరకూ, 'ఖయాల్ గాయనం' గురుశిష్య పరంపర' గా సాగేది. భీమ్‌సేన్ జోషి గురువైన సవాయి గంధర్వ, అబ్దుల్ కరీంఖాన్కు శిష్యుడు. అబ్దుల్ కరీంఖాన్ అబ్దుల్ వహీద్ ఖాన్‌తో కలిసి, కిరానా ఘరాణాను స్థాపించాడు.తన 11వ ఏట, చిన్నతనంలో అబ్దుల్ కరీంఖాన్ గాయనం విని ఉత్తేజితుడై, ఇల్లు వదలి గురువును వెదుక్కుంటూ, ధార్వాడ్ తరువాత పుణె చేరుకున్నాడు. తరువాత గ్వాలియర్కు వెళ్ళి, 'మాధవ సంగీత పాఠశాల'లో చేరాడు. ఆ పాఠశాలను గ్వాలియర్ మహారాజులు, సరోద్ విద్వాంసుడు, హఫీజ్ అలీఖాన్ సహాయంతో నడుపుతుండేవారు. మంచి గురువు కోసం, ఢిల్లీ, కోల్‌కతా, గ్వాలియర్, లక్నో, రాంపూర్, లలో పర్యటించాడు. చివరకు అతని తండ్రి, భీమ్‌సేన్ జోషిని జలంధర్లో పట్టుకొని, తిరిగి ఇంటికి తోడ్కొని వచ్చాడు. 1936లో, సవాయి గంధర్వ, భీమ్‌సేన్‌ను శిష్యుడిగా స్వీకరించాడు. ప్రముఖ హిందుస్తానీ సంగీత గాయని గంగూబాయి హంగల్, అతని సహవిద్యార్థిని. అలా నాలుగేళ్ళు సవాయి గంధర్వ వద్ద సంగీతాన్ని అభ్యసించాడు. భీమ్‌సేన్ జోషికి ఇష్టమైన రాగాలు : శుద్ధ కల్యాణ్, మియాన్ కీ తోడి, పురియా ధనశ్రీ, ముల్తానీ, భీమ్‌పలాసీ, దర్బారీ, రామ్‌కలీ లు. భీమ్‌సేన్ అబ్దుల్ కరీంఖానే కాక, కేసర్‌బాయి కేర్కర్, బేగం అక్తర్, ఉస్తాద్ అమీర్‌ఖాన్ ల వల్ల ఎంతో ప్రభావితుడైనాడు. చివరకు తన ప్రత్యేక గాయన శైలిని రూపొందించుకొన్నాడు.
భీమ్‌సేన్ జోషి తండ్రి, గురాచార్య జోషి; బడి పంతులు. చిన్న వయసులోనే భీమ్‌సేన్ జోషికి సునందతో వివాహం జరిగింది. రాఘవేంద్ర, ఆనంద్ జోషిలు గాయకులు. తరువాత భీమ్‌సేన్ వత్సలను పెళ్ళాడాడు. శ్రీనివాస్ జోషి మంచి గాయకుడు; ఎన్నో ఆల్బంలను విడుదల చేశాడు.
బసంత్ బహార్ ( మన్నాడేతో ), బీర్బల్ మై బ్రదర్ ( పండిట్ జస్రాజ్‌తో), తాన్‌సేన్ (1958), అంకాహీ (1985). భీమ్‌సేన్ జోషి కన్నడ భజనలు (దాసవాణి, ఆల్బమ్) మరాఠీ అభంగ్‌లు పాడాడు. జాతీయ ప్రతిపత్తిపై తీసిన సంగీతపరమైన వీడియో, 'మిలే సుర్ మేరా తుమారా' అనేది జగత్ప్రసిద్ధం. భీమ్‌సేన్ జోషి తన గురువు సవాయి గంధర్వ గౌరవజ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం, డిశంబరు నెలలో పుణె నగరంలో, సవాయి గంధర్వ సంగీత మహోత్సవంను నిర్వహించేవారు.
2011 జనవరి 24న పుణే నగరంలో భీమ్‌సేన్ జోషి కంఠం మూగవోయింది.[1]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.