స్వలింగ సంపర్కం
From Wikipedia, the free encyclopedia
స్వలింగ సంపర్కం అనగా ఒకే లింగానికి చెందిన వారి మధ్య ఉండే లైంగిక సంబంధము. స్వలైంగికత ఒకే లింగానికి చెందిన వారి మధ్య రొమ్యాంటిక్, లైంగిక ఆకర్షణ, లేదా లైంగిక ప్రవర్తన.[1][2][3] ఈ లైంగిక సంబంధము సృష్టి విరుద్ధమని అందరూ భావిస్తారు. కానీ, ఇది సృష్టికి విరుద్ధమేమీ కాదని, ప్రాకృతికమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చి చెప్పింది. వైద్య శాస్తం ప్రకారం కూడా స్వలింగ సంపర్కము ఒక మానసిక వ్యాధియో, లేక జన్యుపరమైన లోపమో కాదని, లైంగికతలో ఒక భిన్నమైన కోణంగా దీనిని పరిగణించాలని American Psychological Association, American Psychiatric Association, American Academy of Pediatrics మొదలగు ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు నిర్ధారించాయి. ఇటీవల దీనిని Indian Psychiatric Society కూడా ఆమోదించింది. స్వలింగసంపర్కం చట్టబద్ధం చేసిన మొదటి దేశంగా డెన్మార్క్ (నెదర్లాండ్). ఆ తరువాత నార్వే, స్వీడన్, ఐలాండ్ దేశాలు డెన్మార్క్ను అనుసరించాయి. ఆఫ్రికాలో అత్యధిక దేశాల్లో స్వలింగ సంపర్కం చట్ట వ్యతిరేకం. దక్షిణాఫ్రికాలో స్వలింగ సంపర్కులకు రాజ్యాంగంలో స్థానం కల్పించారు. 2007వ, సంవత్సరంలో నేపాల్ సుప్రీంకోర్టు, లెస్బియన్లు, స్వలింగ సంపర్కులు, లింగమార్పిడిదారుల చట్టాలను రద్దు చేయాలని వారిని మూడో లింగంగా గుర్తించి వారికి పౌర హక్కులను కల్పించాల్సిందిగా కోరింది.
ఈ వ్యాసంలోని సమాచారం సరైనదేనని రూఢీ చేసుకునేందుకు మరిన్ని మూలాలు కావాలి . (August 2022) |
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. ఇచ్చిన కారణం: ఈ వ్యాసంలో భారత సుప్రీం కోర్టు వారి 2018 సెక్షన్ 377 తీర్పు గురించి వెల్లడించలేదు. ఈ తీర్పు ప్రకారం స్వలింగ సంపర్కం భారతదేశంలో పరలింగ సంపర్కం వలె చట్టబద్ధమైనదిగా డిక్లేర్ చెయ్యబడింది. (August 2022) |
ఈ వ్యాసం 18 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే. లైంగికత గురించి చర్చించటం మూలాన ఈ వ్యాసం చదవటం అందరికీ అమోదయోగ్యం కాకపోవచ్చును . ఇది మీకు సౌకర్యవంతం కాకపోతే దయచేసి తక్షణమే ఈ పుట నుండి నిష్క్రమించ ప్రార్థన. |