సేషెల్స్
తూర్పు ఆఫ్రికాలోని ఒక ద్వీప దేశం / From Wikipedia, the free encyclopedia
Republic of Seychelles
| |
---|---|
నినాదం: "Finis Coronat Opus" (Latin) "The End Crowns the Work" | |
గీతం: Koste Seselwa Join together all Seychellois | |
రాజధాని | Victoria 4°37′S 55°27′E |
అధికార భాషలు | |
జాతులు (2000) |
|
పిలుచువిధం |
|
ప్రభుత్వం | Unitary presidential republic |
• President | Danny Faure |
• Vice President | Vincent Mériton |
శాసనవ్యవస్థ | National Assembly |
Independence | |
• from the United Kingdom | 29 June 1976 |
విస్తీర్ణం | |
• మొత్తం | 459 కి.మీ2 (177 చ. మై.) (181st) |
• నీరు (%) | negligible |
జనాభా | |
• 2016 estimate | 94,228[1] (195th) |
• జనసాంద్రత | 205.3/చ.కి. (531.7/చ.మై.) (67th) |
GDP (PPP) | 2018 estimate |
• Total | $2.919 billion[2] |
• Per capita | $30,486[2] |
GDP (nominal) | 2018 estimate |
• Total | $1.564 billion[2] |
• Per capita | $16,332[2] |
జినీ (2013) | 46.8[3] high |
హెచ్డిఐ (2017) | 0.797[4] high · 62nd |
ద్రవ్యం | Seychellois rupee (SCR) |
కాల విభాగం | UTC+4 (SCT) |
• Summer (DST) | UTC+4 (not observed) |
వాహనాలు నడుపు వైపు | left |
ఫోన్ కోడ్ | +248 |
ISO 3166 code | SC |
Internet TLD | .sc |
సేషెల్స్ [5][6][7] [8]), అధికారికంగా " సేషెల్స్ రిపబ్లిక్ " హిందూ మహాసముద్రంలో ఒక ద్వీపసమూహ దేశం. 115 ద్వీపాల దేశం రాజధాని విక్టోరియా, తూర్పు ఆఫ్రికాకు తూర్పున 1,500 కిలోమీటర్ల (932 మైళ్ళు) దూరంలో ఉంది. ఇతర సమీపంలోని ద్వీప దేశాలు, భూభాగాలు కొమొరోస్, మయొట్టె (ఫ్రాన్స్ ప్రాంతం), మడగాస్కర్, రీయూనియన్ (ఫ్రాన్సు ప్రాంతం), దక్షిణసరిహద్దులో మారిషస్, అలాగే తూర్పు సరిహద్దులో మాల్దీవులు, బ్రిటీషు హిందూ మహాసముద్రం ఉన్నాయి. దేశ జనసంఖ్య సుమారు 94,228. సార్వభౌమ ఆఫ్రికన్ దేశాలలో అతిస్వల్పమైన జనసంఖ్యగా గుర్తించబడుతూ ఉంది.[9]
సేషెల్స్ ఆఫ్రికా సమాఖ్య, సదరను ఆఫ్రికా డెవెలప్మెంటు కమ్యూనిటీ, కామన్వెల్తు ఆఫ్ నేషన్సు, యునైటెడు నేషన్సులో సభ్యదేశంగా ఉంది. 1976 లో యునైటెడు కింగ్డం నుండి స్వాతంత్ర్యం ప్రకటించిన తరువాత సేషెల్స్ వ్యవసాయరంగ ఆధారిత ఆర్థికవ్యవస్థను మార్కెట్టు-ఆధారిత వైవిధ్యభరితమైన ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేసింది. వ్యవసాయం రంగాన్ని వేగంగా అభివృద్ధి చెందుతున్న సేవ, ప్రభుత్వ రంగాలు, పర్యాటక రంగం అధిగమించాయి. 1976 నుండి 2015 మద్య కాలంలో నామమాత్రపు జి.డి.పి. ఉత్పత్తి 7 రెట్లు అధికరించింది. కొనుగోలు శక్తి సమానత దాదాపు 16 రెట్లు అధికరించింది. 2010 చివరిలో అధ్యక్షుడు డానీ ఫౌరె, నేషనలు అసెంబ్లీ ఈ రంగాలను మరింత మెరుగుపరిచేందుకు విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించాలని ప్రణాళికలు సమర్పించారు.
ప్రస్తుతం సేషెల్స్ ఆఫ్రికాలోని ఫ్రెంచి భూభాగాలను మినహాయించి, నామమాత్రపు తలసరి జీడీపీ అత్యధికంగా ఉంటుందని సగర్వంగా చెప్పుకుంటుంది. అధిక మానవ అభివృద్ధి సూచికతో ఉన్న ఆఫ్రికాలోని కొన్ని దేశాలలో ఇది ఒకటి. దేశం కొత్తగా ఆర్థిక శ్రేయస్సు ఉన్నప్పటికీ అధిక స్థాయి ఆర్థిక అసమానత్వం అత్యధికంగా ఉన్న ప్రపంచదేశాలలో ఇది ఒకటిగా ఉంది. ఉన్నత వర్గాలు, పాలక వర్గానికి మరింత అనుకూలంగా ఉండి ప్రజలలో అసమాన సంపద పంపిణీ కారణంగా పేదరికం అధికంగా ఉంది.[10]