సౌ పౌలో
From Wikipedia, the free encyclopedia
సౌ పౌలో (São Paulo) (పోర్చుగీసులో సెయింట్ పాల్ అని అర్థం) బ్రెజిల్ దేశం ఆగ్నేయ దిక్కున ఉన్న ఒక మునిసిపాలిటీ. ఇది బ్రెజిల్ లోనూ, అమెరికాస్ లోనూ, దక్షిణ, పశ్చిమార్ధ గోళాల్లోనూ అత్యంత జనసమ్మర్ధం కలిగిన నగరం. ప్రపంచంలోనే పోర్చుగీసు భాష అత్యధిక సంఖ్యలో మాట్లాడే ప్రజలున్న నగరం కూడా. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన నగరాల్లో సౌ పౌలోది నాలుగో స్థానం. ఈ నగరాన్ని ఆవరించి ఉన్న సౌ పౌలో రాష్ట్రానికిది ముఖ్య పట్టణం. ఈ రాష్ట్రం బ్రెజిల్ దేశంలో అత్యంత సంపన్నమైన నగరం. ఇది వాణిజ్యం, ఆర్థిక, కళలు, వినోదాలలో బలమైన అంతర్జాతీయ ప్రభావాలను చూపుతుంది.[6] సెయింట్ పాల్ ఆఫ్ టార్సర్ గౌరవార్థం ఈ నగరానికి ఈ పేరు పెట్టారు. దీని మెట్రోపాలిటన్ నగరమైన గ్రేటర్ సౌ పౌలో బ్రెజిల్ అత్యధిక జనాభా కలిగిన ప్రదేశం, ఇంకా ప్రపంచంలో 12 వ స్థానంలో ఉంది.
సౌ పౌలో | |
---|---|
Município de São Paulo మున్సిపాలిటీ ఆఫ్ సౌ పౌలో | |
Nickname(s): Terra da Garoa (Land of Drizzle); Sampa; "Pauliceia" | |
Motto(s): | |
Coordinates: 23°33′S 46°38′W | |
Country | Brazil |
State | São Paulo |
Founded | 25 జనవరి 1554; 470 సంవత్సరాల క్రితం (1554-01-25) |
Founded by | మాన్యువల్ డా నెబ్రేగా, జోసెఫ్ ఆఫ్ అంచియేట |
Named for | పౌల్ థ అపోస్టల్ |
Government | |
• Type | Mayor–council |
• Body | Municipal Chamber of São Paulo |
• Mayor | Bruno Covas[1] (PSDB) |
• Vice Mayor | Ricardo Nunes (MDB) |
విస్తీర్ణం | |
• మహానగరం | 1,521.11 కి.మీ2 (587.3039 చ. మై) |
• Urban | 11,698 కి.మీ2 (4,517 చ. మై) |
• Metro | 7,946.96 కి.మీ2 (3,068.338 చ. మై) |
• Macrometropolis | 53,369.61 కి.మీ2 (20,606.12 చ. మై) |
Elevation | 760 మీ (2,493.4 అ.) |
జనాభా | 1,23,25,232 |
• Rank | 1st in Brazil |
• జనసాంద్రత | 8,005.25/కి.మీ2 (20,733.5/చ. మై.) |
• Metro | 2,15,71,281[4] (Greater São Paulo) |
• Metro density | 2,714.45/కి.మీ2 (7,030.4/చ. మై.) |
• Macrometropolis | 3,36,52,991[5] |
Demonym | Portuguese: paulistano |
Time zone | UTC−03:00 (BRT) |
Postal Code (CEP) | 01000-000 |
ప్రాంతపు కోడ్ | +55 11 |
లాటిన్ అమెరికాలోనూ, దక్షిణార్ధగోళం లోనూ జిడిపి ప్రకారం అతిపెద్ద ఆర్థికవ్యవస్థ కలిగిన[7] ఈ నగరంలో సౌ పౌలో స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది.
ఈ మహానగరం బ్రెజిల్‌లోని ఎత్తైన ఆకాశహర్మ్యాలకు నిలయంగా ఉంది, వీటిలో మిరాంటే డో వేల్, ఎడిఫాసియో ఇటాలియా, బానెస్పా, నార్త్ టవర్ అనేక ఇతర కట్టడాలు ఉన్నాయి. ఈ నగరం జాతీయంగా ,అంతర్జాతీయంగా సాంస్కృతిక ఆర్థిక ఇంకా రాజకీయ ప్రభావాన్ని కలిగి ఉంది. లాటిన్ అమెరికన్ మెమోరియల్, ఇబిరాపురా పార్క్, మ్యూజియం ఆఫ్ ఇపిరంగ, సౌ పౌలో మ్యూజియం ఆఫ్ ఆర్ట్ , పోర్చుగీస్ లాంగ్వేజ్ మ్యూజియం వంటి స్మారక చిహ్నాలు, ఉద్యానవనాలు అలాగే మ్యూజియంలకు ఇది నిలయం. సౌ పౌలో నగరంలో సౌ పౌలో జాజ్ ఫెస్టివల్, సౌ పౌలో ఆర్ట్ బియెనియల్, బ్రెజిలియన్ గ్రాండ్ ప్రిక్స్, సౌ పౌలో ఫ్యాషన్ వీక్, ఎటిపి బ్రసిల్ ఓపెన్, బ్రసిల్ గేమ్ షో , కామిక్ కాన్ ఎక్స్పీరియన్స్ వంటి కార్యక్రమాలు జరుగుతాయి . సౌ పౌలో గే ప్రైడ్ పరేడ్ ప్రపంచంలోనే అతిపెద్ద గే ప్రైడ్ పరేడ్ .[8]