స్పుత్నిక్
From Wikipedia, the free encyclopedia
స్పుత్నిక్ (ఆంగ్లం :Sputnik 1) (రష్యన్ భాష "Спутник-1"), "కృత్రిమ ఉపగ్రహం-1", ПС-1 (PS-1, లేదా "Простейший Спутник-1", లేదా ప్రాథమిక కృత్రిమ ఉపగ్రహం-1) ), భూమిచుట్టూ పరిభ్రమించే కృత్రిమ ఉపగ్రహం, ఇది ప్రపంచపు ప్రథమ కృత్రిమ ఉపగ్రహం. ఇది ప్రతి 92.6 నిముషాలకు ఒకసారి భూమిని చుట్టి వస్తుంది. దీనిని సోవియట్ యూనియన్ అక్టోబరు 4 1957 లో ప్రయోగించింది.
సంస్థ | సోవియట్ యూనియన్ మంత్రుల పరిషత్తు |
---|---|
ముఖ్యమైన కాంట్రాక్టర్లు | OKB-1, రేడియో-సాంకేతిక పరిశ్రమల మంత్రిత్వ శాఖ, సోవియట్ యూనియన్. |
మిషన్ రకం | వాతావరణ పరిశోధన |
దీనికి ఉపగ్రహం | భూమి |
కక్ష్యలు | 1,440 |
లాంచ్ తేదీ | అక్టోబరు 4, 1957, 19:28:34 UTC (22:28:34 MSK) |
లాంచ్ వాహనం | స్పుత్నిక్ రాకెట్ |
మిషన్ వ్యవధి | 3 నెలలు |
Decay | జనవరి 3, 1958 |
NSSDC ID | 1957-001B |
హోమ్ పేజి | NASA NSSDC Master Catalog |
ద్రవ్యరాశి | 83.6 కి.గ్రా. (184.3 పౌండ్లు.) |
కక్ష్య వివరాలు | |
సెమిమేజర్ అక్షం | 6,955.2 కి.మీ. (4,321.8 మైళ్ళు) |
ఎక్సింట్రిటీ | 0.05201 |
ఇంక్లినేషన్ | 65.1° |
కక్ష్యాకాలం | 96.2 నిముషాలు |
ఎపో యాప్సిస్ | కేంద్రం నుండి 7310 కి.మీ., ఉపరితలం నుండి 939 కి.మీ. (583 మైళ్ళు) |
పెరియాప్సిస్ | కేంద్రం నుండి 6586 కి.మీ., ఉపరితలం నుండి 215 కి.మీ. (134 మైళ్ళు) |
స్పుత్నిక్-1 అంతర్జాతీయ భూ-భౌతిక సంవత్సరం కాలంలో ప్రదేశం సంఖ్య-1 నుండి, 5వ ట్యూరటమ్ రేంజి వద్ద, కజక్ ఎస్.ఎస్.ఆర్. (ప్రస్తుతం బైకనూర్ కాస్మోడ్రోమ్) నుండి ప్రయోగించారు. ఈ ఉపగ్రహం 29,000 కి.మీ. (18,000 మైళ్ళు) ప్రతి గంటకు ప్రయాణించి, రేడియో సిగ్నల్స్ ను 20.005, 40.002 MHz పౌన॰పున్యాల వద్ద ప్రసారం చేసింది[1][2] ఈ సిగ్నళ్ళు 22 రోజులు నిరంతరాయంగా ప్రసారాలు పంపాయి, అక్టోబరు 26, 1957 న బ్యాటరీ శక్తి సమాప్తం కావడంతో సిగ్నల్స్ రావడం ఆగిపోయాయి.[3] స్పుత్నిక్ 1 1958 జనవరి 4 న కాలిపోయి, తన కక్ష్యనుండి భూమి వాతావరణం పై రాలిపోయింది. ఇది మొత్తం ప్రయాణించిన దూరం 6 కోట్ల కి.మీ., వెచ్చించిన కాలం కక్ష్యలో 3 నెలలు.[4]