From Wikipedia, the free encyclopedia
సెక్యులరిజం (Secularism) అనేది ఒక 'స్వేచ్ఛాయుత ఆలోచన', దీని ప్రకారం, కొన్ని కార్యాచరణాలు లేదా సంస్థలు, మతము లేదా మతముల విశ్వాసాల నుండి వేరుగా యుంచుట. అనగా ప్రజల లేదా వ్యక్తిగత మతపరమైన మార్గాలనుండి లేదా మతపరమైన భావనలకు ప్రత్యామ్నాయంగా సెక్యులర్ భావాలను పెంపొందించుట.
ఒక విధంగా చెప్పాలంటే, సెక్యులరిజం ప్రకారం, మతపరమైన చట్టాలు, ప్రబోధనలనుండి స్వేచ్ఛపొందడం. ఇవి రాజ్యాలకు మాత్రమే పరిమితం. అనగా ప్రజలు వ్యక్తిగతంగా మతపరమైన విషయాలు పాటించిననూ, రాజ్యమునకు మతపరమైన విషయాలనుండి దూరంగా వుండేటట్లు చేయగలిగే స్థితి. ఒక రాజ్యంలో వుండే అనేక మతస్థులు, దేశ, రాజ్య, పరిపాలనా విషయాల పట్ల అందరికీ ఆమోదయోగ్యమైన సూత్రాలను తయారు చేసి శాంతి సౌఖ్యాలను స్థాపించుట. రాజ్యము విషయంలోనూ, రాజ్య పరిపాలనా విషయంలోనూ మతానికి అతీతంగా, సామాజిక సత్యాల పట్ల అవగాహన పొంది, రాజ్య, ప్రజా హితము కొరకు పాటు పడుట.[1]
సెక్యులరిజం అనే పదాన్ని మొదటిసారిగా బ్రిటిషు రచయిత 'జార్జి హోలియోక్' 1846 లో ఉపయోగించాడు.[2] ఈ పదము క్రొత్తదైననూ, 'స్వతంత్ర ఆలోచన' గా, సాధారణ వ్యాఖ్యగా చరిత్రలో కానవస్తుంది. ప్రత్యేకంగా, తొలి సెక్యులర్ భావాలు తత్వము, మతమును విడిచేసి చూసే విధము, అవెర్రోజ్ (ఇబ్న్ రుష్ద్) తత్వములోను, అవెర్రోయిజం తాత్విక పాఠశాలలో కనబడుతుంది.[3][4] హోలియోక్ 'సెక్యులరిజం' అనే పదాన్ని సృష్టించి, మతమునుండి సమాజాన్ని వేరుచేసి, సమాజాభివృద్ధికొరకు తన సూచనలిచ్చాడు. దీనిలో మతాన్ని విమర్శించడము గాని, వ్యాఖ్యలు చేయడము గాని చేయలేదు. తనవాదనలో "సెక్యులరిజం, క్రైస్తవమతానికి వ్యతిరేకి కాదు, ఇదో స్వేచ్ఛాయుత ఆలోచన" అని అన్నాడు. ఇంకనూ "ఇది క్రైస్తవ మతాన్ని ప్రశ్నించదు, మతము యొక్క అస్థిత్వాన్ని, హేతువునూ ప్రశ్నించదు, సెక్యులరిజంలో వున్న జ్ఞానాన్ని ముందుపెడుతుంది, ప్రోత్సహిస్తుంది" అన్నాడు. సామాజిక జీవితాలకు కావలసిన వనరులను చూపెడుతుంది, పలు మతాల వారికి సామాజిక స్థితిగతుల శాస్త్రాలను బోధిస్తుంది.[5]
రాజకీయ పదజాలంలో, లౌకిక వాదం (సెక్యులరిజం) అనునది, ప్రభుత్వాన్ని, మతాన్ని వేరుగా వుంచడం. అటువంటి ప్రభుత్వాన్ని "మతప్రసక్తి లేని లౌకిక రాజ్యం" (లేదా సూక్ష్మంగా "లౌకిక రాజ్యం" అని) గా వ్యవహరిస్తారు. ఈ విధానంలో రాజ్యము తన ప్రజలలో అనేక మతాలు కలిగివున్ననూ, ప్రభుత్వంలో ఏమతమూ కలిగి వుండక పోవడం. పౌరచట్టాలతో మత సంప్రదాయాలకు తావు లేకపోవడం, మతపరమైన తారతమ్యతలను తొలగించి మెజారిటీలు, మైనారిటీలు (మతపరంగా) సమాన పౌరహక్కులు కలిగివుండేటట్లుగా సూత్రీకరించి రాజ్యాంగ వ్యవస్థను తయారుచేయడం.[6]
రాజ్యాంగబద్దంగా లౌకిక రాజ్యాలకు ఉదాహరణ కెనడా, [7] భారతదేశం, ఫ్రాన్స్, అమెరికా, టర్కీ, దక్షిణ కొరియా.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.