From Wikipedia, the free encyclopedia
హబుల్ అంతరిక్ష దూరదర్శిని (ఆంగ్లం Hubble Space Telescope) భూ నిమ్న కక్ష్యలో తిరుగుతూ ఉన్న దూరదర్శిని. 1990 లో నాసా ఈ దూరదర్శినిను ప్రయోగించింది. అమెరికాకు చెందిన ఖగోళ శాస్త్రజ్ఞుడు ఎడ్విన్ హబుల్ పేరున దీని నామకరణం జరిగింది. అంతరిక్షంలోకి పంపిన దూరదర్శినిల్లో ఇది మొదటిదేమీ కానప్పటికీ, మిగతా వాటికంటే ఇది విస్తృతమైన కార్యకుశలత కలిగినది. దీని ముఖ్య ఉద్దేశం రోదశి లోతుల్లో ఉన్న నభోమూర్తుల అధ్యయనం. దీనిని డిస్కవరీ స్పేస్ షటిల్ ద్వారా ఏప్రిల్ 1990 లో భూ నిమ్న కక్ష్యలో ప్రవేశపెట్టారు.
General information | |
---|---|
NSSDC ID | [http://nssdc.gsfc.nasa.gov/database/MasterCatalog?sc=1990-037B 1990-037B 1990-037B] |
Organization | NASA / ESA / STScI |
Launch date | ఏప్రిల్ 24, 1990 |
Deorbited | Likely between 2013 and 2021[1] |
Mass | 11,110 kg (24,250 lb) |
Type of orbit | వర్తులాకారం |
Orbit height | 589 km (366 mi) |
Orbit period | 96–97 min |
Orbit velocity | 7,500 m/s (17,000 mph; 27,000 km/h) |
Acceleration due to gravity | 8.169 m/s² (26.80 ft/s²) |
Location | క్రింది స్థాయి భూకక్ష |
Telescope style | Ritchey-Chretien reflector |
Wavelength | ఆప్టికల్, అతినీలిలోహిత, near-infrared |
Diameter | 2.4 m (94 in) |
Collecting area | approx. 4.5 m² (46 ft²)[2] |
Focal length | 57.6 m (189 ft) |
Instruments | |
NICMOS | infrared camera/spectrometer |
ACS | optical survey camera (mostly failed) |
WFPC2 | wide field optical camera |
STIS | optical spectrometer/camera (failed) |
FGS | three fine guidance sensors |
Website | http://www.nasa.gov/hubble · http://hubble.nasa.gov http://hubblesite.org · http://www.spacetelescope.org |
2.4 మీ. దర్పణం కలిగిన ఈ దూరదర్శిని లోని నాలుగు ప్రధాన పరికరాలు ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ స్పెక్ట్రమ్ లోని అతినీలలోహిత (అల్ట్రా వయొలెట్), దృగ్గోచర (విసిబుల్), సమీప పరారుణ (నియర్ ఇన్ఫ్రారెడ్) శ్రేణుల్లో పరిశీలించగలవు. భూ వాతావరణం బయట ఉండటాన హబుల్కు వాతావరణం వలన దృశ్యంలో కలిగే వక్రత ఉండదు. అంచేత అతి తక్కువ కాంతిని కూడా గ్రహించి భూస్థిత దూరదర్శినిల కంటే మెరుగైన రిజొల్యూషన్లో బొమ్మలు తీయగలదు.
స్పేస్ షటిల్ చాలెంజరు దుర్ఘటన తరువాత షటిల్ కార్యక్రమాలు ఆగిపోవడంతో హబుల్ ప్రయోగం కొన్నేళ్ళ పాటు వాయిదా పడింది. 1988 లో షటిల్ కార్యక్రమాలి మళ్ళీ మొదలయ్యాయి. 1990 ఏప్రిల్ 24న డిస్కవరీ స్పేస్ షటిల్లో హబుల్ను అంతరిక్షంలోకి పంపించి భూ నిమ్న కక్ష్యలో ప్రతిక్షేపించారు.[3]
తొలి అంచనాలలో హబుల్ కార్యక్రమం ఖర్చు 40 కోట్ల డాలర్లు అవుతుందని భావించారు. ప్రయోగించేనాటికి 470 కోట్ల డాలర్లైంది. ప్రయోగించిన ఇరవై ఏళ్ళలో - 2010 వరకూ పెట్టిన మొత్తం ఖర్చు 1000 కోట్ల డాలర్లుగా తేలింది.[4]
ప్రయోగించిన కొన్ని వారాల్లోనే హబుల్ పంపించిన బొమ్మల్లో నాణ్యతా లోపాలున్నట్లు గమనించారు. భూస్థిత దూరదర్శిని బొమ్మల కంటే ఇవి మెరుగ్గా ఉన్నప్పటికీ హబుల్ నుండి ఆశించిన స్థాయి స్పష్టత వాటిలో లేదు. దూరదర్శిని ఆప్టికల్ వ్యవస్థలో లోపం దీనికి కారణమని గుర్తించారు.[5][6] ప్రాథమిక దర్పణాన్ని సరైన ఆకారానికి పాలిష్ చెయ్యకపోవడమే లోపమని నిర్ధారించారు.[7]
సమస్యను సరిచేసేందుకు నాసా ఒక సర్వీసు యాత్రను తలపెట్టింది. హబుల్ ను రిపేరు చేసేందుకు, అందుకు అవసరమైన పరికరాలను ఉపయోగించడం లోను ఏడుగురు వ్యోమగాములకు లోతైన శిక్షణ నిచ్చింది. 1993 డిసెంబరులో ఎండీవర్ షటిల్ ద్వారా వారిని అంతరిక్షంలోకి పంపింది. వాళ్ళు 10 రోజుల పాటు అంతరిక్షంలో ఉండి హబుల్కు అవసరమైన అన్ని మరమ్మతులు పూర్తి చేసి తిరిగి వచ్చారు.[8]
హబుల్కు అవసరమైన అన్ని రిపేర్లూ జయప్రదంగా పూర్తయ్యాయని, అది స్పష్టమైన బొమ్మలౌ పంపిస్తోందనీ 1994 జనవరి 13 న నాసా ప్రకటించింది.[9]
అప్పటి నుండి 2009 మే వరకూ నాసా మరొక నాలుగు (మొత్తం ఐదు) సర్వీసు యాత్రలు చేపట్టి హబుల్కు అవసరమైన కొత్త హంగులను సమకూరుస్తూ వచ్చింది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.