From Wikipedia, the free encyclopedia
సిస్కో సిస్టమ్స్ ఇంక్, ఒక అమెరికన్ సాంకేతిక సమ్మేళనం. దీని ప్రధాన కార్యాలయం సాన్ జోసె లోని సిలికాన్ వ్యాలీ మధ్యలో ఉన్నది. సిస్కో వివిధ సాఫ్ట్వేర్, నెట్వర్కింగ్ హార్డ్వేర్, ఉన్నత సాంకేతికంగా రూపొందించిన ఉత్పత్తులు తయారీ చేస్తుంది.[1] సిస్కో అనేక సంస్థలను సముపార్జన చేసుకుంది. అందులో చెప్పదగినవి వెబ్బెక్స్, ఓపెన్ డి న్ స్, జబ్బర్, జాస్పర్.
సిస్కో సిస్టమ్స్ | |
---|---|
తరహా | Public |
స్థాపన | సాన్ జోసె,కాలిఫోర్నియా (1984)అమెరికా |
ప్రధానకేంద్రము | సాన్ జోసె,కాలిఫోర్నియా అమెరికా |
కీలక వ్యక్తులు | చక్ రొబ్బిన్స్, సి.ఈ.ఓ లియోనార్డ్ బోసాక్,సాండీ లెర్నర్(వ్యవస్థాపకులు) |
పరిశ్రమ | కంప్యూటర్ సాఫ్టువేరు కంప్యూటర్ హార్డ్వేర్ |
ఉత్పత్తులు | మొత్తం ఉత్పత్తులు లింకు |
రెవిన్యూ | $51.90 బిలియన్ USD (2019) |
2020 లో ఫార్చ్యూన్ మగజినె విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో పని చేయడానికి ఉత్తమమైన సంస్థల్లో సిస్కో 4 వ స్థానం లో నిలిచింది.[2]
సిస్కో సిస్టమ్స్ డిసెంబర్ 1984 వ సంవత్సరంలో సాండీ లెర్నర్, తన భర్త అయినా లియోనార్డ్ బోసాక్ ఇద్దరిచె స్థాపించబడింది. వీళ్లిద్దరు స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం లో పనిచేసే వారు. విద్యాలయం లో ఉన్న అన్ని కంప్యూటర్లని కనెక్ట్ చేయడానికి ఒక బ్లూ బాక్స్[3] అనే ఉత్పత్తి ని కనుగొన్నారు. ఇందులో వాడిన ఆధునిక సాంకేతిక పద్ధతులు సిస్కో తుది రోజుల్లో విజయానికి చాలా సహకరించాయి[4]. సిస్కో పేరు శాన్ ఫ్రాన్సిస్కో అనే పట్టణ పేరు నుండి ధృవీకరించ పడింది. ఫిబ్రవరి 16 ,1990 లో మార్కెట్ లో పబ్లిక్ కి వెళ్ళింది. ఆధునిక రౌటర్ల అమ్మకాలు మొదలు పెట్టిన మొదటి సంస్థల్లో సిస్కో ప్రధాన పాత్రా పోషించింది.
1990లో ఇంటర్నెట్ ప్రోటోకాల్ ప్రపంచం వ్యాప్తంగా చాలా విస్తీరించింది. సిస్కో తాయారు చేసిన వివిధ ఉత్పత్తుల వల్ల మార్కెట్ లో చాల ముఖ్యమైన సంస్థ అయింది. మార్చ్ 2000లో, డాట్ కామ్ బబుల్ శిఖరాల్లో ఉన్నపుడు సిస్కో ప్రపంచం లో నే అత్యంత విలువైన సంస్థగ నిలిచింది[5]. 2000 దశాబ్దంలో సిస్కో ఇండియా లోకి ప్రవేశించి, బెంగుళూరు లో $1 బిలియన్ USD తో కార్యాలయం నిర్మాణం చేసి ఇండియా లో విలువని బల పరుచుకుంది[6].
