![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/2d/Halebidu_BNC.jpg/640px-Halebidu_BNC.jpg&w=640&q=50)
హళేబీడు
హస్సాం జిల్లాలో నగరం, కర్ణాటక, భారతదేశం / From Wikipedia, the free encyclopedia
హళేబీడు కర్ణాటకలోని హాసన్ జిల్లాలో ఉంది. ఇది ఒక చిన్న పట్టణం. హళేబీడు, బేలూరు, శ్రావణబెళగొళను కర్ణాటక పర్యాటక శాఖవారు స్వర్ణ త్రికూటంగా పిలుస్తారు. హళేబీడును, బేలూరును, హోయసలుల జంట పట్టణాలుగా పిలుస్తారు. హళేబీడు, బేలూరు జిల్లా కేంద్రమైన హాసన్‌కు అతి సమీప చిన్న పట్టణాలు. హాలేబీడు అనగా శిథిలనగరం లేదా పాత నివాసం. దీనికి పూర్వం దొరసముద్ర, ద్వారసముద్ర అని పేర్లు ఉండేవి. అనగా సముద్రానికి ద్వారం వంటిదని. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో మాలిక్ కాఫర్ దాడులను ఈ ప్రాంతం చవి చూసింది. అనేక శిథిలాలు ఇక్కడ మిగిలిపోయాయి. అందుకే దీనికి హలెబీడు (శిథిల నగరమని, పాత నివాసమని) అనే పేరు స్థిరపడిపోయింది.
త్వరిత వాస్తవాలు హళేబీడు, దేశం ...
హళేబీడు | |
---|---|
పట్టణం | |
![]() హొయసలేశ్వరాలయం,హళేబీడు | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | కర్ణాటక |
జిల్లా | హాసన్ జిల్లా |
Elevation | 880 మీ (2,890 అ.) |
జనాభా (2001) | |
• Total | 8,962 |
Ethnicity | |
Time zone | UTC+5:30 (IST) |
ఎస్.టి.డి. | 08172 |
మూసివేయి