తెలంగాణ, మెదక్ జిల్లా, సదాశివపేట మండలం లోని పట్టణం From Wikipedia, the free encyclopedia
సదాశివపేట, తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాకు చెందిన పట్టణం.[1]
సదాశివపేట | |
— పట్టణం — | |
తెలంగాణ పటంలో పట్టణ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 17.6160739°N 77.9184819°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | సంగారెడ్డి |
మండలం | సదాశివపేట |
ప్రభుత్వం | |
- మునిసిపల్ ఛైర్మన్ | పిల్లోడి జయమ్మ |
వైశాల్యము | |
- మొత్తం | 24.4 km² (9.4 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 42,809 |
పిన్ కోడ్ | 502291 |
Area code(s) | 08455 |
ఎస్.టి.డి కోడ్ |
ఇది పురపాలక సంఘం హోదా కలిగిన పట్టణం.1954లో స్థాపితమైన ఈ పురపాలక సంఘం మూడవ శ్రేణి పురపాలక సంఘంగా కొనసాగుతోంది. హైదరాబాదుకు పశ్చిమాన 68 కిమీ దూరంలో జాతీయ రహదారిపై ఉన్న సదాశివపేట పట్టణం 77° 57’ తూర్పు రేఖాంశం, 17° 37’ ఉత్తర అక్షాంశంపై ఉపస్థితియై ఉంది.
2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మెదక్ జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[2]
2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 94,337 - పురుషులు 47,665 - స్త్రీలు 46,672
2001 నాటికి పట్టణ జనాభా 36,334 కాగా, 2011 నాటికి 42,809కు పెరిగింది.2014 మార్చి నాటికి వార్డుల సంఖ్య 23, ఓటర్ల సంఖ్య 29255.[3] పట్టణ విస్తీర్ణం 24.4 చకిమీ. 2010లో పారిశుద్ధ్యం విషయంలో ఈ పురపాలక సంఘం రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు పొందింది.[4]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.