సిస్కో ఉత్పత్తులు, సేవలు మూడు విభాగాల్లో ఎక్కువగా ఉన్నాయ్- ఎంటర్ప్రైస్, సేవా ప్రదాత, మధ్యస్థ వ్యాపారాలు. ఈ మూడు దశాబ్దాల్లో సిస్కో ఆసియా-పాకెఫిక్, ఆస్ట్రేలియా మార్కెట్ లో అన్ని రంగాల్లో స్థానాన్ని బలపరుచుకుంది.
వాయిస్ ఓవర్ ఐపి సేవలు అందించడం లో సిస్కో ప్రధాన సంస్థ అయింది. సైంటిఫిక్ అట్లాంట, లింక్సిస్ అనే సంస్థలు ని సముపార్జన చేసుకుని గృహ వినియోగదారుల మార్కెట్ లో కి ప్రవేశిస్తుంది. లింక్సిస్, చాల పెద్ద సంస్థలు అయిన స్కైప్, మైక్రోసాఫ్ట్, యాహు తో కలిసి వైర్లెస్ అండ్ కార్డ్లెస్ సేవలు వినియోగదారులకి అందించింది.
సిస్కో భాగస్వాములు క్లౌడ్ సేవలు యూనిఫైడ్ కంప్యూటింగ్ సిస్టం(యూ సి స్) ద్వారా అందించగలరు. ఇందులో భాగంగా వివిధ సేవలను వినియోగదారులకు అందచేస్తున్నరు. అందులో ముఖ్యమైనవి సిస్కో యూనిటీ కనెక్షన్, సిస్కో వెబెక్స్, సిస్కో యూనిఫైడ్ ప్రెజన్స్, సిస్కో యూనిఫైడ్ మొబిలిటీ.[7]
వ్యూహాత్మక కార్యకలాపాల లో భాగంగా సిస్కో అనేక నెట్వర్క్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ వెహికల్స్[8] ని నిర్వహించింది. ఈ వాహనాలని సహజ విపత్తు లో వాడతారు. విపత్తుల్లో ఈ వాహనాలు వైర్డ్, వైర్లెస్ సేవలు అందచేస్తాయి. సంక్షోభ ప్రాంతాల్లో ప్రజా ప్రతినిధులకు సురక్షితమైన వీడియో సమావేశాలను అందచేస్తుంది[9]. సిస్కో అందించిన సేవలకు అమెరికన్ రెడ్ క్రాస్ సంస్థ ఇన్నోవేషన్ ప్రిపరేషన్ అవార్డు ని అందచేసింది[10].
సిస్కో తాయారు చేసిన ఉత్పత్తులు అనేక సినిమా లో కనిపించడం జరిగింది. ఈ సంస్థ 2011 లో సొమెథింగ్ వెంచర్డ్ అనే డాక్యుమెంటరీ లో ప్రచురించపడింది.[11] 2003 లో యూ స్ ప్రభుత్వం రొన్ బ్రౌన్ అవార్డుని సిస్కో కి అందచేశారు[12].[13] 2019 లో ప్రపంచం లో పనిచేయడానికి ఉత్తమ కార్యాలయాలో సిస్కో మొదటి స్థానం లో నిలిచింది[14]. 2020 లో ఫార్చ్యూన్ విడుదల చేసిన 100 ఉత్తమ కార్యాలయాలో సిస్కో నాలుగవ స్థానం లో నిలిచింది.[15] లేక్స్ ఇన్నోవా అనే సాంకేతిక సంస్థ, 2015 లో ఇచ్చిన నివేదిక లో నెట్వర్క్-సెక్యూరిటీ భాగం లో అత్యధికమైన పేటెంట్స్(6442) సిస్కో వె.[16]
.* వినియోగదారుల వాడుక ని మీనోటర్ చేయడం సిస్కో ఒక్క లింక్సిస్ తాయారు చేసిన E2700, E3500, E4500 పరికరాలను ఫర్మ్వేర్ నవీకరణ వల్ల వినియోగదారుల క్లౌడ్ సేవలకు నమోదు చేసుకోవాల్సి వొచింది. దీని వల్ల సిస్కో వినియోగదాయురాల వాడుక ని మానిటర్ చేయడానికి కుదిరింది[17][18].
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.