సెల్యులోజ్
From Wikipedia, the free encyclopedia
సెల్యులోజ్ ఒక సేంద్రియ సమ్మేళనం. ఇది కొన్ని వందల నుంచి వేలకొద్దీ గ్లూకోస్ యూనిట్లు సుదీర్ఘ శ్రేణిగా ఏర్పడ్డ పాలీశాకరైడ్.[3][4] పచ్చటి మొక్కల్లోనూ, కొన్ని రకాల శైవలాల కణాల గోడల్లో ప్రధానమైన నిర్మాణ భాగం. కొన్ని రకాలైన బ్యాక్టీరియా సెల్యులోజ్ ని స్రవించి జీవపొర (Biofilm) ని ఏర్పరుస్తాయి.[5] సెల్యులోజ్ భూమి మీద అత్యంత విస్తారంగా లభించే సేంద్రియ అణుపుంజం.[6] పత్తినార లో 90 శాతం, కలపలో 40-50 శాతం, ఎండబెట్టిన జనుములో సుమారు 57 శాతం సెల్యులోజ్ ఉంటుంది.[7][8][9]
గుర్తింపు విషయాలు | |
---|---|
సి.ఎ.ఎస్. సంఖ్య | [9004-34-6] |
పబ్ కెమ్ | 14055602 |
కెగ్ | C00760 |
ధర్మములు | |
(C 12H 20O 10) n | |
మోలార్ ద్రవ్యరాశి | 162.1406 g/mol per glucose unit |
స్వరూపం | white powder |
సాంద్రత | 1.5 g/cm3 |
ద్రవీభవన స్థానం | 260–270 °C; 500–518 °F; 533–543 K Decomposes[2] |
నీటిలో ద్రావణీయత |
none |
ఉష్ణగతిక రసాయన శాస్త్రము | |
నిర్మాణము మారుటకు కావాల్సిన ప్రామాణిక ఎంథ్రఫీ ΔfH |
−963,000 kJ/mol[విడమరచి రాయాలి] |
దహనక్రియకు కావాల్సిన ప్రామాణీక ఎంథ్రఫీ ΔcH |
−2828,000 kJ/mol[విడమరచి రాయాలి] |
ప్రమాదాలు | |
US health exposure limits (NIOSH): | |
PEL (Permissible) |
TWA 15 mg/m3 (total) TWA 5 mg/m3 (resp)[2] |
REL (Recommended) |
TWA 10 mg/m3 (total) TWA 5 mg/m3 (resp)[2] |
IDLH (Immediate danger) |
N.D.[2] |
సంబంధిత సమ్మేళనాలు | |
సంబంధిత సమ్మేళనాలు |
Starch |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
N verify (what is YN ?) | |
Infobox references | |
సెల్యులోజ్ ని ప్రధానంగా కాగితం, కాగితపుబోర్డులు తయారు చేయడానికి వాడతారు. తక్కువ పరిమాణంలో సెల్యులోజ్ ని సెల్లోఫేన్, రేయాన్ ఉత్పత్తికి కూడా వినియోగిస్తారు. శక్తి నిచ్చే పంటల నుండి సెల్యులోజ్ను సెల్యులోసిక్ ఇథనాల్ వంటి జీవ ఇంధనంగా మార్చడం ద్వారా ప్రత్యామ్నాయ పునరుత్పాదక ఇంధనం అభివృద్ధి చెందుతోంది. పారిశ్రామిక ఉపయోగం కోసం సెల్యులోజ్ ప్రధానంగా కలప గుజ్జు, పత్తి నుండి తయారుచేస్తున్నారు.
కొన్ని జంతువులు, ముఖ్యంగా నెమరువేసే జంతువులు, ఇంకా చెదపురుగులు, వాటి పేగుల్లో నివసించే ట్రైకోనింఫా వంటి సహజీవన సూక్ష్మజీవుల సహాయంతో సెల్యులోజ్ను జీర్ణించుకోగలవు. మానవ పోషణలో, సెల్యులోజ్ అనేది కరగని జీర్ణం కాని ఆహార పీచుపదార్థం. ఇది మలవిసర్జన సాఫీగా కావడానికి సహాయపడుతుంది.