From Wikipedia, the free encyclopedia
స్పాట్ వెల్డింగు అనునది ఆంగ్ల పదం. తెలుగులో అనువదించిన బిందు రూప అతుకు ప్రక్రియ అని పిలువ వలసి ఉంది. ఈ వృత్తిలో వున్నవారు సింపుల్ గా స్పాట్ వెల్డింగు అని పిలవడం మాములై పోయింది.విద్యుత్తు, లోహం లవిద్యుత్తు నిరోధకత్వం గుణాన్ని ఆధారంచేసుకొని లోహాలను వెల్డింగు చేయు విధానమిది. సచేతనమైన ఒక విద్యుత్తు ప్రవాహ వలయంలో ఎలక్ట్రానులు ధన ధ్రువం (Anode) నుండి ఋణ ధ్రువం (cathode) వైపు నిరంతరం సెకండుకు దాదాపు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంటాయి.ఇలాంటి స్థితిలో ఎలక్ట్రానుల ప్రవాహనికి ప్రతిబంధకం, లేదా నిరోధం కలిగించిన, ప్రతి బంధకానికి కారణమైన పదార్థంలో అధిక సంఖ్యలో ఎలక్ట్రానులు జమపడి పోవడం వలన ఏర్పడిన ఘర్షణ ఫలితంగా ఉష్ణోగ్రత ఏర్పడుతుంది.ఈ ఫలిత ఉష్ణోగ్రతను ఉపయోగించుకొని లోహములను అతుకు ప్రక్రియ ఇది. అందు వలన దీనిని ప్రతి బంధక లేదా నిరోధక అతుకు ప్రక్రియ అంటారు. ఆంగ్లంలో Resistance/resistence Welding (RW) లేదా Resistance/resistence Spot Welding (RSW) అంటారు. ఎక్కువగా ఈ వెల్డింగు ప్రక్రియలో లోహ పలకలను అతుకుట వలన షీట్ స్పాట్ వెల్డింగు అని కూడా అంటారు. [1].స్పాట్ వెల్డింగు ప్రక్రియలో వెల్డింగు సమయంలో కొంతమేరకు అతుకు వస్తువు/లోహం మీద భౌతిక వత్తిడిని తప్పని సరిగా ప్రయోగించ వలసి ఉంది.స్పాట్ వెల్డింగులో పూరక లోహాన్ని ప్రత్యేకంగా ఉపయోగించ వలసిన అవసరంలేదు. స్పాట్ వెల్డింగు మొదటగా 100-1905 లో ఉపయోగంలోకి వచ్చినట్లు తెలుస్తున్నది[2].ప్రస్తుతం విశ్వవ్యాప్తంగా ఎక్కువ వినియోగంలో వున్న వెల్డింగు ప్రక్రియలలో స్పాట్ వెల్డింగు ప్రక్రియ ఒకటి.
స్పాట్ వెల్డింగులో ఉపయోగించు విద్యుత్తు ఏకముఖ విద్యుత్తు (direct current).ఎలక్ట్రోడులు రెండు యంత్రానికి (భూమికి) నిలువగా వుండును.అందులో క్రిందు ఎలక్ట్రోడు స్థిరంగా, కదలకుండ వుండును. చేతితో లేదా కాలితో లివరును నొక్కడం ద్వారా పై ఎలక్ట్రోడు పైకి క్రిందికి కదిలే అమర్చబడివుండును, ఎలక్ట్రొడులు స్తుపాకారంగా వుండి అంచులు శంఖువులా కొనదేలి (Taper shape) వుండును.వెల్డింగు నాలుగుదశలలో జరుగును.మదటిదశలో క్రింది ఎలక్ట్రొడు మీద అతుక వలసిన లోహపలకలను ఒకదానిమీద ఒకటి వుండెలా అమర్చి, లివరును నొక్కిఅతుకవలసిన భాగంపై వత్తడం జరుగుతుంది.రెండవ దశలో ఎలక్ట్రోడును అలా నొక్కివుంచి, కొన్ని క్షణాలపాటు విద్యుత్తును పంపెదరు.అతుకబడు లోహాల విద్యుత్తు ప్రతిబంధక లక్షణం కారణంగా, రెండు ఎలక్ట్రోడుల అంచులమధ్య అధిక ఉష్ణోగ్రత జనించును.ఫలితంగా లోహం కరగి, ఎలక్ట్రోడు మీద ప్రయోగించిన బలం/వత్తిడి వలన అతుకబడు తుంది.మూడవ దశలో విద్యుత్తును ఆపివేశినప్పటికి లివరు/ఎలక్ట్రోడును బలంగా అలాగే కొద్దిసేపు నొక్కి వుంచెదరు.ఇలాచెయ్యడం వలన అతుకు దృఢపడుతుంది.నాలుగవదశలో లివరును వదలి ఎలక్ట్రోడును దూరంగా జరపడం జరుగుతుంది.స్పాట్ వెల్డింగులో అతుకు చిన్న బిందువు లేదా చిన్న చుక్కవంటి ఆకారంలో ఏర్పడటం వలన దీనిని స్పాట్ వెల్డింగు అని సాధారణపేరు వుండిపోయినది[3].
స్పాట్ వెల్డింగు యంత్రాలను వాటి నిర్మాణాన్నిబట్టి, వాటితో వెల్డింగుచెయ్యు పద్ధతిని బట్టి కొన్ని రకాలుగా వర్గికరించారు.
వెల్డింగు మెషినులో వుండు యంత్ర భాగాలు
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.