From Wikipedia, the free encyclopedia
స్టైరీన్ ప్రధానంగా సింథటిక్ రసాయనం. దీనిని వినైల్బెంజీన్ Vinylbenzene , ఇథినైల్బెంజీన్ Ethenylbenzene , సిన్నమెన్ Cinnamene లేదా ఫినైల్థైలీన్ అని కూడా అంటారు. ఇది C6H5CH = CH2 అనే రసాయన ఫార్ములా కలిగిన సేంద్రియ సమ్మేళనం ద్రవరూపంలో ఉంటే చాలా తొందరగా ఆవిరవుతుంది. నీటిలో కరగదు.ప్లాస్టిక్, సింథెటిక్ రబ్బర్ తయారీ లో వాడతారు.అధిక సాంద్రతలు తక్కువ ఆహ్లాదకరమైన వాసనను కలిగి ఉన్నప్పటికీ. స్టైరీన్ పాలీస్టైరీన్ ఇంకా అనేక కోపాలిమర్స్ కు పూర్వగామిగా ఉంటుంది. స్టైరీన్ ని ముడిసరుకుగా పాలిస్టీరిన్ ను తయారు చేస్తారు రంగు లేని ఈ వాయువుకు తీయటి వాసన ఉంటుంది. దీనికి మండే స్వభావం కూడా ఉంటుంది. డిస్పోజబుల్ కాఫీ గ్లాస్లులను తయారుచేసేందుకు రెసిన్ అంటే ఫైబర్ గ్లాస్ ను తయారు చేసేందుకువాడతారు.ఇన్సులేషన్లు సామాన్లు, ఆటోమొబైల్ విడిభాగాలు, ప్రింటింగ్ కాట్రిడ్జిలు, ఆహారం నిల్వఉండే పాత్రలు, కార్పెట్ బ్యాకింగ్ కు వాడే ప్లాస్టిక్ , రబ్బర్ లను తయారుచేసేందుకు స్టైరీన్ అవసరం.
పేర్లు | |
---|---|
Preferred IUPAC name
Ethenylbenzene[1] | |
ఇతర పేర్లు | |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [100-42-5] |
పబ్ కెమ్ | 7501 |
కెగ్ | C07083 |
సి.హెచ్.ఇ.బి.ఐ | CHEBI:27452 |
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య | WL3675000 |
SMILES | c1ccccc1C=C |
ధర్మములు | |
C8H8 | |
మోలార్ ద్రవ్యరాశి | 104.15 g/mol |
స్వరూపం | colorless oily liquid |
వాసన | sweet, floral[2] |
సాంద్రత | 0.909 g/cm3 |
ద్రవీభవన స్థానం | −30 °C (−22 °F; 243 K) |
బాష్పీభవన స్థానం | 145 °C (293 °F; 418 K) |
నీటిలో ద్రావణీయత |
0.03% (20°C)[2] |
log P | 2.70 [3] |
బాష్ప పీడనం | 5 mmHg (20°C)[2] |
అయస్కాంత ససెప్టిబిలిటి | −6.82×10−5 cm3/mol |
వక్రీభవన గుణకం (nD) | 1.5469 |
స్నిగ్ధత | 0.762 cP at 20 °C |
నిర్మాణం | |
ద్విధృవ చలనం |
0.13 D |
ప్రమాదాలు | |
ప్రధానమైన ప్రమాదాలు | flammable, toxic, probably carcinogenic |
భద్రత సమాచార పత్రము | MSDS |
R-పదబంధాలు | R10 R36 |
S-పదబంధాలు | S38 మూస:S20 మూస:S23 |
జ్వలన స్థానం | {{{value}}} |
విస్ఫోటక పరిమితులు | 0.9%-6.8%[2] |
Lethal dose or concentration (LD, LC): | |
LC50 (median concentration) |
2194 ppm (mouse, 4 hr) 5543 ppm (rat, 4 hr)[4] |
LCLo (lowest published) |
10,000 ppm (human, 30 min) 2771 ppm (rat, 4 hr)[4] |
US health exposure limits (NIOSH): | |
PEL (Permissible) |
TWA 100 ppm C 200 ppm 600 ppm (5-minute maximum peak in any 3 hours)[2] |
REL (Recommended) |
TWA 50 ppm (215 mg/m3) ST 100 ppm (425 mg/m3)[2] |
IDLH (Immediate danger) |
700 ppm[2] |
సంబంధిత సమ్మేళనాలు | |
Related {{{label}}} | {{{value}}} |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
verify (what is ?) | |
Infobox references | |
ఈ వాయువును పీల్చుకున్నపుడు అది వూపిరితిత్తులలోకి ప్రవేశించాక శరీరానికి అక్సిజన్ అందకుండా చేస్తుంది. ముఖ్యంగా మెదడుకు అవసరమయిన మోతాదులో ఆక్సిజన్ అందనపుడు మనిషి అపస్మారక స్థితిలోకి జారుకుంటారు కొన్ని సార్లు ప్రాణాలు పోవచ్చు ఈ వాయువు పీలిచ్చినప్పుడు అది గోంతులోని మ్యూకస్ పొర మీద పనిచేస్తుంది.దీనిప్రభావం సెంట్రల్, ఫెరిఫరల్ నర్వస్ సిస్టమ్ మీద పడుతుంది. ఎక్కవ మోతాదులో పీల్చుకున్నపుడు (376 పిపిఎమ్ 25 నిమిషాలపాటు) వాంతి వస్తున్నట్లు ఉంటుంది సరి అయిన ప్రాణవాయువు అందక స్పృహ కోల్పోతారు. ఈ గ్యాస్ ను పీల్చడం వల్ల తలనొప్పి.వినికిడి సమస్య .నీరసం. కళ్ల మంటలు వంటివి కనిపిస్తాయి ఎక్కువ సేపు ఈ వాయువుకు పీలిస్తే నరాల, శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు వస్తాయి.ఈ స్టైరిన్ వలన కాన్సర్ రావటానికి అవకాశం వున్నది Lymphohematopoietic క్యాన్సర్లు అంటే leukemia, lymphoma కలిగించడంతోపాటు తెల్ల రక్తకణాల జన్యుపదార్థాన్ని దెబ్బతీస్తుంది. పాంక్రియాస్, ఈసోఫేగస్ క్యాన్సర్ కూడా ఈ గ్యాస్ తెస్తుందనేందుకు కూాదా ఆధారాలున్నాయి.స్టైరీన్ ని ఒక "తెలిసిన కార్సినోజెన్ " గా పేర్కొంటారు.యు.ఎస్. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (ఇపిఎ) స్టైరీన్ ను "జీర్ణ వాహిక, కిడ్నీ,, శ్వాసవ్యవస్థకు ఒక అనుమానిత టాక్సిన్" గా అభివర్ణించింది.
గురువారం మే 7 2020 న విశాఖ నగరంలోని ఆర్.ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి తెల్లవారు జామున 3 గంటల సమయంలో స్టైరీన్ విషవాయువు లీకైంది[5]. పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకై 3 కి.మీ మేర వ్యాపించింది. దీంతో చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో స్థానికులు తీవ్ర అవస్థలు పడ్డారు. స్పృహతప్పి పడిపోవడం ఈ గ్యాస్ సహజ లక్షణం. నిద్రమత్తులో ఉండి వాయువు పీల్చడం వల్ల ఎక్కువ మంది అస్వస్థతకు గురయ్యారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.